న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేడు కేకేఆర్‌తో ఆర్‌సీబీ ఢీ.. ఆర్‌సీబీ ఖాతా తెరిచినా?

Bangalore vs Kolkata match Today in M Chinnaswamy Stadium, Bengaluru

శుక్రవారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి మైదానం వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు తలపడనుంది. ఐపీఎల్‌ సీజన్-12లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ బెంగళూరు జట్టు వరుసగా ఓటములను ఎదుర్కొంది. దీంతో బెంగళూరుపై ఆ జట్టు అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు కనీసం ఈ మ్యాచ్‌లో అయినా విజయం సాధించి పాయింట్ల ఖాతా తెరుస్తుందేమో అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇద్దరూ సరైన ఇన్నింగ్స్ ఆడలేదు:

ఇద్దరూ సరైన ఇన్నింగ్స్ ఆడలేదు:

బెంగళూరు జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. విరాట్ కోహ్లీ, డివిలియర్స్, పార్థివ్ పటేల్, మొయిన్ అలీ, గ్రాండోమ్, చాహల్, హెట్మయర్, యాదవ్ లాంటి ఆటగాళ్లు ఉన్నా.. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లోనూ బెంగళూరు గెలుపు రుచి చూడలేదు. ముఖ్యంగా డివిలియర్స్, కోహ్లీలు అంచనాలను అందుకోలేకపోయారు. ఈ సీజన్‌లో కోహ్లీ ఇప్పటి వరకు 4 మ్యాచులలో కలిపి మొత్తం 78 పరుగులు చేశాడు. ముంబయి ఇండియన్స్‌పై చేసిన 48 పరుగులు అత్యధికం. చెన్నైపై 6 పరుగులు, హైద్రాబాదుపై 3 పరుగులు, రాజస్తాన్‌పై 23 పరుగులు చేసాడు. బెంగళూరుకు గెలిపించే ఒక్క సరైన ఇన్నింగ్స్ కూడా కోహ్లీ ఆడలేదు. మరోవైపు డివిలియర్స్ పరిస్థితి దాదాపు ఇంతే. గ్రాండోమ్, హెట్మయర్ ఇద్దరూ కూడా బ్యాట్ జులిపించనేలేదు. వరుస ఓటములతో సతమవుతున్న బెంగళూరును విజయాల బాట పట్టించాలంటే వీరందరూ రాణించాల్సిన అవసరం ఎంతో ఉంది.

బౌలింగ్‌లో కూడా తేలిపోతున్నారు:

బౌలింగ్‌లో కూడా తేలిపోతున్నారు:

బ్యాటింగ్‌లో విఫలమయినా.. బౌలింగ్‌తో నెట్టుకొద్దామనుకుంటే అది కూడా బెంగళూరు జట్టుకు కలిసి రావడం లేదు. టీమిండియా ప్రధాన స్పిన్నర్ చాహల్ కూడా ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. పేసర్లు ఉమేష్, సిరాజ్ లు కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. సైనీ ఒక్కడు మాత్రం కాస్త పరవాలేదనిస్తున్నాడు. మరి ఈ రోజైనా గాడిలో పడితేనే తొలి విజయం దక్కుతుంది.

సమిష్టిగా రాణిస్తోంది:

సమిష్టిగా రాణిస్తోంది:

మరోవైపు కేకేఆర్‌ జట్టు ఆడిన మూడింట్లో రెండు విజయాలు సాధించింది. అయితే మరో దాంట్లో మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్ లో ఢిల్లీ గెలిచింది. మొత్తానికి కేకేఆర్‌ ఈ సీజన్-12లో ఇప్పటివరకూ బాగానే రాణించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో సత్తాచాటి ప్రత్యర్థులకు బలమైన పోటీ ఇస్తోంది. బ్యాటింగ్లో రాణా, కార్తీక్, రస్సెల్, ఊతప్పలు తలో మ్యాచ్‌లో మెరిశారు. అయితే స్టార్ ఆటగాడు క్రిస్ లిన్ ఫామ్ అందుకోవాల్సి ఉంది. ఇతను కూడా రాణిస్తే కేకేఆర్‌కు తిరుగుండదు. ఇక బౌలింగ్లో ప్రసిద్ కృష్ణ , నరైన్, ఫెర్గుసన్, రస్సెల్, చావ్లాలు ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. రెండు విభాగాల్లో కేకేఆర్‌ పటిష్టంగానే ఉంది. దీంతో కేకేఆర్‌ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది.

జట్టు అంచనా

జట్టు అంచనా

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు:

క్రిస్ లిన్, సునీల్ నరైన్, రాబిన్ ఉతప్ప, శుభ్‌మన్ గిల్, నితీశ్ రాణా, దినేశ్ కార్తీక్ (కెప్టెన్), ఆండ్రూ రసెల్, పీయూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, లాకీ ఫెర్గ్యూసన్, ప్రసీద్ కృష్ణ.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు జట్టు:

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), పార్థివ్‌ పటేల్, డివిలియర్స్‌, శివమ్‌ దూబె, హెట్‌మెయిర్‌, స్టాయినిస్‌, మొయిన్‌ అలీ, గ్రాండ్‌హోమ్‌, యజువేంద్ర చాహల్‌, ఉమేశ్‌ యాదవ్, నవ్‌దీప్‌ సైని.

ఈ రోజు రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

Story first published: Friday, April 5, 2019, 16:58 [IST]
Other articles published on Apr 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X