న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు పండగలాంటి న్యూస్: కాక మీదున్న బెయిర్‌స్టో: కేప్టెన్‌గా సత్తా

Bairstow smashed 72 from 39 during the match between Welsh Fire and Southern Brave
Welsh Fire 165 for 4 (Bairstow 72, Duckett 53) beat Southern Brave 147 for 7

లండన్: జానీ బెయిర్‌స్టో. ఇంగ్లాండ్ జాతీయ జట్టులో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్‌గా మనకు తెలుసు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న డాషింగ్ ఓపెనర్‌గా సుపరిచితుడే. కేప్టెన్‌గా అతను జట్టును నడిపించినట్లు పెద్దగా తెలియదు. అద్భుతమైన డైవ్‌లతో క్యాచ్‌లను అందుకునే కీపర్‌గా, పిడుగుల్లాంటి షాట్లతో విరుచుకుపడే ఓపెనర్‌గా కనిపించిన బెయిర్‌‌స్టోలో మనకు తెలియని కొత్త కోణమే.. కేప్టెన్సీ. తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న వెల్ష్‌ఫైర్ జట్టును ఒంటిచేత్తో గెలిపించాడతను.

Bheemla Naik: పవన్ కల్యాణ్‌పై అభిమానాన్ని దాచుకోలేకపోయిన యంగ్ క్రికెటర్..ఇంగ్లాండ్ నుంచిBheemla Naik: పవన్ కల్యాణ్‌పై అభిమానాన్ని దాచుకోలేకపోయిన యంగ్ క్రికెటర్..ఇంగ్లాండ్ నుంచి

ఫుల్ ఫామ్‌లో బెయిర్‌స్టో..

ఫుల్ ఫామ్‌లో బెయిర్‌స్టో..

మరో నెలన్నర రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచులో ఆరంభం కానున్న ఈ పరిస్థితుల్లో బెయిర్ స్టో కాక మీద ఉండటం సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు పండగలాంటి వార్తే. ఇంగ్లాండ్‌లోని కార్డిఫ్‌లో కొద్దిసేపటి కిందటే ముగిసిన టీ20 మ్యాచ్‌లో బెయిర్‌స్టో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించాడు.. చుక్కలు చూపించాడు. ఓపెనర్‌గానే బరిలోకి దిగిన బెయిర్‌స్టో 30 బంతుల్లోనే 72 పరుగుల చేశాడు. అయిదు ఫోర్లు, అయిదు సిక్సర్లతో దుమ్ము దులిపాడు.

వంద బంతుల మ్యాచ్..

వంద బంతుల మ్యాచ్..

వెల్ష్‌ఫైర్ జట్టుకు జానీ బెయిర్‌స్టో కేప్టెన్. అతని సారథ్యంలోని ఈ జట్టు సదరన్ బ్రేవ్స్‌పై అద్భుత విజయాన్ని సాధించింది. వంద బంతుల మ్యాచ్ ఇది. ఇందులో ఓవర్లు ఉండవ్. బంతులే. ఒక్కో బౌలర్ వేసే ఓవర్లను కూడా బంతులుగానే పరిగణిస్తారు. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో బౌలర్ కనీసం 20 బంతులను వేయాల్సి ఉంటుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెల్ష్‌ఫైర్ జట్టు వంద బంతుల్లో నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఓపెనర్లు టామ్ బ్యాంటన్, జానీ బెయిర్‌స్టో తొలి వికెట్ భాగస్వామ్యానికి 31 బంతుల్లో 43 పరుగులు చేశారు. 34 పరుగులు చేసిన బ్యాంటన్ అవుట్ అయ్యాడు. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ బెన్ డక్కెట్ 34 బంతుల్లో 53 పరుగులు చేశాడు. జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, ఇనా్ కాక్‌బెయిన్ విఫలం అయ్యారు.

 లక్ష్యానికి దూరంగా..

లక్ష్యానికి దూరంగా..

వంద బంతుల్లో 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సదరన్ బ్రేవ్ జట్టు లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. నిర్ణీత వంద బంతుల్లో ఏడు వికెట్ల నష్టానికి 147 పరుగులుచేసింది. సదరన్ బ్రేవ్ జట్టు ఓపెనర్ క్వింటన్ డికాక్ ఏడు బంతుల్లోనే 21 పరుగులు చేశాడు. ఇందులో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ జేమ్స్ విన్సీ 27 బంతుల్లో ఒక సిక్సర్, నాలుగు ఫోర్లతో 40 పరుగులు చేశాడు. డెవాన్ కాన్వే -23, రాస్ విట్లే-25 పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్‌మెన్లెవరూ రాణించకపోవడంతో సదరన్ బ్రేవ్ జట్టు లక్ష్యానికి 18 పరుగుల దూరంలో ఆగిపోయింది. పరాజయాన్ని చవి చూసింది.

 కేప్టెన్‌గా కీలకంగా..

కేప్టెన్‌గా కీలకంగా..

కేప్టెన్‌గా తన జట్టును గెలిపించడంలో జానీ బెయిర్‌స్టో కీలక పాత్ర పోషించాడు. సకాలంలో బ్యాట్స్‌మెన్లపై ఒత్తిడిని తీసుకుని రావడంలో పక్కా వ్యూహాన్ని రచించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోన్నట్లు కనిపించిన క్వింటన్ డికాక్‌ను త్వరగా అవుట్ చేయడానికి అవసరమైన సూచనలు, సలహాలను బౌలర్లు ఇచ్చాడు. అతను ఇచ్చిన ట్రిక్‌లతో బౌలర్లు రానించారు. వెల్ష్‌ఫైర్ జట్టులో జేమ్స్ నీషమ్ మూడు వికెట్లను పడగొట్టాడు. ఐపీఎల్ 2021 సీజన్ 14వ ఎడిషన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములను చవి చూసింది. మిగిలిన మ్యాచ్‌లు సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ దశలో బెయిర్‌స్టో ఫామ్‌లోకి రావడం అభిమానులకు ఉత్సాహాన్ని ఇచ్చింది.

Story first published: Wednesday, July 28, 2021, 8:29 [IST]
Other articles published on Jul 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X