న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

న్యూజిలాండ్‌ మసీదులో కాల్పులు: బంగ్లా క్రికెటర్లకు తప్పిన ప్రమాదం

Bangladesh cricketers escape Christchurch mosque shooting

హైదరాబాద్: న్యూజిలాండ్‌ సెంట్రల్ క్రైస్ట్‌చర్చ్‌ నగరంలోని ఓ మసీదులో గుర్తు తెలియని ఆగంతుకుడు శుక్రవారం విచక్షణారహితంగా కాల్పులు తెగబడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా తెలిపింది.

ధోనిని తక్కువగా అంచనా వేయొద్దు: అభిమాని ట్వీట్‌కు క్లార్క్ రిప్లైధోనిని తక్కువగా అంచనా వేయొద్దు: అభిమాని ట్వీట్‌కు క్లార్క్ రిప్లై

హగ్లీపార్క్‌లో సమీపంలోని మజీదుపై ప్రార్థన సమయంలో నల్లరంగు దుస్తులు ధరించిన ఓ వ్యక్తి అల్ నూర్ మసీదు లోపలకు వచ్చి కాల్పులు జరిపాడు. దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. కాల్పులకు తెగబడిన వ్యక్తిపై భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరుపుతున్నారు.

ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. నగరంలోని ప్రజలు ఎవరూ బయటికి రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ దాడితో భయభ్రాంతులకు లోనైన సమీప ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు. మసీదులో పలు మృతదేహాలు పడి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

మృతుల సంఖ్యను అధికారికంగా ప్రకటించినప్పటికి ప్రాణనష్టం ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. ఇక, ప్రస్తుతం ఆ దేశ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు ఈ కాల్పుల ఘటన నుంచి సురక్షితంగా బయటపడింది. టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జట్టుతో మూడో టెస్టు ఆడనున్న బంగ్లా క్రికెట్ జట్టు దాడి సమయంలో ఆ ప్రాంతంలోనే ఉండడం గమనార్హం.

బంగ్లా ఆటగాళ్లు ప్రార్థనల కోసం మజీదుకు వెళ్లగా.. ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం విన్న ఆటగాళ్లు పరుగులు తీశారు. ఈ కాల్పులు నుంచి బంగ్లా ఆటగాళ్లు సురక్షితంగా బయటపడ్డారని ఆ జట్టు ఆటగాడు తమీమ్‌ ఇక్బాల్‌ ట్వీట్‌ చేశాడు. ''దాడి నుంచి మొత్తం జట్టు తప్పించుకుంది. ఇది భయంకరమైన అనుభవం. మీ అందరి ఆశీస్సులే మమ్మల్ని కాపాడాయి" అని తమీమ్ పేర్కొన్నాడు.

మరోవైపు బంగ్లా కోచ్ మాట్లాడుతూ ఈ కాల్పుల ఘటన జరిగిన సమీపంలోనే తమ ఆటగాళ్లు ఉన్నారని, కానీ ఆ దేవుడి దయ వల్ల ఎలాంటి నష్టం జరగలేదని మీడియాకు తెలిపాడు. ఈ ఘటనతో ఆటగాళ్లు వణికిపోయారన్నాడు. ఆ అల్లానే తమని రక్షించారని ముష్పికర్‌ రహీమ్‌ ట్వీట్‌ చేశాడు. తాము చాలా అదృష్టవంతులమని, జీవితంలో మళ్లీ ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడదల్చుకోలేమని అన్నాడు.

Story first published: Friday, March 15, 2019, 9:52 [IST]
Other articles published on Mar 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X