న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అడిలైడ్ టెస్టులో పుజారా సెంచరీ: అచ్చం ద్రవిడ్ లాగే పుజారా కూడా, అరుదైన ఘనత

Australia Vs India, Adelaide Test: Pujara and Dravid have got to milestones of 3000 runs, 4000 runs and 5000 Test runs

హైదరాబాద్: అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా మిడిలార్డర్ బ్యాట్‌మన్ ఛటేశ్వర్ పుజారా సెంచరీతో చెలరేగాడు. ఒక ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతున్నా.. అద్భుతమైన ఆటతో క్రీజులో నిలిచిన పుజారా 231 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

<strong>అడిలైడ్‌లో రోహిత్ సిక్సుల మోత: ఇంప్రస్ కాని నెటిజన్లు (వీడియో)</strong>అడిలైడ్‌లో రోహిత్ సిక్సుల మోత: ఇంప్రస్ కాని నెటిజన్లు (వీడియో)

టెస్టుల్లో పుజారాకు ఇది 16వ సెంచరీ కాగా, ఆస్ట్రేలియాపై మూడోది కావడం విశేషం. తాజా సెంచరీతో పుజారా అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అడిలైడ్ టెస్టు సెంచరీతో పుజారా టెస్టుల్లో 5000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ టెస్టుకు ముందు ఐదువేల పరుగల మైలురాయికి పుజారా 95 పరుగుల దూరంలో ఉన్నాడు.

తొలి టెస్టులో పుజారా సెంచరీ

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో పుజారా సెంచరీతో టీమిండియా దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ రికార్డుని కూడా సమం చేశాడు. టెస్టు క్రికెట్‌లో 3000, 4000, 5000 పరుగుల మైలురాళ్లను ద్రవిడ్, పుజారా ఒకే ఇన్నింగ్స్‌లతో అందుకోవడం ఇక్కడ విశేషం.

అచ్చం ద్రవిడ్ లాగే పుజారా కూడా

టెస్టుల్లో ద్రవిడ్‌కు 3000 పరుగుల మైలురాయిని అందుకునేందుకు 67 ఇన్నింగ్స్... 4000 పరుగులను అందుకునేందుకు 84 ఇన్నింగ్స్‌, 5000 పరుగులను అందుకునేందుకు 109 ఇన్నింగ్స్ అవసరమయ్యాయి. ఇప్పుడు పుజారాకు సైతం అచ్చం అదే విధంగా అన్ని ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాళ్లను అందుకోవడం విశేషం.

అడిలైడ్ టెస్టులో టీమిండియా గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోర్

పుజారా ప్రస్తుతం ఆడుతోన్న 108వ ఇన్నింగ్స్‌లో 5వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇదిలా ఉంటే, అడిలైడ్ టెస్టులో టీమిండియా గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోర్ సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 9 వికెట్ల న‌ష్టానికి 250 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం క్రీజులో షమీ(6), బుమ్రా (0) ఉన్నారు.

56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా

జట్టు స్కోరు 56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన కష్టాల్లో ఉన్న టీమిండియా పుజారా ఆదుకున్నాడు. ఈ మ్యాచ్‌లో లంచ్‌కి ముందే నాలుగు వికెట్స్ తీసిన ఆసీస్ బౌలర్లు లంచ్ త‌ర్వాత రోహిత్ శ‌ర్మ (37), రిష‌బ్ పంత్ (25) పెవిలియన్‌కు చేర్చారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అశ్విన్.. పుజారాతో కలిసి భారత్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు.

3 పరుగులకే పెవిలియన్‌కు చేరిన కోహ్లీ

మొదట్లో ఆచితూచి ఆడిన అశ్విన్ ఆ తర్వాత దూకుడుగా ఆడుతూ పుజారాతో కలిసి స్కోరు బోర్డుని పెంచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కమ్మిన్స్ వేసిన ఇన్నింగ్స్ 74వ ఓవర్‌ చివరి బంతికి డిఫెన్స్ ఆడబోయి స్లిప్‌లో ఉన్న హ్యాండ్స్‌కోంబ్ చేతికి చిక్కాడు. అంతకముందు ఓపెనర్లు కేఎల్ రాహుల్(2), మురళీ విజయ్(11) మ‌రోసారి నిరాశ ప‌రిచారు. ఆసీస్ బౌలర్స్‌లో హాజిల్‌వుడ్‌, లియాన్‌, క‌మిన్స్, మిచెల్ స్టార్క్ తలో రెండు వికెట్లు తీశారు.

Story first published: Thursday, December 6, 2018, 13:40 [IST]
Other articles published on Dec 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X