న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఈసారైనా అడిలైడ్‌లో డై అండ్ నైట్ టెస్టులు ఆడండి'

Australia Vs India: CA wants Team India to play day-night Test in Adelaide during next tour

న్యూ ఢిల్లీ: భారత్‌తో అడిలైడ్ వేదికగా తొలి టెస్టు ఆడుతోన్న ఇరు జట్లు వచ్చే ఏడాది ఇదే స్టేడియంలో డై అండ్ నైట్ మ్యాచ్‌లు ఆడాలంటూ క్రికెట్ ఆస్ట్రేలియా కోరుతోంది. తొలి టెస్టులో స్టేడియంలోకి అనుకున్న స్థాయిలో అభిమానులు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం ఆడిన ఆటలో 23, 802మంది ప్రేక్షకులు హాజరైయ్యారట.

డే అండ్ నైట్‌కే ఆదరణ ఎక్కువ

డే అండ్ నైట్‌కే ఆదరణ ఎక్కువ

గతేడాది అడిలైడ్ వేదికగా జరిగిన యాషెస్ డే అండ్ నైట్ టెస్టు సిరీస్‌కు 55వేల మంది వరకూ వచ్చారట. అంతకంటే ముందు దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచ్‌లో 32, 255 మంది దాని కంటే ముందు సంవత్సరం న్యూజిలాండ్ ప్రత్యర్థిగా ఆడిన సంవత్సరంలో 47, 441 మంది హాజరైయ్యారంటూ క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది.

ఏటా తగ్గిపోతోన్న వీక్షకులు

ఏటా తగ్గిపోతోన్న వీక్షకులు

అయితే గురువారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టేడియానికి వచ్చిన సభ్యులు నాలుగేళ్ల ముందు భారత్-ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌కు వచ్చిన 25, 619 కంటే తక్కువమంది మ్యాచ్‌కు హాజరైయ్యారు. ఇలా చెప్పుకోదగ్గ రీతిలో మ్యాచ్‌కు హాజరవకపోవడానికి కారణం కచ్చితంగా కేవలం డే మ్యాచ్‌లు ఆడడమేనని చెప్తోంది క్రికెట్ ఆస్ట్రేలియా. ఈ విషయాన్ని స్టేడియానికి వచ్చిన అభిమానుల సంఖ్యే ధ్రువీకరిస్తుందని తెలిపింది.

 వీక్షకుల సంఖ్య తగ్గిపోయింది.

వీక్షకుల సంఖ్య తగ్గిపోయింది.

'అందులో సందేహమే లేదు. డై అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లకు వచ్చే వీక్షకుల సంఖ్య తగ్గిపోయింది. వచ్చే ఏడాది భారత్ ఇక్కడకు వచ్చినప్పుడు డై అండ్ నైట్ మ్యాచ్‌లు ఆడాలని కోరుకుంటున్నాం' అని తెలిపాడు. ఈ క్రమంలో బీసీసీఐ కూడా 2020-21 ఏడాదికి అడిలైడ్‌లో ఒప్పుకుంటుందనే ఆశాభావాన్ని రోబర్ట్స్ వ్యక్తం చేశాడు.

అభిమానుల సంఖ్యను తమ పరువుగా

అభిమానుల సంఖ్యను తమ పరువుగా

బీసీసీఐ వేరేలా భావించవచ్చు. కానీ, మేం మాత్రం అభిమానుల సెంటిమెంట్‌ను అనుసరిస్తున్నాం. దీని గురించి బీసీసీఐ ఒప్పుకుంటుందని ఆశపడుతున్నాం. ఒకవేళ దీనికి సమ్మతిస్తే మరో 15వేల మంది వీక్షకులు స్టేడియానికి వచ్చే సూచనలున్నట్లు తెలిపారు. ఆధాయపరంగానే కాకుండా మ్యాచ్‌కు వచ్చే అభిమానుల సంఖ్యను తమ పరువుగా భావిస్తుందంట క్రికెట్ ఆస్ట్రేలియా.

Story first published: Friday, December 7, 2018, 17:27 [IST]
Other articles published on Dec 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X