న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చాహర్ టీవీ ఇంటర్యూలో చిటపటలు: అయ్యర్‌తో అలా, దీపక్ చాహర్‌తో ఇలా(వీడియో)

India vs Bangladesh 2019,3rd T20I : Chahal Pokes Fun At Deepak Chahar For Breaking His Record
Bade hi besharam aadmi ho: Yuzvendra Chahal pokes fun at Deepak Chahar for breaking his record

హైదరాబాద్: నాగ్‌పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 30 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు టీ20ల సిరిస్‌ను 2-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ (62; 33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు)తో భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు.

భారత ఇన్నింగ్స్‌లో భాగంగా బంగ్లా బౌలర్ ఆఫిఫ్‌ హుస్సేన్‌ వేసిన 15 ఓవర్‌లో అయ్యర్‌ హ్యాట్రిక్‌ సిక్సర్లతో చెలరేగాడు. ఆ ఓవర్‌ తొలి బంతిని లాంగాన్‌ మీదుగా బౌండరీగా మలచిన అయ్యర్‌.. రెండో బంతిని నేరుగా స్టాండ్స్‌లోకి తరలించాడు. ఇక మూడో బంతిని మళ్లీ లాంగాన్‌ దిశగా భారీ సిక్స్‌‌గా బాదాడు.

<strong>నాగ్‌పూర్ టీ20లో 6 వికెట్లు: దీపక్ చాహర్ బద్దలు కొట్టిన రికార్డులివే!</strong>నాగ్‌పూర్ టీ20లో 6 వికెట్లు: దీపక్ చాహర్ బద్దలు కొట్టిన రికార్డులివే!

ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు

ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు

ఈ క్రమంలో అయ్యర్ కూడా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదుతాడేమోనని అభిమానుల్లో ఆశలు చిగురించాయి. అయితే, అయ్యర్‌ కూడా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాలనే అనుకున్నాడట. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం చాహల్ టీవికి ఇచ్చిన ఇంటర్యూలో శ్రేయాస్ అయ్యర్ స్వయంగా వెల్లడించాడు.

ఆరు సిక్సర్లు కొట్టాలని అనుకున్నా

ఆరు సిక్సర్లు కొట్టాలని అనుకున్నా

"నేను ఒక ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టాలని అనుకున్నాను, కానీ, ఆ తర్వాతి బంతిని బౌలర్ వైడ్ యార్కర్‌గా వేశాడు. ఏ బ్యాట్స్‌మెన్ అయినా తొలి మూడు బంతుల్ని సిక్సులుగా బాదిన తర్వాత ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టాలని అనుకుంటాడు. కానీ, అది సాధ్యం కాలేదు" అని శ్రేయాస్ అయ్యర్ తెలిపాడు.

ఆరు వికెట్లు తీసిన దీపక్ చాహర్

మరోవైపు ఈ మ్యాచ్‌లో దీపక్ చాహర్ ఆరు వికెట్లు తీసి అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దీపక్ చాహర్‌పై చాహల్ ఫన్నీ సెటైర్ వేశాడు. చాహాల్ టీవీకి ఇంటర్యూలో భాగంగా చాహల్ మాట్లాడుతూ "నా బౌలింగ్ రికార్డుని అధిగమించాడు, సిగ్గులేని వ్యక్తి" అంటూ దీపక్ చాహర్‌ను సంబోధించాడు.

అదొక అద్భుతమైన అనుభూతి

అదొక అద్భుతమైన అనుభూతి

టీ20 క్రికెట్‌లో దీపక్‌ చాహర్ చేసిన అత్యుత్తమ ప్రదర్శన 6/7. అంతకముందు శ్రీలంక ఆటగాడు అజంతా మెండిస్‌ (6/8; 2012లో జింబాబ్వేపై) రికార్డును బద్దలు కొట్టాడు. మెండిస్ రికార్డుని బద్దలు కొట్టడంపై దీపక్ చాహర్ మాట్లాడుతూ "నేను హ్యాట్రిక్ తీసుకున్నానని నేను గ్రహించలేదు, అదొక అద్భుతమైన అనుభూతి" అని పేర్కొన్నాడు.

Story first published: Monday, November 11, 2019, 14:58 [IST]
Other articles published on Nov 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X