న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా మార్పులు మాపై ప్రభావం చూపలేవు: టిమ్ పైన్

India vs Australia: Tim Paine Says 'Australian Team Is Still Work In Progress'
Australian team still a work in progress, feels Tim Paine

మెల్‌బోర్న్‌: మరోసారి టీమిండియాను ఎదుర్కొని అధిగమించే సామర్థ్యం తమకుందంటూ ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్‌పైన్‌ ధీమా వ్యక్తం చేశాడు. అనుభవం లేని ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం ఎదిగే దశలో ఉందని పేర్కొన్నాడు. మెల్‌బోర్న్‌లో బుధవారం మూడో టెస్టు ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడాడు. సిరీస్‌ 1-1తో సమమైన తరుణంలో కీలకమైన ఈ టెస్టు విజయం గురించి ప్రాక్టీసులో తీవ్రంగా శ్రమించినట్లు తెలిపాడు.

పెర్త్‌ విజయం ఆత్మవిశ్వాసం పెంచి

పెర్త్‌ విజయం ఆత్మవిశ్వాసం పెంచి

‘మేం భారత్‌పై గెలిచేశామని భావించడం లేదు. ఒక్కో టెస్టు గడిచేకొద్దీ ఎదుగుతున్నామని అనుకుంటున్నాం. పరిస్థితులు అనుకూలించినప్పుడు అత్యుత్తమ క్రికెట్‌ ఆడి రాణించాలి. రాబోయే నాలుగైదు రోజుల్లో మెరుగైన క్రికెట్‌ ఆడితే కచ్చితంగా పైచేయి సాధిస్తాం. ఎక్కువ అనుభవం లేని జట్టుకు పెర్త్‌ లాంటి విజయం ఆత్మవిశ్వాసం పెంచింది. మెల్‌బౌర్న్‌కు చక్కని అనుభూతితో వచ్చాం' అని పైన్‌ అన్నాడు.

మయాంక్.. సెహ్వాగ్‌లా ఆడాలని ఆశపడుతున్నా: సెహ్వాగ్

టీమిండియాలో మార్పులు ప్రభావం చూపవు

టీమిండియాలో మార్పులు ప్రభావం చూపవు

మూడో టెస్టులో భారత్‌ కీలక మార్పులు చేసింది. వరుస మ్యాచ్‌లలో విఫలమైన కేఎల్‌ రాహుల్‌, మురళీ విజయ్‌, పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ను తొలగించింది. మయాంక్‌ అగర్వాల్‌, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజాను తీసుకుంది. టీమిండియాలో మార్పులు తమపై ఎలాంటి ప్రభావం చూపవని పైన్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు.

లయన్ ఉండటం మా అదృష్టం

లయన్ ఉండటం మా అదృష్టం

టీమిండియాలో మార్పులతో మాకేం ఇబ్బంది లేదు. ఆ జట్టు సభ్యులు అందరిపై ఇంతకుముందే ప్రణాళికలు రచించాం. ఎవరి పని వారు చేసుకుంటారు. మేమేం చేయాలో అదే చేస్తాం. కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న తర్వాత వ్యక్తిగతంగా కూడా పెద్ద మార్పులేం చోటు చేసుకోలేదు. మెల్‌బౌర్న్‌ పిచ్‌ బాగుంది. ఫెఫీల్డ్‌ షీల్డ్‌లో ఇక్కడ చాలా మ్యాచ్‌లు జరిగాయి. టాస్‌ గెలిస్తే బ్యాటింగ్‌ ఎంచుకోవడం ఉత్తమం. లయన్‌ మా జట్టులో ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్‌‌గా ఎదుగుతున్నాడు. పరిస్థితులతో సంబంధం లేకుండా పని పూర్తి చేయగలడు.

1
43625
Story first published: Wednesday, December 26, 2018, 11:43 [IST]
Other articles published on Dec 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X