న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది: స్టార్క్ విమర్శలపై విరాట్ కోహ్లీ

India vs Australia : Virat Kohli Supports Mitchell Starc After India's Series Win Over Australia
Australia vs India: Virat Kohli backs Mitchell Starc after latter’s criticism

హైదరాబాద్: భారత్‌తో ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేక తీవ్ర విమర్శరలు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతుగా నిలిచాడు. ఆస్ట్రేలియాకు ఎన్నో గొప్ప విజయాలను అందించిన స్టార్క్, ఒక్క సిరిస్‌లో రాణించనంత మాత్రాన ఆ దేశ మాజీలు అతడిపై విమర్శలు చేయడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు.

ఐసీసీ టెస్ట్ ర్యాంకులు: రిషబ్ పంత్ ఖాతాలో మరో రికార్డుఐసీసీ టెస్ట్ ర్యాంకులు: రిషబ్ పంత్ ఖాతాలో మరో రికార్డు

సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్‌ వర్షం కారణంగా ఈరోజు డ్రాగా ముగియగా.. నాలుగు టెస్టుల సిరీస్‌ని టీమిండియా 2-1తో కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా గడ్డపై 72 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్టు సిరిస్‌ను గెలుచుకుని టీమిండియా మూడు వన్డేల సిరిస్‌కు సిద్ధమవుతోంది.

కోహ్లీ మాట్లాడుతూ

కోహ్లీ మాట్లాడుతూ

ఈ నేఫథ్యంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "చాలా ఏళ్లుగా స్టార్క్‌ మీ జట్టులో నంబర్‌ వన్‌ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పుడు అదే బౌలర్‌పై వరుసగా విమర్శలు చేయడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. స్టార్క్‌ మీ అత్యుత్తమ బౌలర్‌ అనుకుంటే అతనికి కొంత స్వేచ్ఛ ఇవ్వండి. మళ్లీ గాడిలో పడటానికి అతనికి మద్దతుగా నిలవండి" అని అన్నాడు

అతనిపై మరింత ఒత్తిడి

అతనిపై మరింత ఒత్తిడి

"అంతే కానీ విమర్శలు చేస్తే అతనిపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. అద్భుతమైన నైపుణ్యమున్న ఈ తరహా బౌలర్‌పై ఒత్తిడి పెంచి దూరం చేసుకోవద్దు. ఆస్ట్రేలియా సాధించిన ఎన్నో విజయాల్లో స్టార్క్‌ ప్రధాన పోషిస్తూ వస్తున్నాడు. అతని సేవల్ని కోల్పోవద్దు" అని కోహ్లీ పేర్కొన్నాడు. భారత్‌తో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో మిచెల్ స్టార్క్‌ 13 వికెట్లు తీశాడు.

జనవరి 12న సిడ్నీ వేదికగా తొలి వన్డే

జనవరి 12న సిడ్నీ వేదికగా తొలి వన్డే

దీంతో ఆసీస్ మాజీలైన షేన్‌ వార్న్‌, మిచెల్‌ జాన్సన్‌ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. జనవరి 12 నుంచి భారత్‌తో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరిస్ నుంచి ఆసీస్ సెలక్టర్లు మిచెల్ స్టార్క్‌కు విశ‍్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. భారత్‌తో వన్డే సిరిస్ అనంతరం శ్రీలంకతో టెస్టు సిరిస్ ఉండటంతో స్టార్క్‌ను భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ఎంపిక చేయలేదు.

Story first published: Tuesday, January 8, 2019, 14:01 [IST]
Other articles published on Jan 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X