న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిడ్నీలో కివీస్‌తో మూడో టెస్టు: 2020లో తొలి టెస్టు సెంచరీ చేసిన ఆటగాడిగా లబుషేన్ రికార్డు

Australia vs New Zealand Third Test live updates: Magnificent Marnus notches another century

హైదరాబాద్: సిడ్నీ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలిరోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్ సెంచరీ సాధించాడు. కివీస్ పేసర్ గ్రాండ్‌ హోమ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 72 ఓవర్‌ మూడో బంతికి ఫోర్‌ బాదడం ద్వారా లబుషేన్‌ సెంచరీని సాధించాడు. టెస్టుల్లో లబుషేన్‌కు ఇది నాలుగో సెంచరీ.

ఫలితంగా 2020లో తొలి టెస్టు సెంచరీ సాధించిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం 84 ఓవర్లకు గాను ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. క్రీజులో వేడ్(3), లబుషేన్(124) పరుగులతో ఉన్నారు. ఇప్పటివరకు 13 టెస్టులు ఆడిన లబుషేన్‌ 4 సెంచరీలు, 6 హాఫ్‌ సెంచరీలు నమోదు చేశాడు.

<strong>వైరల్ ఫొటోలు.. మంచు పర్వతాలపై గర్ల్‌ఫ్రెండ్‌తో పంత్!!</strong>వైరల్ ఫొటోలు.. మంచు పర్వతాలపై గర్ల్‌ఫ్రెండ్‌తో పంత్!!

ఐదు టెస్టుల్లో లబుషేన్ నాలుగు సెంచరీలు

ఐదు టెస్టుల్లో లబుషేన్ నాలుగు సెంచరీలు

గత ఐదు టెస్టుల్లో లబుషేన్ నాలుగు సెంచరీలు సాధించాడు. అంతేకాదు టెస్టుల్లో అతడి యావరేజి 60కిపైగా ఉండటం విశేషం. న్యూజిలాండ్‌తో శుక్రవారం ప్రారంభమైన మూడో టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌- బర్న్స్‌లు ఆసీస్ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించారు.

39 పరుగుల వద్ద బర్న్స్‌(18) ఔట్

39 పరుగుల వద్ద బర్న్స్‌(18) ఔట్

అయితే, జట్టు స్కోరు 39 పరుగుల వద్ద బర్న్స్‌(18) ఔట్ కాగా... ఆ తర్వాత మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్‌(45) హాఫ్ సెంచరీ ముంగిట నీల్ వాగ్నెర్ బౌలింగ్‌లో గ్రాండ్ హోమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 95 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్‌ను స్మిత్-లబుషేన్ జోడీ ఆదుకుంది.

మూడో వికెట్‌కు భారీ భాగస్వామ్యం

మూడో వికెట్‌కు భారీ భాగస్వామ్యం

వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు నూట యాభైకిపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. స్మిత్‌ హాఫ్‌ సెంచరీ సాధించగా, ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన లబూషేన్‌ సెంచరీ సాధించాడు. అయితే, జట్టు స్కోరు 251 పరుగుల వద్ద స్టీవ్ స్మిత్(63) గ్రాండ్ హోమ్ బౌలింగ్‌లో రాస్ టేలర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో వీరిద్దరి భాగస్వాయ్యానికి తెరపడింది.

సిడ్నీ టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్

సిడ్నీ టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్

ఈ టెస్టులో ఆసీస్‌ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. కాగా, గతేడాది లబుషేన్ వరుసగా హ్యాట్రిక్ సెంచరీలు బాదిన సంగతి తెలిసిందే. దీంతో పాటు గత క్యాలెండర్‌ ఇయర్‌లో వెయ్యి టెస్టు పరుగులు సాధించిన రికార్డు సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. 2019లో 1,104 టెస్టు పరుగులు సాధించిన లబుషేన్‌ గతేడాది వెయ్యి పరుగులు సాధించిన ఏకైక ఆసీస్ క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.

Story first published: Friday, January 3, 2020, 12:05 [IST]
Other articles published on Jan 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X