న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియా vs ఇండియా, తొలి టెస్టు: ప్రివ్యూ, టైమింగ్, ఎక్కడ చూడాలి?

Australia vs India, Ist Test: Preview, timing, where to watch, squads & more

హైదరాబాద్: బోర్డ‌ర్‌-గావ‌స్క‌ర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు కౌంట్‌‌డౌన్ ప్రారంభమైంది. మరికొన్ని గంటల్లో అడిలైడ్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఆసీస్ గడ్డపై టీమిండియా ఇప్పటివరకు టెస్టు సిరిస్‌ను గెలవలేదు.

<strong>ఎవరి హద్దుల్లో వాళ్లుంటే మంచిది.. తేడాలొస్తే తగ్గే ప్రసక్తే లేదు: కోహ్లీ</strong>ఎవరి హద్దుల్లో వాళ్లుంటే మంచిది.. తేడాలొస్తే తగ్గే ప్రసక్తే లేదు: కోహ్లీ

ఈ నేపథ్యంలో టెస్టు సిరిస్‌ నెగ్గి చరిత్ర సృష్టించాలని కోహ్లీసేన ఊవిళ్లూరుతోంది. మరోవైపు, టిమ్ పైన్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు టాప్ ర్యాంక్ టీమిండియా జోరుకు చెక్ పెట్టాలని గట్టి పట్టుదలతో ఉంది. ఇప్పటికే తొలి టెస్టుకు ఇరు దేశాలు త‌మ తుది జ‌ట్ల‌ను ప్రకటించాయి.

భారత జట్టు 12 మంది స‌భ్యులతో కూడిన తుది జట్టుని ప్ర‌క‌టించింది. భారత జట్టులో రోహిత్ శ‌ర్మ తీసుకోగా.. ర‌వీంద్ర జ‌డేజా, ఉమేశ్ యాద‌వ్‌ల‌ను బెంచ్‌కే ప‌రిమితం చేశారు. మరోవైపు కుల్దీప్ యాద‌వ్‌ను ప‌క్క‌న పెట్టి కేవలం ఒకే ఒక్క సీనియ‌ర్ స్పిన్న‌ర్ అశ్విన్‌కే అవ‌కాశం ఇచ్చారు.

ఆసీస్ గడ్డపై గత రికార్డు

ఆసీస్ గడ్డపై గత రికార్డు

ఆసీస్ గడ్డపై టీమిండియా రికార్డు ఏమంత గొప్పగా లేదు. ఆసీస్ గడ్డపై ఇప్పటివరకు 44 టెస్టులాడిన టీమిండియా కేవలం ఐదు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. గత 70 ఏళ్లుగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తోన్న టీమిండియా ఇప్పటివరకు 11 టెస్టు సిరిస్‌లను ఆడింది. ఇందులో కేవలం రెండు సార్లు మాత్రమే టెస్టు సిరిస్‌ను డ్రాగా ముగించింది. 1980-81లో సునీల్ గవాస్కర్ నాయకత్వంలో తొలిసారి టెస్టు సిరిస్ డ్రాగా ముగియగా, 2003-04లో గంగూలీ నాయకత్వంలోని టీమిండియా రెండోసారి టెస్టు సిరిస్‌ను డ్రాగా ముగించింది.

జట్టు కాంబినేషన్

జట్టు కాంబినేషన్

అడిలైడ్ వేదికగా జరిగే తొలి టెస్టుకు టీమిండియా 12 మంది స‌భ్యులతో కూడిన తుది జట్టుని ప్ర‌క‌టించింది. భారత జట్టులో రోహిత్ శ‌ర్మ తీసుకోగా.. ర‌వీంద్ర జ‌డేజా, ఉమేశ్ యాద‌వ్‌ల‌ను బెంచ్‌కే ప‌రిమితం చేశారు. మరోవైపు కుల్దీప్ యాద‌వ్‌ను ప‌క్క‌న పెట్టి కేవలం ఒకే ఒక్క సీనియ‌ర్ స్పిన్న‌ర్ అశ్విన్‌కే అవ‌కాశం ఇచ్చారు. అరో స్థానం కోసం రోహిత్ శర్మ, హనుమ విహారిల మధ్య పోటీ నెలకొంది. కాగా, రోహిత్ శర్మ చివరగా ఈ ఏడాది జనవరిలో సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ సిరిస్‌ మొత్తం ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్ శర్మ నాలుగు ఇన్నింగ్స్‌లు కలిపి 78 పరుగులు మాత్రమే చేశాడు.

బ్యాటింగ్ ప్రభావం ఎంతమేరకు?

బ్యాటింగ్ ప్రభావం ఎంతమేరకు?

ఈ సిరిస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మద్దతుగా ఏ క్రికెటర్ నిలబడతాడనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కెప్టెన్ కోహ్లీ ఎప్పుడైతే ఔటవుతాడో ఆ వెంటనే భారత బ్యాట్స్‌మన్ పెవిలియన్‌కు క్యూ కడతారు కాబట్టి. ఈ ఏడాది మొదట్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో కోహ్లీ 286 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత పాండ్యా (119), పుజారా(102), కేఎల్ రాహుల్(రెండు టెస్టుల్లో 30) పరుగులకే ఔటైన సంగతి తెలిసిందే. అయితే, ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో కేఎల్ రాహుల్ 299 పరుగులు చేయడం విశేషం.

బౌలింగ్ కాంబినేషన్

బౌలింగ్ కాంబినేషన్

తొలి టెస్టుకు టీమిండియా ఇషాంత్ శర్మ, షమీ, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్‌లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక, ఆస్ట్రేలియా విషయానికి వస్తే మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్, జోష్ హేజెల్‌ఉడ్, నాథన్ లయాన్‌తో బరిలోకి దిగనుంది. ఇరు జట్ల బౌలింగ్ పోటాపోటీగా ఉంది. దీంతో బౌలర్ల ప్రదర్శనపైనే టెస్టు సిరిస్ ఫలితం ఆధారపడి ఉండే అవకాశం ఉంది.

జట్ల వివరాలు:

జట్ల వివరాలు:

భారత జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్‌), ముర‌ళీ విజ‌య్‌, కేఎల్‌ రాహుల్‌, పుజారా, ఆజింక్య రహానె, రోహిత్‌ శర్మ, హనుమ విహారి, రిషబ్‌ పంత్‌(వికెట్ కీప‌ర్‌), రవిచంద్ర‌న్‌ అశ్విన్‌, మహమ్మద్ షమీ, ఇషాంత్‌ శర్మ, జస్ర్పిత్‌ బుమ్రా

ఆస్ట్రేలియా: టిమ్‌ పైన్(కెప్టెన్‌)‌, అరోన్‌ ఫించ్‌, మార్కస్‌ హారిస్‌, ఉస్మాన్‌ ఖవాజ, షాన్‌ మార్ష్‌, ట్రావిస్‌ హెడ్‌, పీటర్‌ హాండ్స్‌కాంబ్‌, జోష్‌ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్‌, నాథన్ లైయ‌న్, మిచెల్‌ స్టార్క్

మ్యాచ్ ప్రసారమయ్యే ఛానళ్లు:

మ్యాచ్ ప్రసారమయ్యే ఛానళ్లు:

సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం

ఉదయం 5.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

సోనీ లివ్‌లో ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్

Story first published: Wednesday, December 5, 2018, 18:13 [IST]
Other articles published on Dec 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X