న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ vs ఆస్ట్రేలియా: 'అడిలైడ్ టెస్టులో ఇకపై చేసే ప్రతి పరుగు విలువైందే'

Australia Vs India, 1st Test: Runs are gold dust in Adelaide Test, says India star Ashwin

హైదరాబాద్: అడిలైడ్ టెస్టు నువ్వానేనా అన్నట్టు ఉందని టీమిండియా చేసే ప్రతి పరుగు విలువైందేనని వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేన తొలి ఇన్నింగ్స్‌లో 250 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ రెండో రోజు ఆట ముగిసే సరికి 191/7తో నిలిచింది.

సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్ సరసన కోహ్లీ: ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై మరో రికార్డు సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్ సరసన కోహ్లీ: ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై మరో రికార్డు

రెండో రోజైన శుక్రవారం ఆటలో భాగంగా అశ్విన్ 50 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం అశ్విన్ మాట్లాడుతూ "మేం చాలా బాగా ఆడాం. ప్రత్యర్థిని కుప్పకూల్చాం. రెండు వైపుల నుంచి ఒత్తిడి చేశాం. పేసర్లు, స్పిన్నర్లు అన్న తేడా లేకుండా సమష్టిగా కష్టపడ్డాం. ఈ రోజు మేమంతా చక్కగా ఆడాం" అని చెప్పుకొచ్చాడు.

1
43623
ఆతిథ్య జట్టుకు ఎక్కువ పరుగులు ఇవ్వొద్దనే

ఆతిథ్య జట్టుకు ఎక్కువ పరుగులు ఇవ్వొద్దనే

"ఆతిథ్య జట్టుకు ఎక్కువ పరుగులు ఇవ్వొద్దనే యోచనతో టీ విరామానికి ముందు తర్వాత 22 ఓవర్లు వేశా. ఆటలో రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టే ఉన్నాయి. ఇక నుంచి వచ్చే ప్రతి పరుగు ఎంతో ముఖ్యం. పిచ్‌ కాస్త కఠినంగా అనిపించింది. వేగం తగ్గింది. ముందు రోజు మేం బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు ఇలా అనిపించలేదు. వికెట్‌ రానురానూ ఇంకా మందకొడిగా తయారవుతుంది. డ్రాప్‌ ఇన్‌ పిచ్‌ కావడంతో ఇక ముందు ఎలా ఉంటుందో తెలియదు" అని అశ్విన్‌ అన్నాడు.

వికెట్‌పై ఎక్కువ పచ్చిక ఉండటంతో

"వికెట్‌పై ఎక్కువ పచ్చిక ఉండటంతో గతంలో మాదిరిగా అడుగుల ముద్రలు పడటం లేదు. ఏదైనా చేయాలంటే నాలుగు, ఐదో రోజు మాత్రమే సాధ్యం. అడిలైడ్‌ సాధారణంగా స్పిన్‌ను అనుకూలిస్తుంది. ఈ సారి పచ్చిక ఉండటంతో భిన్నంగా ఉంది. రెండు వైపుల నుంచి ఒత్తిడి చేయడంతోనే వికెట్లు పడగొట్టగలిగాం. 2011లో ఇక్కడికి వచ్చినప్పుడు మైకెల్‌ క్లార్క్‌ కవర్స్‌వైపు డ్రైవ్స్‌ చేస్తూ ఇబ్బంది పెట్టాడు" అని అశ్విన్ పేర్కొన్నాడు.

గత పర్యటనలో మాత్రం బాగా రాణించా

"అప్పుడు అనుభవం లేకపోవడంతో బంతిని టాసింగ్‌ చేశా. ఆ తర్వాత నేర్చుకొని గత పర్యటనలో మాత్రం బాగా రాణించా" అని అశ్విన్‌ చెప్పుకొచ్చాడు. కాగా, 191/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో 88.1 ఓవర్ల వద్ద మూడో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా కేవలం 44 పరుగులు మాత్రమే జోడించి మిగ‌తా వికెట్ల‌ను కోల్పోయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 15 ప‌రుగుల ఆధిక్యాన్ని సాధించింది. మూడో రోజు ఆటలో భాగంగా తొలి వికెట్‌ మిచెల్‌ స్టార్క్‌(15) బుమ్రా ఔట్ చేశాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే ఆసీస్ ఆలౌట్

91.4 ఓవర్లో బుమ్రా వేసిన బంతిని మిచెల్‌ స్టార్క్‌(15; 34బంతుల్లో) పంత్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికే వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. దీంతో కొంత స‌మ‌యం ఆట నిలిచిపోయింది. మ‌ళ్లీ ఆట మొదలు కాగానే, ష‌మీ మిగ‌తా రెండు వికెట్ల‌ు పడగొట్టాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ అత్య‌ధికంగా 72 పరుగులు చేశాడు. ఆ తర్వాత హ్యాండ్స్‌ కాంబ్‌ (34), కవాజా (28) పరుగులతో ఫరవాలేదనిపించారు. భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా, ఆశ్విన్‌లు మూడేసి వికెట్లు తీసుకోగా, ఇశాంత్ శ‌ర్మ‌, ష‌మీలు రెండేసి వికెట్లు తీసుకున్నారు.

Story first published: Saturday, December 8, 2018, 13:33 [IST]
Other articles published on Dec 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X