న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గమ్మత్తైన సిక్సు: బౌలర్ తలను తాకి బౌండరీ అవతల పడిన బంతి (వీడియో)

By Nageshwara Rao
Ball hits bowler's head but flies for a six in 50-over match in New Zealand

హైదరాబాద్: న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ వేదికగా జరిగిన ఓ దేశవాళీ టోర్నీలో నమోదైన ఓ సిక్సు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా సిక్సులంటే బ్యాట్స్‌మెన్ బాదిన బంతి అమాంతం గాల్లో బౌండరీ అవతల పడుతుంది. ధోని, క్రిస్ గేల్ లాంటి ఆటగాళ్లు కొట్టిన సిక్సులు స్టేడియం బయటపడటాన్ని కూడా మనం ఛూశాం.

అయితే ఈ గమ్మత్తు అయిన సిక్సు మాత్రం ఆక్లాండ్‌లోని పుకెకురా పార్క్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ఈ దేశవాళీ టోర్నీలో ఆక్లాండ్‌-క్యాంటెర్‌బరీ జట్లు తలపడ్డాయి. ఇన్నింగ్స్‌ 19 ఓవర్‌లో ఆక్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ జీత్‌ రావల్‌ కొట్టిన ఈ సిక్స్ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయింది.

క్యాంటెర్‌బరీ కెప్టెన్‌ ఆండ్రూ​ ఎల్లిస్‌ వేసిన ఓవర్‌లో బ్యాట్స్‌మన్ జీత్‌ రావల్‌ బాదిన బంతి నేరుగా బౌలర్ ఎల్లిస్‌ తలకు బలంగా తగిలి నేరుగా బౌండర్ అవతల పడింది. తొలుత అంపైర్‌ ఫోర్‌ ఇవ్వగా రిప్లేలో సిక్స్‌ అని తేలడంతో అందరు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.

అయితే బంతి బౌలర్ తలను బలంగా తాకడంతో ఒక్కసారిగా మైదానంలోని ఆటగాళ్లు ఆందోళనకు గురయ్యారు. ఎల్లిస్‌కు ఎలాంటి గాయం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ మ్యాచ్లో జీత్ రావెల్‌ అద్భుత సెంచరీ సాధించడంతో ఆక్లాండ్‌ విజయం సాధించింది.

Ball hits bowler's head but flies for a six in 50-over match in New Zealand

మ్యాచ్‌ అనంతరం జీత్ రావల్‌ మాట్లాడుతూ 'ఆండ్రూ ఎల్లిస్‌ గాయపడ్డాడని చాలా కంగారు పడ్డా. నా వల్ల అతనికి గాయమైందో ఏమోనని ఆందోళన చెందా. కానీ అతనికేం కాలేదు. దీంతో ఊపిరి పీల్చుకున్నా. ఇలాంటి అనుభవం ఎవరికి ఎదురుకాలేదనుకుంటా' అని అన్నాడు.

Story first published: Wednesday, February 21, 2018, 20:45 [IST]
Other articles published on Feb 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X