న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రీలంకకు షాక్: నిదాహాస్ ట్రోఫీ ఫైనల్‌కు బంగ్లాదేశ్

By Nageshwara Rao
 Sri Lanka

హైదరాబాద్: ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆతిధ్య శ్రీలంకపై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మరో బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ విజయంతో ముక్కోణపు టీ20 సిరిస్ ఫైనల్‌కు బంగ్లాదేశ్ చేరుకుంది. ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌(50) హాఫ్‌ సెంచరీ సాధించగా, మొహ్మదుల్లా(43 నాటౌట్‌)లు బంగ్లాదేశ్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. చివరి వరకు ఉత్కంఠ భరింతగా సాగిన పోరులో మొహ్మదుల్లా సిక్స్‌ కొట్టి విజయాన్ని అందించాడు.

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 159 పరుగులు చేసింది. కాగా, ఆదివారం జరిగే ఫైనల్‌లో భారత్‌తో బంగ్లాదేశ్ తలపడనుంది. మరొవైపు స్వదేశంలో జరిగిన ఈ సిరీస్‌లో శ్రీలంక ఫైనల్‌కు చేరకపోవడం ఆ దేశ అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది.


బంగ్లాదేశ్ విజయ లక్ష్యం 160

కోలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతోన్న టీ20లో ఆతిథ్య శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో బంగ్లాదేశ్‌కు 160 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఆరంభంలోనే కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. దనుష గుణతిలకా(4), కుశాల్‌ మెండిస్‌(11), ఉపుల్‌ తరంగా(5), షనక(0), జీవన్‌ మెండిస్‌(3) స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌‌కు చేరడంతో లంక 41 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కుశాల్ పెరీరా (61), తిషారా పెరీరా (58)లు హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఆతిథ్య శ్రీలంక ఈ మాత్రం నామమాత్రపు స్కోరు చేయగలిగింది. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మిగతావారంతా స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు.

తొలి 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసిన లంక... వీరి విజృంభణతో మిగతా 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. ఇక, బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజర్‌ రహ్మన్‌ రెండు వికెట్లు తీసుకోగా, షకిబ్‌, మెహదీ హసన్‌, రూబెల్ హుస్సేన్ తలో వికెట్‌ తీశారు.


కష్టాల్లో శ్రీలంక: చెలరేగుతున్న బంగ్లా బౌలర్లు
ముక్కోణపు టీ20 సిరిస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో శ్రీలంక బంగ్లా బౌలర్ల ధాటికి తొమ్మిది ఓవర్లు ముగిసేలోపే కీలక వికెట్లు కోల్పోయింది. 15 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 5 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కుశాల్ పెరీరా (51) ఆచితూచి ఆడుతూ పరుగులు రాబడుతున్నాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ప్రస్తుతం క్రీజులో కుశాల్ పెరీరా (51), తిషారా పెరీరా (18) పరుగులతో ఉన్నారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజర్‌ రహ్మన్‌ రెండు వికెట్లు పడగొట్టగా, షకిబ్‌, మెహదీ హసన్‌ చెరో వికెట్‌ తీశారు.

బంగ్లాదేశ్-శ్రీలంక టీ20 మ్యాచ్ లైవ్ స్కోరు కార్డు


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

నిదాహాస్ ముక్కోణపు టీ20 సిరిస్‌లో భాగంగా శ్రీలంక-బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే టైటిల్ పోరులో టీమిండియాతో తలపడుతుంది.

గాయం కారణంగా ఈ సిరిస్‌లో అంతకముందు జరిగిన మ్యాచ్‌లకు దూరమైన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ తిరిగి ఈ మ్యాచ్‌లో చోటు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక రెండు మార్పులతో బరిలోకి దిగింది. సురంగా లక్మల్, దశుమంతా చమీరాకు బదులు అమిలా అల్ఫాన్సో, ఇసురు ఉడానాకు తుది జట్టులో చోటు కల్పించారు.

ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఒత్తిడిలో ఉంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత లీగ్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ విజయం సాధించింది. దాంతో బంగ్లాను ఓడించి ఫైనల్‌కు చేరాలంటే లంక పూర్తిస్థాయిలో ఆడకతప్పదు. ఈ సిరిస్‌లో ఇప్పటికే టీమిండియా ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే.

జట్ల వివరాలు:
శ్రీలంక: ఉపుల్ తరంగా, దనుష్క గుణతిలకా, కుషల్ మెండిస్, కుషల్ పెరీరా(కీపర్), దాసున్ శంకా, తిషారా పెరీరా(కెప్టెన్), అమిలా అల్ఫాన్సో, జీవన్ మెండీస్, అఖిలా ధనుంజయ, ఇసురు ఉడానా, నువాన్ ప్రదీప్.

బంగ్లాదేశ్: తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, మహ్మదుల్లా, షకీబ్ అల్ హసన్(కెప్టెన్) ముష్ఫికర్ రహీమ్(కీపర్), లిటన్ దాస్, సబ్బీర్ రహ్మాన్, మెహిదీ హసన్, నజ్ముల్ ఇస్లాం, రుబెల్ హోస్సైన్,‌ ముస్తాఫిజుర్ రహ్మాన్.

Story first published: Friday, March 16, 2018, 23:45 [IST]
Other articles published on Mar 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X