న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అలా అయితే మ్యాచ్‌లు గెలవలేం: దూకుడు మన రక్తంలోనే ఉందన్న క్లార్క్

Australia Vs India: Clarke asks hosts to toughen up, warns Aussies nice guys dont win

హైదరాబాద్: బాల్ టాంపరింగ్ ఉదంతం ఆస్ట్రేలియా ఆటగాళ్లు క్రికెట్ తీరుని పూర్తిగా మార్చివేసిందని ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అన్నాడు. మైదానంలో దూకుడు తగ్గించుకుంటే అందరూ ఇష్టపడతారేమో గానీ, ఆస్ట్రేలియా జట్టు మ్యాచ్‌లు గెలవలేదని చెప్పుకొచ్చాడు.

ఆస్ట్రేలియా రక్తంలోనే దూకుడు ఉందని క్లార్క్ పేర్కొన్నాడు. కోహ్లీసేనతో తర్వలో ప్రారంభం కానున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో మంచోళ్లు అనిపించుకోవడం ఆటపై ఎలాంటి ప్రభావం చూపదని క్లార్క్ అన్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్ అంటేనే మైదానంలో దూకుడు అని తెలిపాడు.

ఆస్ట్రేలియా ఆటగాళ్ల దూకుడు కాస్త నెమ్మదించింది

ఆస్ట్రేలియా ఆటగాళ్ల దూకుడు కాస్త నెమ్మదించింది

ఈ ఏడాది సఫారీ గడ్డపై చోటు చేసుకున్న బాల్‌ టాంపరింగ్ ఉదంతం కారణంగా ఆ జట్టు ఆటగాళ్లు స్టీవ్‌స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ ఏడాది నిషేధానికి గురికావడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్ల దూకుడు కాస్త నెమ్మదించింది. అంతకముందు ప్రత్యర్ధి జట్టుపై స్లెడ్జింగ్‌కు ఎంతమాత్రం వెనుకాడని ఆస్ట్రేలియన్లు, ఇప్పుడు మైదానంలో ప్రశాంతంగా కనిపిస్తున్నారని క్లార్క్‌ విమర్శించాడు.

 మైకేల్ క్లార్క్ మాట్లాడుతూ

మైకేల్ క్లార్క్ మాట్లాడుతూ

తాజాగా ఓ స్పోర్ట్స్ రేడియోకి ఇచ్చిన ఇంటర్యూలో మైకేల్ క్లార్క్ మాట్లాడుతూ "ఆస్ట్రేలియా క్రికెట్‌ను అందరూ ఇష్టపడాలని, గౌరవించేలా చేసుకోవాలని దిగులు పడటం మానుకోవాలి. ఆస్ట్రేలియా తరహాలో కఠినమైన, దూకుడైన క్రికెట్‌ ఆడాలి. ఇష్టమున్నా లేకున్నా అది మన రక్తంలోనే ఉంది. మనం ప్రశాతంగా ఆడితే అందరూ ఇష్టపడొచ్చేమో గానీ మ్యాచ్‌లు గెలవలేం" అని అన్నాడు.

దూకుడుగా ఉండటం డేవిడ్‌ వార్నర్‌ శైలి

దూకుడుగా ఉండటం డేవిడ్‌ వార్నర్‌ శైలి

"దూకుడుగా ఉండటం డేవిడ్‌ వార్నర్‌ శైలి. అతడిలో ఏం చూస్తే అదే కనిపిస్తుంది. ఒక కెప్టెన్‌గా అతనెప్పుడూ నా జట్టులో ఉండటం నాకిష్టం. ఎందుకంటే అతడు జట్టుకు అవసరమైన దూకుడు అందిస్తాడు. దూకుడు హద్దులేమిటో అతడికి తెలుసు. హద్దు దాటొద్దని మేమిద్దరం చాలాసార్లు సంభాషించాం" అని మైకేల్ క్లార్క్ అన్నాడు.

డిసెంబర్ 6న అడిలైడ్ వేదికగా తొలి టెస్టు

డిసెంబర్ 6న అడిలైడ్ వేదికగా తొలి టెస్టు

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా డిసెంబర్ 6న అడిలైడ్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టు సిరిస్‌లో టీమిండియా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఆసీస్ పర్యటనలో ఇప్పటికే ముగిసిన మూడు టీ20ల సిరిస్‌ను కోహ్లీసేన 1-1తో సమం చేసింది. తొలి టీ20లో ఆసీస్ నెగ్గగా, మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. వర్షం కారణంగా రెండో టీ20 రద్దైంది.

Story first published: Wednesday, November 28, 2018, 14:10 [IST]
Other articles published on Nov 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X