న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెప్టెన్‌కి ఉండాల్సిన అర్హతలు లేవు.. బాబ‌ర్‌ ఆజమ్‌పై మండిపడుతున్న మాజీలు!!

Babar Azam needs to take a leaf out of Imran Khans book with regards to personality says Shoaib Akhtar

కరాచీ: పాకిస్థాన్ కొత్త కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్‌పై ఆ దేశ మాజీలు షోయబ్ అక్తర్, రషీద్ లతీఫ్ మండిప‌డుతున్నారు. ఇటీవ‌లే వ‌న్డే సార‌థిగా ఎన్నికైన బాబ‌ర్‌.. మాజీ కెప్టెన్‌, ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌లా ఉండాల‌నుకుంటున్నాను అని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మీడియా సమావేశంలో బాబర్ తడబడ్డాడు, స్ప‌ష్ట‌మైన ఇంగ్లిష్ మాట్లాడ‌టానికి నేనేం తెల్లవాడిని కాదన్నాడు. వీటిపై అక్త‌ర్‌, ల‌తీఫ్ పెద‌వి విరిచారు.

'అవకాశాలపై చర్చించాం.. దక్షిణాఫ్రికా పర్యటనపై హామీ ఇవ్వలేదు''అవకాశాలపై చర్చించాం.. దక్షిణాఫ్రికా పర్యటనపై హామీ ఇవ్వలేదు'

షోయబ్ అక్త‌ర్ మాట్లాడుతూ.‌.. 'సార‌థి అన్నాక అన్ని అంశాల్లో జ‌ట్టును ముందుకు న‌డిపించ‌గ‌ల‌గాలి. ఆట‌గాడిగా క‌ష్టాల్లో ఉన్న జ‌ట్టును గ‌ట్టెక్కించ‌డంతో పాటు వ్య‌క్తిత్వం, భావ వ్య‌క్తీక‌ర‌ణ‌, ఆహార్యం, ఫిట్‌నెస్ ఇలా చాలా అంశాలు ఉంటాయి. అవ‌న్నీ ప‌క్క‌న పెట్టి ఇమ్రాన్ ఖాన్‌లా అన‌డం ఏంటి. అత‌డు ఓ మ‌హ‌వృక్ష‌మ‌ని భావిస్తే.. ఒక ఆకు స‌మానం కూడా బాబ‌ర్ సాధించ‌లేడు. ఇమ్రాన్ తరహాలో బాబర్ అజామ్ కూడా కెప్టెన్‌గా ఎదగాలని ఆశిస్తున్నాడు. కానీ ఇమ్రాన్ అంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు.. వ్యక్తిగతంగానూ హుందాగా వ్యవహరించే వ్యక్తి. బాబ‌ర్ ఇంకా చాలా చూడాల్సి ఉంది' అని అన్నాడు. ఇకనైనా కమ్యూనికేషన్ స్కిల్స్‌ మెరుగుపర్చుకుంటే మంచిదిని షోయబ్ హితవు పలికాడు.

'ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్‌గా బాబర్ ఆజామ్ తనకి ఎలాంటి విజన్ లేదని స్పష్టంగా చెప్పినట్లయింది. పాక్ కెప్టెన్ లక్ష్యాల గురించి కాకుండా.. కేవలం లాంగ్వేజ్ కారణంగా వార్తల్లో నిలవడమేంటి?. అతడ్ని ఇప్పటికే టీమిండియా విరాట్ కోహ్లీతో మేము పోలుస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా బాబర్ అజామ్ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ని చదవకుండా తనే సొంతంగా లక్ష్యాల గురించి మాట్లాడితే మంచిది' అని లతీఫ్ సూచించాడు. గత ఏడాది పాకిస్థాన్ వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి సర్ఫరాజ్ అహ్మద్‌ని తప్పించిన పీసీబీ.. వారం కింది వరకూ ఎవరికీ ఆ బాధ్యతలు అప్పగించలేదు. త్వరలో ఇంగ్లాండ్ పర్యటన ఉండడంతో ఆజమ్‌కు కెప్టెన్సీ కట్టబెట్టారు.

'ఇమ్రాన్‌ ఖాన్‌ చాలా దూకుడు గల కెప్టెన్‌. భవిష్యత్తులో నేను కూడా అలాగే ఉండాలని అనుకుంటున్నా. సారథ్యం అనేది మామూలు విషయం కాదు. కానీ సీనియర్ల నుంచి ఎంతో నేర్చుకున్నా. కెప్టెన్సీ కొత్తేం కాదు. అండర్‌-19 స్థాయి నుంచి జట్టును నడిపించిన అనుభవం ఉంది. ప్రస్తుతం బ్యాటింగ్‌ నైపుణ్యాలను మెరుగు పర్చుకోవడంతో పాటు.. ఇంగ్లిష్‌ నేర్చుకోవడంపై కూడా దృష్టిపెట్టా' అని బాబర్ ఆజామ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

Story first published: Friday, May 22, 2020, 21:39 [IST]
Other articles published on May 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X