న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అక్తర్‌ సంచలన వ్యాఖ్యలు: స్మిత్ ఆటలో నో స్టైల్‌, నో టెక్నిక్‌!!

Shoaib Akhtar Trolls Steve Smith On His Playing Style || Oneindia Telugu
Australia vs Pakistan: Shoaib Akhtar says Steve Smith has no technique and style

కరాచీ: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌పై పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎలాంటి టెక్నిక్‌, స్టైల్‌ లేని స్మిత్‌ లాంటి ఆటగాడిని తన కెరీర్‌లోనే ఎప్పుడూ చూడలేదని అక్తర్‌ అన్నాడు. స్మిత్ చాలా ధైర్యవంతుడని, ఈ ఆధునిక క్రికెట్‌లో అత్యంత ప్రభావం చూపే క్రికెటర్ల జాబితాలో స్మిత్‌ కూడా ఉంటాడని పేర్కొన్నాడు. స్టీవ్‌ స్మిత్‌ (51 బంతుల్లో 80 నాటౌట్‌; 11 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకంతో అదరగొట్టడంతో కాన్‌బెర్రా వేదికగా మంగళవారం పాకిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. స్మిత్‌ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ విజయం సాధించే వరకు క్రీజులో ఉండి పోరాడాడు.

ఐపీఎల్ 2020.. పంజాబ్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్?!!ఐపీఎల్ 2020.. పంజాబ్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్?!!

కీలక ఇన్నింగ్స్ ఆడిన స్మిత్‌ గురించి అక్తర్‌ తన యూట్యూబ్‌ చానల్‌ ద్వారా ఓ వీడియో విడుదల చేశాడు. వీడియోలో అక్తర్‌ మాట్లాడుతూ... 'నేను చాలా సందర్భాల్లో స్మిత్‌ను ఔట్‌ చేయడానికి ప్రయత్నించా. బౌన్సర్ల రూపంలో బంతులు వేశా. కాకపోతే.. అతని టెక్నిక్‌ ఏమిటో అర్థం కాదు. స్మిత్ ఆట కూడా ఏమాత్రం స్టైల్‌గా ఉండదు. ఎలాంటి టెక్నిక్‌, స్టైల్‌ లేని స్మిత్‌ లాంటి ఆటగాడిని నా కెరీర్‌లోనే ఎప్పుడూ చూడలేదు' అని అన్నాడు

'ఏదేమైనా స్మిత్‌ అత్యంత ప్రభావం చూపే క్రికెటర్‌. ధైర్యమే అతన్ని ఒక అసాధారణ క్రికెటర్‌గా మార్చింది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పేసర్ మహ్మద్‌ ఆమిర్‌ బౌలింగ్‌లో.. బంతి ఎక్కడైతే పిచ్‌ అవుతుందో అక్కడకి వచ్చి ఆడాడు. అది నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. అది ఎలా సాధ్యం. ఒక టెక్నిక్‌, ఒక స్టైల్‌ అంటూ లేకుంటూ అలా ఎలా ఆడతారో నాకు అర్థం కాలేదు. చివరకు అర్థమయ్యింది ఏమిటంటే.. బంతిని కచ్చితంగా అంచనా వేసి ధైర్యంగా ఆడతాడు. అదే అతన్ని కీలక క్రికెటర్‌గా ఎదిగేలా చేసింది' అని అక్తర్‌ పేర్కొన్నాడు.

'స్మిత్‌ టీ20 ఫార్మాట్‌కు సరిపోడు అన్న వారికి అతను బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. మా సమయంలో స్మిత్ ఆడుతుంటే.. ఖచ్చితంగా అతనిని కొట్టేవాన్ని. ఎలా ఆడుతున్నాడనేది పక్కన పెడితే.. ప్రస్తుతం అతను బాగా ఆడుతున్నాడు. స్మిత్ ప్రత్యేక ఆటగాడు. బాల్ టాంపరింగ్ అనంతరం టన్నుల కొద్ది పరుగులు చేస్తున్నాడు. అతనికి ఆల్ ది బెస్ట్' అని అక్తర్‌ చెప్పాడు.

రెండో టీ20లో తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఇఫ్తికర్ అహ్మద్‌ (34 బంతుల్లో 62 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), బాబర్‌ ఆజమ్‌ (38 బంతుల్లో 50; 6 ఫోర్లు) మెరుపులు మెరిపించారు. ఆసీస్‌ బౌలర్‌ అగర్‌ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 18.3 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసి గెలిచింది. స్మిత్‌ ఒంటరి పోరాటం చేసాడు.

Story first published: Thursday, November 7, 2019, 15:52 [IST]
Other articles published on Nov 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X