న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Dean Jones: ఆస్ట్రేలియన్ క్రికెట్ లెజెండ్ మృతి!!

Australian Former Cricketer Dean Jones Dead

ముంబై: ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ లెజెండ్, ప్రముఖ వ్యాఖ్యాత డీన్ జోన్స్ మృతి చెందారు. ఆయన వయసు 59. ప్రస్తుతం ముంబైలో ఉన్న జోన్స్‌కు గురువారం గుండెపోటు రావడంతో చనిపోయారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆయనకు తీవ్ర గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ తరఫున వ్యాఖ్యానం చేసేందుకు ఆయన భారత్‌కు వచ్చారు. ఐపీఎల్ కోసం భారత్‌కు వచ్చిన జోన్స్.. ముంబైలోని ఓ సెవెన్ స్టార్ హోటల్‌లో బయో బబుల్‌లో ఉన్నారు. నిన్నటి వరకు అతడు ఐపీఎల్ కామెంటరీ ప్యానెల్‌లో ఉన్నారు.

డీన్ జోన్స్ ప్రస్తుతం ఐపీఎల్ 2020 కోసం స్టార్ స్పోర్ట్స్ కామెంటరీ బృందంతో కలిసి పనిచేస్తున్నారు. జోన్స్ మంచి క్రికెట్ విశ్లేషకులు. తనదైన కామెంటరీతో ఆకట్టుకున్నారు. అంతర్జాతీయ మ్యాచ్‌లలోనే కాకుండా ప్రపంచంలోని వివిధ లీగ్‌లలో ఆయన వ్యాఖ్యానించారు. ఏదైనా విషయాన్ని ముక్కుసూటిగా చెప్పడం ఆయన శైలి. భారతీయ మీడియాలో జోన్స్ ఓ ప్రముఖ వ్యక్తి. అతని 'ప్రొఫెసర్‌ డీనో' ఎన్డీటీవీలో బాగా ప్రాచుర్యం పొందింది.

'ప్రొఫెసర్‌ డీనో'గా పేరుగాంచిన విక్టోరియా బ్యాట్స్‌మన్ డీన్‌ జోన్స్‌ ఓపెనర్‌గా, ఎటాకింగ్‌ బ్యాటింగ్‌ స్టైల్‌తో అభిమానులను అలరించారు. 245 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన జోన్స్‌.. 19,188 రన్స్‌ చేశారు. ఫస్ట్‌క్లాస్‌ ప్రదర్శనతో జోన్స్‌.. ఆసీస్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ కూడా తనదైన శైలిలో ఆకట్టుకున్నారు.

1984 నుంచి 1992 మధ్య ఎనిమిదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియాకు డీన్ జోన్స్ ప్రాతినిధ్యం వహించారు. తన సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌లో ఆసీస్‌ తరఫున 52 టెస్టులు, 164 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 46.11 సగటుతో 3,631 పరుగులు చేశారు. అందులో 11 శతకాలు, 14 అర్ధశ తకాలు ఉన్నాయి. ఇక వన్డేల్లో 44.61 సగటుతో 6,068 రన్స్‌ బాదారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో 7 శతకాలు, 46 హాఫ్‌ సెంచరీలు సాధించారు.

<strong>అంబటి రాయుడు మళ్లీ టీమిండియాకు ఆడినా ఆశ్చర్యం లేదు: బ్రాడ్‌ హాగ్‌</strong>అంబటి రాయుడు మళ్లీ టీమిండియాకు ఆడినా ఆశ్చర్యం లేదు: బ్రాడ్‌ హాగ్‌

Story first published: Thursday, September 24, 2020, 17:04 [IST]
Other articles published on Sep 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X