మయాంక్.. సెహ్వాగ్‌లా ఆడాలని ఆశపడుతున్నా: సెహ్వాగ్

బెంగళూరు: టీమిండియా టెస్టు జట్టులో అరంగ్రేటం చేస్తున్న మయాంక్‌కు ప్రోత్సహిస్తూ సెహ్వాగ్ తరహా ఆటను ఆడమని సూచిస్తున్నాడు అతని కోచ్ ఇర్ఫాన్ సైయిత్. పెర్త్ టెస్టు అనంతరం మార్పులు చేర్పులు చేపట్టిన టీమిండియా మేనేజ్‌మెంట్ మయాంక్‌కు అవకాశం కల్పించింది. ఎప్పటినుంచో నిరంతరం పరుగులు చేస్తూ శ్రమిస్తున్న అతడిని అదృష్టం ఇప్పటికి వరించిందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాతో మూడు టెస్టుకు ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఆంధ్రా ఆటగాడు హనుమ విహారితో కలిసి అతడు కొత్త బంతిని ఎదుర్కోనున్నాడు. తన శిష్యుడు అరంగేట్రం చేస్తున్న సందర్భంగా ఇర్ఫాన్ మీడియాతో మాట్లాడారు.

సాధారణంగా ఎవరితోనూ పోల్చను
‘మెల్‌బోర్న్ టెస్టులో మయాంక్ నుంచి సెహ్వాగ్ తరహా దూకుడైన ఇన్నింగ్స్‌ను ఆశిస్తున్నా. సాధారణంగా ఎవరితోనూ పోల్చను. కానీ చాలాసార్లు మయాంక్‌లో వీరూ వైఖరి చూశాను. అతనెప్పుడూ మామూలుగా ఉండడు. చాలా కసితో ఆడతాడు. పట్టుదల ఉన్న క్రికెటర్. బంతిని ఏదో పక్కకు తరలించాలని చూడడు. సానుకూలంగా ఉంటాడు. నిరాశతో కనిపించడు. మయాంక్‌కు వికెట్‌ను ఊరికే పారేసుకోవడం అతనికిష్టం ఉండదు. చాలా తీవ్రతతో ఆడతాడు. అతనిప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు.
ఆదిలోనే ఆటంకం, తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా

దూకుడును కొనసాగించాలని కోరుకుంటున్నా
మయాంక్ దూకుడును కొనసాగించాలని కోరుకుంటున్నా. భారత్-ఎ తరఫున హోబర్ట్‌లో ఆడిన మయాంక్‌కు అదృష్టం కలిసిరాలేదు. ఆ మ్యాచ్‌లో ఆసీస్ అండర్-19పై 161 పరుగులు చేశాడు. నిజానికి అతడు తొలి బంతికే ఔటయ్యాడు. బెయిల్స్ కింద పడకపోవడంతో నాటౌట్‌గా ప్రకటించారు' అని ఇర్ఫాన్ అన్నారు.

రంజీలో మయాంక్ పరుగుల వరద
దేశవాళీ క్రికెట్‌లో మయాంక్ పరుగుల వరద పారించాడు. వచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. ఈ ఏడాది రంజీ ట్రోఫీలో మయాంక్ పరుగుల వరద పారించాడు. ఒక ట్రిపుల్, మూడు సెంచరీలతో పాటు ఐదు హాఫ్ సెంచరీలు బాదేశాడు. 76.46 సగటుతో 1003 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications