న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫాలో ఆన్ ఆడించకపోవడానికి కారణమిదే: కోహ్లీ

Ind vs Aus 3rd Test :Virat Kohli Reveals Why India Did Not Enforce Follow-On In Melbourne
Australia vs India: Virat Kohli reveals why India did not enforce follow-on in Melbourne

మెల్‌బౌర్న్‌: మూడో టెస్టులో ఆస్ట్రేలియాను ఫాలో ఆన్ ఆడించకపోవడం పట్ల కోహ్లీ ఈ విధంగా స్పందించాడు. పెర్త్ పరాజయం అనంతరం భారీ ఎత్తుగడలతో బరిలోకి ఓపెనర్లుగా శుభారంభమే నమోదు చేశారు. ఆ తర్వాత కాసేపటికీ ఓపెనర్లిద్దరూ పెవిలియన్ చేరుకోవడంతో కోహ్లీ.. పూజారాలు ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఈ క్రమంలో భారత్ ఇంకా మూడు వికెట్లు మిగిలి ఉండగానే 443/7 స్కోరుతో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆచితూచి ఆడినా 151 పరుగులకే ఆల్ అవుట్ అయ్యారు.

వారెవ్వరి అభిప్రాయాలు పట్టించుకోకుండా

వారెవ్వరి అభిప్రాయాలు పట్టించుకోకుండా

ఈ క్రమంలో 292 పరుగుల ఆధిక్యం సాధించిన టీమిండియా.. ఫాలో ఆన్ ఆడిస్తే బాగుంటుందంటూ కొందరు కోహ్లీకి సూచించారు. కానీ, వారెవ్వరి అభిప్రాయాలు పట్టించుకోకుండా ఆసీస్ జట్టును రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ సిద్ధమైపోయాడు కోహ్లీ. ఆస్ట్రేలియా కెప్టెన్ అల్లాన్ బోర్డర్, వెటరన్ ఇండియన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌లు సైతం ఫాలో ఆన్ ఆడించాలని సూచించారు. ఇలా ఫాలో ఆన్ ఆడించకపోవడానికి కారణాన్ని తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశ్లేషించిన కోహ్లీ..

భారత ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వదలచుకోలేదు

భారత ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వదలచుకోలేదు

అప్పటికే పెర్త్ పరాజయాన్ని చవి చూశాం. వెంటనే భారత ప్లేయర్ల ప్రదర్శనకు విశ్రాంతి ఇవ్వదలచుకోలేదు. దీంతో భారత్ ఎలా బౌలింగ్ చేసిందో అర్థం అవుతుంది. మేం ముందుగానే ఈ మ్యాచ్ అనంతరం 200 పరుగుల అంతరం ఉండాలని భావించాం. ఆసీస్ ప్లేయర్ల వ్యక్తిగత స్కోరు ఒక్కరిది కూడా 22పరుగులకు మించలేదు. మాది 400 పరుగులకు మించిన టార్గెట్ ఆ పరిస్థితుల్లో వారు చేధిస్తారనే సందేహమే లేదు. ఈ పరిస్థితుల్లో వారిని ఫాలో ఆన్‌కు ఆహ్వానించదలచుకోలేదు. అయినా మా బౌలర్లు రెండు ఇన్నింగ్స్‌లలోనూ అద్భుతంగా రాణించారు' అని చెప్పుకొచ్చాడు.

సిడ్నీ వేదికగా నాలుగో టెస్టు

సిడ్నీ వేదికగా నాలుగో టెస్టు

పెర్త్ పరాజయం అనంతరం టీమిండియా పుంజుకుంది. బాక్సింగ్ డే టెస్టు సందర్భంగా మెల్‌బౌర్న్ వేదికగా విజృంభించింది. అన్ని విభాగాల్లో రాణించిన టీమిండియా ఆసీస్‌ను మట్టి కరిపించింది. తొలి ఇన్నింగ్స్‌లో 292 పరుగుల ఆధిక్యాన్ని మిగిల్చి చివరి వరకూ అదే స్థాయిలో రాణించి 137 పరుగుల విజయంతో మ్యాచ్ గెలిచింది. ఈ మేర భారత్‌ను ఓడించేందుకు ఆసీస్ జట్టులో మార్పులు చేపట్టింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఈ క్రమంలో భారత్‌‌తో గురువారం నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభంకానున్న నాలుగో టెస్టు మ్యాచ్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు కొత్త ఆల్‌రౌండర్‌ని తీసుకుంది. సిరీస్‌లో ఆఖరిదైన నాలుగో టెస్టు సిడ్నీ వేదికగా జరగనుంది.

Story first published: Monday, December 31, 2018, 16:39 [IST]
Other articles published on Dec 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X