న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నటాషా.. డైపర్లు వచ్చేస్తున్నాయ్‌!!: హార్దిక్‌ పాండ్యా ఆనందం

Babys Diapers On The Way: Hardik Pandya Begins Dad Duties

ముంబై: టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గురువారం తండ్రైన విషయం తెలిసిందే. హార్దిక్ భార్య నటాషా స్టాంకోవిక్ వడోదరలో పండంటి అబ్బాయికి జన్మనిచ్చారు. దీంతో హార్దిక్ ఒకవైపు ఆనందంలో మునిగితేలుతూ.. మరోవైపు పితృత్వపు మాధుర్యాని ఆస్వాదిస్తున్నాడు. ఇక తండ్రిగా సపర్యలు కూడా ప్రారంభించాడు. బాబుకు అవసరమైన డైపర్లు కొనుగోలు చేసి తీసుకొచ్చాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అతడు పంచుకున్నాడు.

 డైపర్లు వచ్చేస్తున్నాయి:

డైపర్లు వచ్చేస్తున్నాయి:

'నటాషా.. బుజ్జాయి డైపర్లు వచ్చేస్తున్నాయి' అని హార్దిక్‌ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పెట్టాడు. హార్దిక్‌ కారులో వెళ్లి డైపర్లు కొనుగోలు చేసిన అనంతరం పోస్ట్ పెట్టాడు. డైపర్లు కారు ముందు సీట్లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అయింది. 'అప్పుడే తండ్రిగా సపర్యలు ప్రారంభించాడు' అని కొందరు కెమెంట్ చేయగా.. 'ఎంజాయ్ హార్దిక్' అని ఇంకొందరు కెమెంట్ చేశారు. గురువారం కూడా హార్దిక్ ఓ పోస్ట్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో బాబు చేయి పట్టుకున్న ఫొటోను హార్దిక్ పంచుకున్నాడు.

నిరాడంబరంగా పెళ్లి:

నిరాడంబరంగా పెళ్లి:

హార్దిక్ పాండ్యా‌, నటాషా స్టాంకోవిక్ చాలాకాలం ప్రేమించుకున్నారు. అప్పుడప్పుడు కలిసి పార్టీలు, పార్క్‌లకు వెళ్లేవారు. హఠాత్తుగా గతేడాది డిసెంబర్‌ 31 రాత్రి దుబాయ్‌లో సముద్ర జలాల్లో విహరిస్తూ నటాషాకు హార్దిక్ నిశ్చితార్థపు ఉంగరం తొడిగేశాడు. ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. అయితే ఉన్నట్టుండి లాక్‌డౌన్‌లో అతడు మళ్లీ షాకిచ్చాడు. తన భార్య గర్భం దాల్చిందని చెప్పాడు. ఎవరినీ పిలవకుండా కుటుంబ సభ్యుల మధ్యే నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నట్టు ఆ తర్వాత తెలిసింది.

2016లో భారత్‌ తరఫున అరంగేట్రం:

2016లో భారత్‌ తరఫున అరంగేట్రం:

గుజరాత్‌కు చెందిన 26 ఏళ్ల హార్దిక్‌ పాండ్యా 2016లో భారత్‌ తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను 11 టెస్టులు, 54 వన్డేలు, 40 టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. సంప్రదాయక ఫార్మాట్‌లో 532, 50 ఓవర్ల ఫార్మాట్‌లో 957, పొట్టి క్రికెట్‌లో 310 పరుగులు చేశాడు. గతేడాది సెప్టెంబర్‌లో వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైన హార్దిక్‌.. శస్త్ర చికిత్స తర్వాత ఫిట్‌నెస్ సాధించి రీఎంట్రీకి సిద్దమయ్యాడు. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు ఎంపికైనా.. కరోనా వైరస్‌ కారణంగా ఆ సిరీస్ రద్దు అయింది. లాక్‌డౌన్‌ కలిసి రావడంతో మరింత ఫిట్‌నెస్‌ సాధించాడు.

మెరుపు సిక్సర్లు బాదాలని:

మెరుపు సిక్సర్లు బాదాలని:

ఇక ఈ ఏడాది ఐపీల్‌ 13వ సీజన్‌ సెప్టెంబర్‌-నవంబర్‌ మధ్యలో యూఏఈలో నిర్వహిస్తారని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ముంబై ఆటగాడు హార్దిక్‌ పాండ్యా త్వరలోనే ప్రాక్టీస్ మొదలు పెట్టాల్సి ఉంటుంది. తండ్రైన ఆనందంలో ఎప్పుడెప్పుడు మైదానంలో అడుగుపెట్టి మెరుపు సిక్సర్లు బాదేయాలా అని ఎదురుచూస్తున్నాడు.

టీమిండియా క్రికెటర్లు 150 రోజులు ఫ్యామిలీకి దూరం.. కారణం ఇదే!!

Story first published: Saturday, August 1, 2020, 12:59 [IST]
Other articles published on Aug 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X