న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తడబడిన పాక్ జర్నలిస్ట్‌.. అదిరే పంచ్ ఇచ్చిన బాబర్ ఆజామ్ (వీడియో)!!

Babar Azam reacts after Pakistani journalist mistook Bangladesh as Sri Lanka in press conference

రావల్పిండి: పాకిస్థాన్‌కు చెందిన ఓ జర్నలిస్ట్ తరచూ మీడియా సమావేశాల్లో తడబడి నవ్వులు పూయిస్తున్న విషయం తెలిసిందే. గతంలో శ్రీలంకతో పాకిస్థాన్ ఆడుతున్న సమయంలో డిసెల్వా బదులుగా డిక్వెలా అని తడబడిన పాక్ జర్నలిస్ట్‌.. మరోసారి అదే తప్పిదం చేసాడు. అయితే పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజామ్ ఆ జర్నలిస్ట్‌ తప్పిదాన్ని సరిచేశాడు. విషయంలోకి వెళితే...

<strong>మూడో వన్డేలో కివీస్‌ ఘన విజయం.. 3-0తో సిరీస్ వైట్‌వాష్‌.. భారత్ చెత్త రికార్డు!!</strong>మూడో వన్డేలో కివీస్‌ ఘన విజయం.. 3-0తో సిరీస్ వైట్‌వాష్‌.. భారత్ చెత్త రికార్డు!!

తడబడిన పాక్ జర్నలిస్ట్‌

తడబడిన పాక్ జర్నలిస్ట్‌

బంగ్లాదేశ్‌తో పాకిస్థాన్ తొలి టెస్ట్ మ్యాచ్‌ ముగిసింది. మ్యాచ్‌‌ మూడో రోజుకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో బాబర్ ఆజామ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పాకిస్థాన్ ఇంకా శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఆడుతుందని అనుకున్న సదరు పాక్ జర్నలిస్ట్.. శ్రీలంకను ఎదురుకొనేందుకు ఎటువంటి ప్రణాళికలు రచిస్తున్నారని బాబర్‌ను ప్రశ్నించాడు.

శ్రీలంకతో కాదు బంగ్లాదేశ్‌తో ఆడుతున్నాం:

'బాబార్.. నా పేరు అసద్ అలీ ముబారక్. శ్రీలంక జట్టును మొదటి సెషన్‌లోనే ఔట్ చేస్తారా?. దానికి మీరు ఏం ప్లానింగ్ చేస్తున్నారు?' అని ప్రశ్నించాడు. వెంటనే బాబర్ 'మేము ప్రస్తుతం శ్రీలంకతో కాదు బంగ్లాదేశ్‌తో ఆడుతున్నాం' అని ఆ జర్నలిస్ట్‌ తప్పిదంను సరి చేశాడు. బాబర్ సమాధానంతో అక్కడున్న వారు ఒక్కసారిగా నవ్వులు పూయించారు. మరోవైపు ఆ జర్నలిస్ట్‌ మాత్రం షాక్ అయ్యాడు.

డిసెల్వా కాదు.. డిక్వెల్లాను:

డిసెల్వా కాదు.. డిక్వెల్లాను:

గత ఏడాది డిసెంబరులో పాకిస్థాన్, శ్రీలంక మధ్య టెస్టు మ్యాచ్ జరుగుతున్న సమయంలోనూ ఇదే జర్నలిస్ట్‌ తప్పిదం చేసాడు. అప్పుడు మ్యాచ్ ముగిసే సమయానికి డిసెల్వా 87 పరుగులతో క్రీజులో ఉండగా.. మీడియా సమావేశానికి వచ్చిన డిక్వాల్లాని మీరు సెంచరీ చేస్తారా? ప్రశ్నించాడు. నేను డిసెల్వా కాదు.. డిక్వెల్లాను అని చెప్పాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ కోసం ప్రయత్నిస్తానని డిక్వెల్లా చెప్పాడు.

పాకిస్థాన్‌ విజయం:

పాకిస్థాన్‌ విజయం:

స్పిన్నర్‌ యాసిర్‌ షా నాలుగు వికెట్లతో తిప్పేయడంతో తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ను పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌ 44 పరుగుల తేడాతో ఓడించింది. మరో రోజు మిగిలుండగానే మ్యాచ్‌ను పాక్ కైవసం చేసుకొంది. ఫాలోఆన్‌ ఆడుతూ.. ఓవర్‌నైట్‌ స్కోరు 126/6తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 168 పరుగులకే ఆలౌటైంది. మరో 42 పరుగుల జోడించి మిగతా 4 వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 233, పాకిస్థాన్‌ 445 పరుగులు చేశాయి. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో పాక్‌ 1-0తో ఆధిక్యంలో ఉంది.

Story first published: Tuesday, February 11, 2020, 16:47 [IST]
Other articles published on Feb 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X