న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్ గడ్డపై భారత్: తెరపైకి కోహ్లీ vs స్టార్క్: ఆధిపత్య పోరు కొనసాగేనా?

Australia vs India 2018-19: Interesting storylines that could determine the outcome of the Test series

హైదరాబాద్: ఆసీస్ గడ్డపై టీమిండియా మరో కఠిన సవాల్‌కు సిద్ధమైంది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా డిసెంబర్ 6న అడిలైడ్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. స్మిత్, వార్నర్ లేకపోవడం... మునుపటి కంటే టీమిండియా బలంగా ఉండటంతో ఈ సిరిస్‌ను ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కోహ్లీసేన ఉంది.

ఆస్ట్రేలియాతో టెస్టు అంటేనే కవ్వింపులు, రెచ్చగొట్టడం, స్లెడ్జింగ్ మొదలైనవి మామూలే. గత ఆసీస్ పర్యటనల్లో ఇలాంటి సంఘటనలను అనేకం చూశాం. తాజా పర్యటన కోహ్లీ vs మిచెల్ స్టార్క్‌గా ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో గత ఆస్ట్రేలియా పర్యటనలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం.

1
43623

ఆసీస్ పర్యటన అంటే తొలుత గుర్తుకు వచ్చేది హర్భజన్ సింగ్, ఆండ్రూ సైమండ్స్ మధ్య చెలరేగిన 'మంకీ గేట్' వివాదం. ఇక, రెండోది విరాట్ కోహ్లీ Vs మిచెల్ జాన్సన్ మధ్య సాగిన ఆధిపత్య పోరు. 2007-08లో మంకీగేట్ వివాదం భారత్ జట్టుని ఆత్మరక్షణలోకి నెట్టేయగా.. 2014-15 పర్యటనలో ఆధిపత్య పోరు సాగింది.

విరాట్ కోహ్లీని ఓ పోరాట యోధుడిని చేసిన 2014 పర్యటన

విరాట్ కోహ్లీని ఓ పోరాట యోధుడిని చేసిన 2014 పర్యటన

2014 ఆస్ట్రేలియా పర్యటన ప్రస్తుత టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ఓ పోరాట యోధుడిని చేసింది. ఈ పర్యటనలో ఆస్ట్రేలియా గడ్డపై బౌన్సర్లను ఎదుర్కొనేందుకు భారత్ బ్యాట్స్‌మెన్ ఆపసోపాలు పడుతున్నవేళ కోహ్లీ ఒక్కడే అద్భుత ప్రదర్శన చేశాడు. జట్టు ఒకవైపు, తాను ఒక్కడినే మరోవైపు అన్నట్లు కోహ్లీ బ్యాటింగ్ చేశాడు. దీంతో కోహ్లీని ఆస్ట్రేలియా బౌలర్లు టార్గెట్ చేశారు.

కోహ్లీని గాయపర్చేందుకు కూడా వెనుకాడని ఆసీస్ బౌలర్లు

తొలుత కవ్వింపులతో మొదలెట్టి.. సిరిస్ ముందుకు సాగే క్రమంలో కోహ్లీని గాయపర్చేందుకు కూడా వెనుకాడలేదు. దీంతో కోహ్లీ సైతం నోటికి పనిచెప్పాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్ల కవ్వింపులకు నోటితో బదులిస్తూనే.. బ్యాట్‌తో పరుగుల వరద పారించాడు. ఈ పర్యటనలో మొత్తం 4 సెంచరీలు బాది ఏకంగా 694 పరుగులు చేశాడు. అప్పుడు కూడా అడిలైడ్ వేదికగానే తొలి టెస్టు మ్యాచ్ జరగగా.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ (115, 141) సెంచరీలు సాధించాడు.

కోహ్లీని కవ్వించిన మిచెల్ జాన్సన్

కోహ్లీని కవ్వించిన మిచెల్ జాన్సన్

ఆ తర్వాత మెల్‌బోర్న్ వేదికగా జరిగిన టెస్టులో మిచెల్ జాన్సన్‌ బౌలింగ్‌ని విధ్వంసం సృష్టించాడు. ఈ టెస్టులో కోహ్లీ తన నోటికి సైతం పని చెప్పాడు. బౌండరీలు బాదడంతో పాటు నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న జాన్సన్‌కి కండలు చూపిస్తూ, ముద్దులు పెడుతూ కవ్వించే ప్రయత్నం చేశాడు.

 అడిలైడ్ వేదికగా తొలి టెస్టు

అడిలైడ్ వేదికగా తొలి టెస్టు

కాగా, నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న ఆస్ట్రేలియా జట్టు కోహ్లీని కవ్వించబోమని చెప్తోంది. మరోవైపు మిచెల్ జాన్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దీంతో ఈసారి కోహ్లీ Vs స్టార్‌ల మధ్య ఆధిపత్య పోరు జరిగేలా కనిపిస్తోంది.

Story first published: Monday, December 3, 2018, 13:55 [IST]
Other articles published on Dec 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X