న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టాస్ నెగ్గడంలో చెత్త రికార్డు: ఆసీస్-లంక మ్యాచ్‌లో వింత ఘటన (వీడియో)

Australia women’s captain Meg Lanning brings teammate Alyssa Healy for the toss

హైదరాబాద్: శ్రీలంక మహిళల జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరిస్ ఆడుతోంది. ఈ సిరిస్‌లో భాగంగా ఆదివారం నార్త్‌ సిడ్నీ ఓవల్‌ మైదానంలో ఆస్ట్రేలియా-శ్రీలంక మహిళల జట్ల మధ్య ఆఖరి టీ20లో టాస్ సమయంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

సాధారణంగా ఏదైనా మ్యాచ్‌లో టాస్‌ వేసేటప్పుడు ఇరు జట్లకు సంబంధించిన కెప్టెన్లు మాత్రమే వస్తారు. అయితే, ఆదివారం నాటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ అందుకు భిన్నంగా టాస్ నెగ్గడం తన రికార్డు పేలవంగా ఉందని వికెట్‌ కీపర్‌ అలిస్సా హీలేను వెంటబెట్టుకొని వచ్చింది.

<strong>నవరాత్రులపై రవిశాస్త్రి ట్వీట్: ట్రోల్ చేస్తోన్న అభిమానులు</strong>నవరాత్రులపై రవిశాస్త్రి ట్వీట్: ట్రోల్ చేస్తోన్న అభిమానులు

టాస్ నెగ్గిన ఆసీస్

టాస్ నెగ్గిన ఆసీస్

దీంతో మ్యాచ్ రిఫరీ టాస్ కాయిన్‌ను హీలేకు ఇచ్చి టాస్‌ వేయమన్నాడు. దీంతో ఆస్ట్రేలియా టాస్ నెగ్గింది. అనంతరం ఆమె పక్కకు తప్పుకోవడంతో కెప్టెన్‌ మెగ్ లానింగ్‌ వచ్చి ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకున్నట్లుగా వెల్లడించింది. మెగ్ లానింగ్ టాస్ గెలవాలంటే ఆమె కోసం ప్రత్యేకంగా టాస్ కాయిన్‌ను రూపొందించాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.

మెగ్ లానింగ్ మాట్లాడుతూ

మెగ్ లానింగ్ మాట్లాడుతూ

దీనిపై మెగ్ లానింగ్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా నేను టాస్‌ గెలవడం లేదు. బహుశా నాకు అదృష్టం కలసి రావడం లేదనుకుంటా. అందుకే అలిస్సా హీలేను వెంటబెట్టుకొని వచ్చాను. అదృష్టం కొద్దీ మేమే టాస్‌ గెలిచాం. నాకు తెలుసు హీలేది లక్కీ హ్యాండ్‌" అంటూ టాస్ అనంతరం తెలిపింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై 41 పరుగుల తేడాతో ఆసీస్‌ ఘన విజయం సాధించింది.

సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో శ్రీలంక మహిళా జట్టు ఓపెనర్‌ చమరి ఆటపట్టు (66 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 113) సెంచరీతో సరికొత్త రికార్డు నెలకొల్పింది. 66 బంతుల్లోనే శతకం సాధించిన తొలి లంక మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది.

Story first published: Monday, September 30, 2019, 19:04 [IST]
Other articles published on Sep 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X