న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వారిస్తున్నా వినకుండా కోహ్లీతో గొడవకకు దిగుతున్న టిమ్ పైనె

Australian Fans Attack Virat Kohli On Twitter For Verbal Battle With Tim Paine. Watch Video

న్యూ ఢిల్లీ: పెర్త్ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టులో పరుగుల మాట అటుంచి వాదనలో వేగం పెరుగుతుంది. కోహ్లీని టార్గెట్ చేస్తూ ఆసీస్ కెప్టెన్‌యే వాదనకు దిగడం గమనార్హం. కోహ్లీని కూల్‌గా ఉండు. లేకపోతే.. అంటూ వారించేంతలా వివాదం చెలరేగింది. కానీ, టీమిండియా కెప్టెన్ కూల్‌గా నవ్వుతూ కనిపించాడు. సోమవారం ఆటను ఆరంభించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో టిమ్ పైనె క్రీజులో ఉండగా ఈ ఘటన జరిగింది. పరుగు కోసం వచ్చిన టిమ్.. దగ్గర్లో ఉన్న కోహ్లీని రెచ్చగొడుతుంటే అక్కడే ఉన్న అంపైర్ వారిద్దరి మధ్య వివాదానికి మధ్య వర్తిత్వం చేశాడు. వద్దంటూ వారిస్తూ.. సద్దుమణిగేలా చేసేందుకు ప్రయత్నించాడు.

ఇక సరిపెట్టుకో. ఇలాగైతే 2-0తేడాతో ఓడిపోతారు

ఆస్ట్రేలియా జట్టుతో ఆడుతున్న నాలుగో రోజు మ్యాచ్‌లో భాగంగా ఆసీస్ ఓవర్ నైట్ స్కోరు 132/4తో ఇన్నింగ్స్ ఆరంభించి దూకుడుగా ఆడింది. ఈ క్రమంలోనే కోహ్లీ.. పైన్ ఇక సరిపెట్టుకో. ఇలాగైతే 2-0తేడాతో ఓడిపోవడం ఖాయమన్నాడు. దానికి ధీటుగా చూద్దాం. ఇంకా మ్యాచ్ ముందుంది అనే అర్థం వచ్చేలా టిమ్ బదులిచ్చాడు. ఈ విషయం ముగిసిన కాసేపటి వరకూ ఇంకా వేడిగానే కనిపించింది అక్కడి వాతావరణం.

కోహ్లీని రెచ్చగొట్టేలా వాదనకు రమ్మంటూ

ఆ తర్వాత కోహ్లీ ప్రశాంతంగా కనిపించినా.. పైనె మాత్రం కోహ్లీని రెచ్చగొట్టేలా వాదనకు రమ్మంటూ కనిపించాడు. అక్కడ సంభాషణ ఇలా జరిగింది.

టిమ్ పైనె.. కోహ్లీతో: నిన్నటి మ్యాచ్ ఓడిపోయారు కదా. ఇవాళ ఏమీ చేయలేకపోతున్నావే.

అంపైర్: ఓయ్.. ఇక చాలు.. చాలు

పెనై: మేము మాట్లాడుకునేందుకు అనుమతి ఉంది.

అంపైర్: కాదుకాదు. రా వచ్చి ఆట ఆడు. మీరద్దరూ కెప్టెన్లు అలా ప్రవర్తించకూడదు.

పెనై: మేము సంభాషించుకోవచ్చు కదా. దాని గురించి ఎలాంటి ఇబ్బంది లేదుగా.

అంపైర్: టిమ్ నువ్వు కెప్టెన్?

పైనె: కోహ్లీ నీ ప్రశాంతతను అలాగే ఉంచుకో..

నేరుగా అతణ్ని గుద్దుకుని వెళ్లిపోవాల్సింది

ఇక ఈ సంభాషణతో ఆసీస్ క్రికెట్ అభిమానులకు అవకాశం దొరికినట్లు అయింది. 'ఆ నవ్వేంటి. కోహ్లీ ఉన్నాడని పైనె ఆగకుండా ఉండాల్సింది. నేరుగా అతణ్ని గుద్దుకుని వెళ్లిపోవాల్సింది. మ్యాచ్ గెలిచి అతనికి సరైన సమాధానం చెప్పాలి', 'కోహ్లీ ప్రదర్శన అస్సలేం బాగాలేదు. మ్యాచ్ గెలిస్తే సరైన సమాధానం దొరుకుతుంది' 'టిమ్ పైనె మాట్లాడుతుంటే అంపెర్ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసుకుంటున్నాడు. పైనె సరిగ్గానే స్పందించాడు. కోహ్లీని మైదానంలో చిత్తుగా ఓడించాలి' అంటూ కామెంట్లతో విమర్శల దాడికి దిగుతున్నారు.

Story first published: Monday, December 17, 2018, 15:30 [IST]
Other articles published on Dec 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X