న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌లో వింత ఘటన: ఇలా కూడా ఔట్ అవుతారా? (వీడియో)

Katie Perkins Gets Out In The Most Bizarre Way | Oneindia Telugu
Australia women’s cricketer completes one of the most bizarre dismissals ever – Watch

హైదరాబాద్: ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మహిళల జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా క్రికెట్‌లో ఎన్నో విచిత్రమైన ఔట్లను మనం చూస్తుంటాం. కానీ, ఇలాంటి ఔట్‌ను మాత్రం జరగడం ఇదే తొలిసారి. గురువారం న్యూజిలాండ్ మహిళల జట్టుకు చెందిన కేటీ పెర్కిన్స్ ఔటైన తీరు మాత్రం మరీ విచిత్రంగా ఉంది.

<strong>'Feeling good': మోచేతి గాయంపై స్టీవ్ స్మిత్, నెట్‌లో ప్రాక్టీస్ (వీడియో)</strong>'Feeling good': మోచేతి గాయంపై స్టీవ్ స్మిత్, నెట్‌లో ప్రాక్టీస్ (వీడియో)

వివరాల్లోకి వెళితే
ఆస్ట్రేలియా గవర్నర్స్ ఎలెవన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పెర్కిన్స్ ఆడిన షాట్ నాన్‌ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న కేటీ మార్టిన్ బ్యాట్‌కు తగిలి అమాంతం గాల్లోకి లేచింది. అదే సమయంలో అక్కడే ఉన్న బౌలర్ గ్రాహమ్ ఆ క్యాచ్‌ను అందుకోవడంతో పెర్కిన్స్‌ రిటర్న్‌ క్యాచ్‌గా పెవిలియన్‌ చేరింది.

అయితే ఇది ఔటా లేదా అనే విషయంలో మైదానంలోని ఆటగాళ్లు, అంపైర్లు సైతం గందరగోళానికి గురయ్యారు. ఫీల్డ్‌ అంపైర్లు థర్డ్‌ అంపైర్‌ సమీక్ష కోరగా దీనిని ఔట్‌గా ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌ జట్టు తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంతో వీడియో వైరల్ అయింది.

ఇలాంటి ఔట్ మీరెప్పుడైనా చూశారా? అంటూ ఫాక్స్ క్రికెట్ కామెంటేటర్ మెల్ జోన్స్ వ్యాఖ్యానించడం విశేషం. నిజంగా ఆమె ఔటైందా? అంటూ కామెంటేటర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్‌లో కివీస్‌ నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 323 పరుగుల చేసింది. అనంతరం ఆస్ట్రేలియా గవర్నర్స్ ఎలెవన్ జట్టు 157 పరుగులకే ఆలౌటైంది.

Story first published: Friday, March 1, 2019, 15:17 [IST]
Other articles published on Mar 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X