న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్‌ అమ్మాయిల సంబరాలు.. పాప్‌ సింగర్‌ కేటీ పెర్రీతో చిందులు (వీడియో)!!

Australian players set the stage on fire with Katy Perry after Womens T20 World Cup win

మెల్‌బోర్న్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌ 2020లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆదివారం భారత్‌తో ఎంసీజీలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 85 పరుగుల భారీ తేడాతో గెలిచి ఐదోసారి కప్పును ముద్దాడింది. ఆసీస్ ఓపెనర్లు ఎలీసా హేలీ (39 బంతుల్లో 75; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), బెత్‌ మూనీ (54 బంతుల్లో 78 నాటౌట్‌; 10 ఫోర్లు) విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఎలీసా చెలరేగి ఆడింది. అనంతరం ఆసీస్‌ బౌలర్లు మేఘన్ షుట్‌ (4/18), జెస్‌ జొనాసెన్‌ (3/20) భారత మహిళలను ఓ ఆటాడుకున్నారు.

అదరగొట్టిన సోఫీ మోలీనెక్స్‌:

రికార్డు స్థాయిలో ఆస్ట్రేలియా ఐదోసారి విశ్వవిజేతగా నిలవడంతో.. ట్రోఫీ అందుకున్నాక ఆసీస్‌ అమ్మాయిలు సంబరాలు చేసుకున్నారు. అమెరికా పాప్‌ సింగర్‌ కేటీ పెర్రీతో కలిసి వేదికపై చిందులు వేశారు. కేటీ పాట, సంగీతానికి అనుగుణంగా కంగారు అమ్మాయిలు కాలు కదిపారు. ముఖ్యంగా సోఫీ మోలీనెక్స్‌ తన స్టెప్పులతో అదరగొట్టింది. తనదైన స్టయిల్లో డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించింది. మరోవైపు మిగతా జట్టు సభ్యులు కూడా డాన్స్ చేసారు. ఆసీస్ అమ్మాయిల నృత్యాన్ని ప్రేక్షకులంతా ఆనందంగా ఆస్వాదించారు.

పెర్రీకి లానింగ్‌ హాగ్:

కప్‌ గెలిచిన ఆనందంలో కెప్టెన్ మెగ్‌ లానింగ్‌ కేటీ పెర్రీని గట్టిగా కౌగిలించుకుంది. అయితే లానింగ్‌ ఎవరికీ సామాన్యంగా హగ్ అవ్వదట. పెర్రీని కౌగిలించుకోవడం ఇక్కడ విశేషం. 'ప్రపంచ ఛాంపియన్‌, డాన్స్‌ సంచలనం సోఫీ మోలినెక్స్‌ ఈ రాత్రి కేటీ పెర్రీతో కలిసి అదరగొట్టింది' అని క్రికెట్‌ ఆస్ట్రేలియా ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 రికార్డుల్లో ఫైనల్‌ మ్యాచ్‌:

రికార్డుల్లో ఫైనల్‌ మ్యాచ్‌:

మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ప్రపంచకప్‌ ఫైనల్ సందర్భంగా ఏకంగా 86,174 మంది ప్రేక్షకులు ఎంసీజీకి తరలివచ్చారు. దీంతో అత్యధిక వీక్షకులు వచ్చిన మహిళల క్రికెట్‌ మ్యాచ్‌గా భారత్‌-ఆస్ట్రేలియా ఫైనల్‌ మ్యాచ్‌ రికార్డుల్లోకి ఎక్కింది. ఇక ఆసీస్‌లో జరిగిన ఓ మహిళల ఈవెంట్స్‌కు అత్యధిక వీక్షకులు హాజరైన పోటీ కూడా ఇదే.

Story first published: Tuesday, March 10, 2020, 11:42 [IST]
Other articles published on Mar 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X