న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Babar Azam: బాబర్‌కు ఆ బుర్ర లేదు.. కెప్టెన్సీ నుంచి తీసేయాలన్న మాజీ లెజెండ్

Babar Azam does not have the cricketing brain slams former spinner

పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై మాజీలు మండి పడుతున్నారు. న్యూజిల్యాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ ముగిసిన అనంతరం ఈ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఈ రెండు మ్యాచులను పాకిస్తాన్ అతి కష్టం మీద డ్రా చేసుకుంది. తొలి టెస్టులో ఆ జట్టు ఓటమిపాలయ్యేదే. అయితే లైటింగ్ సరిగా లేదనే కారణంతో అంపైర్లు మ్యాచ్ నిలిపివేశారు. దీంతో ఆ జట్టు బతికిపోయింది.

ఇక రెండో టెస్టులో 11వ నెంబర్ ఆటగాడు ఆ జట్టును ఆదుకున్నాడు. ఆ ఒక్క వికెట్ పడి ఉంటే కివీస్ గెలిచేది. అప్పుడు కూడా లైట్ సరిగా లేదని మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేశారు.

 ఒక్క ఇన్నింగ్స్ ముచ్చట..

ఒక్క ఇన్నింగ్స్ ముచ్చట..

ఈ సిరీస్ తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో పాక్ సారధి బాబర్ ఆజమ్ అద్భుతంగా ఆడాడు. ఏకంగా 161 పరుగులు చేసి విమర్శకులకు సమాధానం చెప్పాడు. అయితే ఆ తర్వాతి ఇన్నింగ్స్‌లో చేతులెత్తేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. ఇక రెండో టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో విఫలమైన అతను 24, 27 స్కోర్లు నమోదు చేశాడు. ముఖ్యంగా రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో జట్టును గెలిపించాల్సిన కెప్టెన్ ఇలా విఫలం అవడాన్ని ఆ జట్టు మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా విమర్శించాడు. బాబర్ ఫెయిలయ్యాడని తిట్టిపోశాడు.

బాబర్‌కు ఆ బుర్ర లేదు..

బాబర్‌కు ఆ బుర్ర లేదు..

రెండో టెస్టు చివరి ఇన్నింగ్స్‌లో కివీస్ లెగ్ స్పిన్నర్ మైకేల్ బ్రేస్‌వెల్ వేసిన బంతిని బ్యాక్ ఫుట్‌పై ఆడేందుకు ప్రయత్నించిన బాబర్ విఫలమయ్యాడు. ఈ క్రమంలో చాలా చిన్నగా ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ లాథమ్ చాకచక్యంగా పట్టేయడంతో బాబర్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఆ బంతిని స్వీప్ చేస్తే సరిపోయేదని కనేరియా అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడానికి కావలసిన అన్ని షాట్లు బాబర్ వద్ద లేవని, ఆ షాట్లు ఆడే క్రికెటింగ్ బుర్ర కూడా అతని దగ్గర లేదని కనేరియా విమర్శించాడు.

టెస్టు కెప్టెన్సీ అతనికివ్వాలి..

టెస్టు కెప్టెన్సీ అతనికివ్వాలి..

ఇలా విఫలం అవుతున్న బాబర్‌ను టెస్టు కెప్టెన్‌గా తొలగించాలని, పునరాగమనంలో అదరగొడుతున్న సర్ఫరాజ్ అహ్మద్‌కు మళ్లీ జట్టు పగ్గాలు అందించాలని కనేరియా సూచించాడు. అలాగే కొత్త కుర్రాడు షౌద్ షకీల్‌ కూడా అద్భుతంగా ఆడుతున్నాడని, అతన్ని టెస్టు ఫార్మాట్లో వైస్ కెప్టెన్ చేయాలని చెప్పాడు. అతను కచ్చితంగా భవిష్యత్తులో జట్టును ముందుండి నడిపిస్తాడని జోస్యం చెప్పాడు. కివీస్‌తో జరిగిన రెండో టెస్టులో షకీల్, సర్ఫరాజ్ ఇద్దరూ అద్భుతంగా రాణించారు. ఈ సిరీస్ మొత్తం రాణించిన సర్ఫరాజ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు కూడా దక్కిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, January 7, 2023, 12:29 [IST]
Other articles published on Jan 7, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X