న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంగ్లాదేశ్ బౌలింగ్ కోచ్‌గా ఒట్టిస్ గిబ్సన్

Bangladesh appoints Ottis Gibson as bowling coach

హైదరాబాద్: వెస్టిండిస్ మాజీ ఆటగాడు ఒట్టిస్ గిబ్సన్‌ను బంగ్లాదేశ్ బౌలింగ్ కోచ్‌గా నియమితులయ్యారు. 50 ఏళ్ల గిబ్సన్ రెండేళ్ల పాటు బౌలింగ్ కోచ్‌గా సేవలందిస్తారని ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మంగళవారం అధికారక ప్రకటన చేసింది.

చార్ల్ లాంగ్వెల్డ్ట్ స్థానంలో గిబ్సన్ బౌలింగ్ కోచింగ్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిపింది. కాగా, గతేడాది డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా కోచింగ్ సిబ్బందిలో చేరేందుకు గాను చార్ల్ లాంగ్వెల్డ్ట్ బౌలింగ్ కోచ్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

జట్టుకు ఎంపికైన ఆనందంలో చెలరేగిన పృథ్వీ షా, శాంసన్... ఇండియా-ఎ విజయంజట్టుకు ఎంపికైన ఆనందంలో చెలరేగిన పృథ్వీ షా, శాంసన్... ఇండియా-ఎ విజయం

ఒట్టిస్ గిబ్సన్ విషయానికి వస్తే గతంలో వెస్టిండిస్, దక్షిణాఫ్రికా జట్లకు కోచ్‌గా వ్యవహారించారు. ఆగస్టు 2017 నుంచి ఆగస్టు 2019 మధ్య కాలంలో సఫారీ జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్న గిబ్సన్ ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా పేలవ ప్రదర్శన చేయడంతో కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు.

గిబ్సన్ నియామకంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉద్దిన్ చౌదరి మాట్లాడుతూ "ఎన్నో జట్లకు కోచ్‌గా.. ఆటగాడిగా అతడికి అపారమైన అనుభవం ఉంది. అతను బంగ్లాదేశ్ క్రికెట్‌ను దగ్గరగా చూసే అవకాశం కూడా ఉంది. బంగ్లాదేశ్ జట్టు కోచింగ్ గ్రూపుకు చాలా విలువైనవాడవుతాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను" అని అన్నారు.

డుప్లెసిస్‌కు షాకిచ్చిన బోర్డు: వన్డే కెప్టెన్‌గా డీకాక్, చోటు కూడా దక్కలేదుడుప్లెసిస్‌కు షాకిచ్చిన బోర్డు: వన్డే కెప్టెన్‌గా డీకాక్, చోటు కూడా దక్కలేదు

పాకిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ టీ20ల సిరీస్‌కు ముందు బుధవారం లాహోర్‌కు బయలుదేరిన జాతీయ జట్టుతో అతను వెంటనే పని ప్రారంభిస్తాడని ఉద్దిన్ చౌదరి తెలిపాడు. కాగా, ఒట్టిస్ గిబ్సన్ వెస్టిండిస్ తరుపున రెండు టెస్టులు, 15 వన్డేలకు ప్రాతినిథ్యం వహించాడు.

Story first published: Wednesday, January 22, 2020, 13:33 [IST]
Other articles published on Jan 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X