న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జెర్సీ మార్చుకుంటూ.. బౌండ‌రీ మిస్ చేసిన ఫీల్డర్! (వీడియో)

Ball goes past to boundary when fielder Rohan Mustafa changes his jersey in T10 League

అబుదాబి: క్రికెట్‌లో అప్పుడప్పుడూ కొన్ని సరదా సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఒక్కోసారి ఇంత‌కుముందెప్పుడూ చూడని హాస్యాస్పద ఘటనలు కూడా నమోదవుతుంటాయి. అయితే అవి అభిమానులను, ఆటగాళ్లను ఎంతగానో నవ్వులు తెప్పిస్తుంటాయి. అలాంటి ఘటనే అబుదాబి టీ10 లీగ్‌లో సోమవారం చోటుచేసుకుంది. మ్యాచ్‌ జరుగుతుండగానే ఓ క్రికెటర్‌ మైదానంలో ఫీల్డింగ్‌ చేస్తూ జెర్సీ మార్చుకుంటుంన్నాడు. అదే సమయంలో బ్యాట్స్‌మన్‌ ఆడిన షాట్‌కు బంతి బౌండరీ వైపు దూసుకెళ్లడంతో.. ఆ ఫీల్డర్‌ అలాగే పరుగెత్తాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే...

జెర్సీ మార్చుకుంటుండగా:

అబుదాబి టీ10 లీగ్‌లో భాగంగా సోమవారం సాయంత్రం నార్తన్‌ వారియర్స్‌, టీమ్ అబుదాబి జట్ల మధ్య 14వ లీగ్‌ మ్యాచ్‌ జరిగింది. లక్ష్య ఛేదనలో నార్తన్‌ వారియర్స్ ఓపెనర్లు లెండిల్ సిమ్మన్స్, వసీమ్ ముహ్మద్‌ క్రీజులో ఉన్నారు. మూడో ఓవర్‌ను జామీ ఓవర్టన్ వేస్తున్నాడు. ఓవర్టన్ మూడో బంతి వేస్తుండగా టీమ్ అబుదాబి ఫీల్డర్, యూఏఈ అంతర్జాతీయ ప్లేయర్ రోహన్‌ ముస్తాఫా ఫీల్డింగ్‌ చేస్తూనే.. జెర్సీ మార్చుకునే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో వసీమ్‌ ముహ్మద్‌ భారీ షాట్ ఆడాడు. బంతి బౌండరీ వైపు దూసుకెళ్లడంతో.. అది చూసిన రోహన్‌ ఒంటిపై సగం ధరించిన జెర్సీతోనే పరుగులు తీశాడు. కానీ లాభం లేకపోయింది.

న‌వ్వుకున్న ఆటగాళ్లు:

న‌వ్వుకున్న ఆటగాళ్లు:

జెర్సీ మార్చుకుంటూనే బాల్ వెనుక ప‌రుగెత్తిన రోహ‌న్ ముస్తాఫాను చూసి త‌న టీమ్‌తో పాటు ప్ర‌త్య‌ర్థి జట్టు ప్లేయ‌ర్స్ కూడా న‌వ్వుకున్నారు. రోహన్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది. అలీ రాజా అనే వ్యక్తి ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 'బంతి తన వద్దకు వస్తునప్పుడు రోహన్‌ ముస్తాఫా తన జెర్సీని మార్చుకున్నాడు' అని రాసుకొచ్చాడు. వీడియో చూసిన అందరూ బాగా ఆనందిస్తున్నారు. అంతేకాదు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఆలస్యం ఎందుకు మీరు చూసేయండి.

చివరి బంతికి రెండు పరుగులు:

చివరి బంతికి రెండు పరుగులు:

ఈ మ్యాచ్‌లో నార్తన్‌ వారియర్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్ అబుదాబి ‌నిర్ణీత 10 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 123 స్కోర్‌ సాధించింది. లూక్ ‌రైట్ ‌(33), జో క్లార్క్ ‌(50; 24 బంతుల్లో 5x4, 3x6), బెన్ డకెట్ ‌(31) రాణించారు. విండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ నిరాశపరిచాడు. 4 బంతుల్లో రెండు పరుగులే చేశాడు. రియాజ్, సిద్ధికి తలో వికెట్ తీశారు. అనంతరం నార్తన్‌ టీమ్‌ ఓపెనర్లు లెండిల్‌ సిమన్స్‌ (37), వసీమ్‌ మహ్మద్ (76; 34 బంతుల్లో 7x4, 6x6) చెలరేగడంతో రెండు వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయం సాధించింది. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. మిస్ ఫీల్డ్ చేయడంతో టీమ్ అబుదాబి మూల్యం చెల్లించుకుంది.

సెంచరీ చేయనందుకు కాదు.. మ్యాచ్ డ్రా అయినందుకు బాధపడ్డా: పంత్

Story first published: Tuesday, February 2, 2021, 12:53 [IST]
Other articles published on Feb 2, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X