చెన్నైలో మ్యాచ్‌లు డౌటే!: ఐపీఎల్‌ను బాయ్‌కాట్ చేయాలని పార్టీల నిర్ణయం

Posted By:
Ban IPL matches in Chennai till Cauvery Management Board is formed: TVK

హైదరాబాద్: చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగేది డౌట్‌గానే కనిపిస్తోంది. కావేరీ జలాల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందని, వెంటనే కావేరి మేనేజ్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలనే తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా అధికార, విపక్షాలతో పాటు పలు ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి.

ఈ నేపథ్యంలో చెన్నైలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను బాయ్‌కాట్ చేయాలని అన్ని పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో చెన్నైలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌లపై అనుమానాలు నెలకొన్నాయి. తమిళగ వాళ్వురిమై కట్చి(టీవీకే) పార్టీ నేతలు ఏకంగా చెన్నైలో ఐపీఎల్‌ మ్యాచ్‌లను నిలిపివేయాలని ఆ నగర పోలీస్‌ కమీషనర్‌కు వినతి పత్రం అందజేశారు.

ఐపీఎల్ ఓ పిచ్చి గేమ్

ఐపీఎల్ ఓ పిచ్చి గేమ్

ఈ సందర్భంగా టీవీకే పార్టీ నాయకులు మాట్లాడుతూ కావేరి మేనేజ్‌మెంట్ బోర్డుని ఏర్పాటు చేసే వరకు మ్యాచ్‌లను నిలిపివేయాలని కోరామని, ఒక వేళ మ్యాచ్‌లు నిర్వహిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. మరోవైపు దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ ఐపీఎల్ ఓ పిచ్చి గేమ్ అని, ఐపీఎల్ మ్యాచ్‌లు తమిళులు ఏకం కావాల్సిన సమయంలో వారి ఐకమత్యాన్ని దెబ్బ తీస్తున్నాయని అన్నాడు.

గత రెండు సీజన్లకు దూరమైన చెన్నై అభిమానులు

గత రెండు సీజన్లకు దూరమైన చెన్నై అభిమానులు

స్పాట్ ఫిక్సింగ్‌ ఆరోపణలతో చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టుపై నిషేదం విధించడంతో గత రెండు సీజన్లకు చెన్నై అభిమానులు దూరమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో ఎక్కువ మంది అభిమానులు కలిగిన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్‌లోకి అడుగుపెడుతున్న చెన్నై తిరిగి పునర్‌ వైభవాన్ని సాధించాలనే కసితో ఉంది.

తొలి మ్యాచ్‌లో హాట్ ఫేవరేట్‌గా చెన్నై

తొలి మ్యాచ్‌లో హాట్ ఫేవరేట్‌గా చెన్నై

ఈ నేఫథ్యంలో ఈ సీజన్‌ మ్యాచ్‌లు జరిగే దానిపై అనుమానాలు నెలకొనడం అభిమానులను కలవర పెడుతోంది. టోర్నీలో భాగంగా చెన్నై జట్టు తన తొలి మ్యాచ్‌ని డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ధోనీ నేతృత్వంలోని చెన్నై జట్టుని హాట్‌ ఫేవరెట్‌గా పరిగణిస్తున్నారు. ధోని నాయకత్వంలోని చెన్నై 2010, 2011లో రెండుసార్లు టైటిల్‌ సాధించింది.

11వ సీజన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అభిమానులు

11వ సీజన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అభిమానులు

రెండేళ్లపాటు ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరమైన చెన్నై అభిమానులు ఈ ఏడాది 11వ సీజన్ పోటీల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 10న చెన్నై నగరంలో చెన్నై, కోల్‌కతా జట్ల మధ్య జరుగనున్న తొలి మ్యాచ్ టిక్కెట్లన్నీ ఇప్పటికే అమ్ముడుపోయాయి. ఈ సమయంలో రాజకీయ పార్టీలు ఈ నిర్ణయం తీసుకోవడం అభిమానులను తట్టుకోలేకపోతున్నారు.

ఏడు మ్యాచ్‌లు చెపాక్ స్టేడియంలో

ఏడు మ్యాచ్‌లు చెపాక్ స్టేడియంలో

చెపాక్ స్టేడియంలోని లోయర్ టైర్‌లో ఉన్న సీ, డి, ఈ స్టాండ్లకు టిక్కెట్ ధర రూ.1300గా నిర్ణయించారు. ప్రీమియం టిక్కెట్ల ధరలు రూ.6,500గా ఉన్నాయి. కౌంటర్‌లో ఓ వ్యక్తికి రెండు టిక్కెట్లు మాత్రమే ఇస్తున్నారు. కాగా, ఐపీఎల్ సీజన్ 11లో ఏడు మ్యాచ్‌లు చెపాక్ స్టేడియంలో జరుగనున్నాయి. తొలి మ్యాచ్ అనంతరం ఏప్రిల్ 20, 28, 30, మే 5, 13, 20 తేదీల్లో మ్యాచ్‌లు ఇక్కడ జరగనున్నాయి.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Friday, April 6, 2018, 13:31 [IST]
Other articles published on Apr 6, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి