న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌తో వన్డే సిరిస్‌కు 1980నాటి జెర్సీలతో ఆస్ట్రేలియా (వీడియో)

Australia to wear retro kit during the ODI series against India

హైదరాబాద్: శనివారం నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ వన్డే సిరిస్‌లో ఆతిథ్య జట్టు పాత కాలపు జెర్సీలతో బరిలోకి దిగనుంది. సిడ్నీలో జరగనున్న తొలి వన్డేలో 1986లో అప్పటి అలెన్ బోర్డర్ జట్టు వేసుకున్న గ్రీన్, గోల్డ్ రంగుల జెర్సీలతో ఆస్ట్రేలియా జట్టు కనిపించనుంది.

<strong>2019 వరల్డ్‌కప్‌లో ధోనియే No.1 ప్లేయర్: మాజీ కెప్టెన్</strong>2019 వరల్డ్‌కప్‌లో ధోనియే No.1 ప్లేయర్: మాజీ కెప్టెన్

అలెన్ బోర్డర్ జట్టు గ్రీన్, గోల్డ్ రంగుల జెర్సీ వేసుకున్న సమయంలో, ప్రస్తుతం జట్టులో ఉన్న ఆసీస్ బౌలర్ పీటర్ సిడ్డిల్ వయసు ఏడాది మాత్రమేనని క్రికెట్ ఆస్ట్రేలియా ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఈ సమ్మర్‌లో రెట్రో కిట్స్‌తో బరిలోకి దిగడం కోసం తానెంతో ఆతృతగా ఉన్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో పీటర్ సిడ్డిల్ అన్నాడు.

ఆ జెర్సీలు వేసుకోవాలని ఆతృతగా ఉన్నాం

ఆ జెర్సీలు వేసుకోవాలని ఆతృతగా ఉన్నాం

"ఇలా ఒకనాటి జెర్సీలతో తాము ఇండియాతో సిరీస్ ఆడబోతున్నామని తెలిసి ఎంతో ఉత్సాహంగా అనిపించిందని, ఎప్పుడెప్పుడు ఆ జెర్సీలు వేసుకోవాలా అని జట్టులోని మిగతా సభ్యులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు" పీటర్ సిడ్డిల్ చెప్పడం విశేషం. కాగా, పీటర్ సిడ్డిల్ ఆస్ట్రేలియా తరఫున చివరిగా 2010లో వన్డే మ్యాచ్ ఆడాడు.

దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన

దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన

అయితే, ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తుండటంతో ఆసీస్ సెలక్టర్లు టీమిండియాతో మూడు వన్డేల సిరిస్ కోసం పీటర్ సిడ్డిల్‌ను ఎంపిక చేశారు. జనవరి 12న సిడ్నీలో ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. ఆ తర్వాత అడిలైడ్‌లో రెండో వన్డే, మెల్‌బోర్న్‌లో మూడో జరగనుంది.

2-1తో టెస్టు సిరిస్ కైవసం

2-1తో టెస్టు సిరిస్ కైవసం

ఇటీవలే ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఆస్ట్రేలియాపై 2-1తో తొలిసారి టెస్టు సిరిస్ నెగ్గి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తద్వారా ఆస్ట్రేలియా గడ్డపై 72 ఏళ్ల నిరిక్షణకు కోహ్లీసేన తెరదించింది. అంతేకాదు ఈ విజయంతో ఆసీస్ గడ్డపై టెస్టు సిరిస్ నెగ్గిన తొలి ఆసియా దేశంగా భారత జట్టు నిలిచింది. అంతకముందు జరిగిన మూడు టీ20ల సిరిస్ 1-1తో సమం అయింది.

Story first published: Thursday, January 10, 2019, 18:05 [IST]
Other articles published on Jan 10, 2019
Read in English: Australia to wear retro kit
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X