న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీబీఎల్: పెర్త్ స్కార్చర్స్ కెప్టెన్‌గా మిచెల్ మార్ష్, బాన్‌క్రాప్ట్‌కు చోటు

By Nageshwara Rao
 Bancroft named in Scorchers squad, Mitchell Marsh appointed captain

హైదరాబాద్: ఆస్ట్రేలియా వేదికగా త్వరలో బిగ్ బాష్ లీగ్(బీబీఎల్) తదుపరి సీజన్ ఆరంభంకానుంది. దీంతో, ఈ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌ను ఆ జట్టు యాజమాన్యం ఎంపిక చేసింది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన చేసింది.

బాల్ టాంపరింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటీ?బాల్ టాంపరింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటీ?

మాజీ కెప్టెన్ ఆడమ్ వోజెస్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కెప్టెన్సీ పదవి కోసం కసరత్తులు చేసిన పెర్త్ తాజాగా తన నిర్ణయాన్ని వెల్లడించింది. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వొజెస్ ఆ జట్టు కోచింగ్ బాధ్యతలను చేపట్టాడు. మూడు సార్లు బిగ్‌బాష్ లీగ్ విజేతగా నిలిచిన పెర్త్ జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు.

వచ్చే టోర్నీలోనూ సత్తాచాటి టైటిల్ నెగ్గాలని ఫ్రాంఛైజీ భావిస్తోంది. టోర్నీలో భాగంగా డిసెంబర్ 20న బీబీఎల్‌లో పెర్త్ స్కార్చర్స్ తమ తొలి మ్యాచ్‌ను ఆడనుంది. బాల్ టాంపరింగ్ ఘటనలో 9 నెలల పాటు నిషేధానికి గురైన కెమెరాన్ బాన్‌క్రాఫ్ట్‌కు కూడా జట్టులో చోటు కల్పించారు.

బిగ్ బాష్ లీగ్ కొత్త సీజన్ ఆరంభమయ్యే నాటికి కామెరూన్ బాన్‌క్రాప్ట్‌పై ఉన్న నిషేధం తొలగిపోనుంది. డిసెంబర్ 30న హోబార్ట్ హరికేన్స్‌తో మ్యాచ్‌లో అతడు బరిలో దిగనున్నట్లు పెర్త్ షాకర్స్ మేనేజ్‌మెంట్ అధికారిక ప్రకటన చేసింది.

పెర్త్ షాకర్స్ జట్టు:
Ashton Agar, Cameron Bancroft, Jason Behrendorff, Hilton Cartwright, Nathan Coulter-Nile, Cameron Green, Josh Inglis, Michael Klinger, Mitchell Marsh (c), Shaun Marsh, Joel Paris, Jhye Richardson, Ashton Turner, Andrew Tye, Sam Whiteman, David Willey.

Story first published: Saturday, September 8, 2018, 9:47 [IST]
Other articles published on Sep 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X