న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంతు చిక్కని ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఆస్ట్రేలియా పేసర్

Australias John Hastings struggles with mystery lung condition

హైదరాబాద్: ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జాన్ హేస్టింగ్స్ ఓ అంతు చిక్కని ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించడం విశేషం. తాను ఇలాగే బౌలింగ్ చేస్తూ వెళ్తే దీర్ఘకాలంలో తన ప్రాణాలు పోవడం ఖాయమని జాన్ హేస్టింగ్స్ చెప్పాడు.

37వ పడిలోకి గంభీర్: సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ37వ పడిలోకి గంభీర్: సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ

32 ఏళ్ల జాన్ హేస్టింగ్స్ ఆస్ట్రేలియా తరుపున మూడు ఫార్మాట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పోరేషన్‌కి ఇచ్చిన ఇంటర్యూలో తన ఊపిరితిత్తుల్లో రక్తస్రావం జరుగుతున్నదని హేస్టింగ్స్ వెల్లడించాడు. ఇప్పటివరకు ఎన్నో టెస్టులు చేసినా.. ఎందుకిలా జరుగుతుందో తెలియడం లేదని అన్నాడు.

"ఈ ప్రాణాంతక వ్యాధి ఇప్పుడు అతని క్రికెట్ కెరీర్‌ను ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఈ వ్యాధి ఎప్పుడో బయటపడినా.. గత నాలుగైదు నెలలుగా తీవ్ర స్థాయికి చేరింది. బౌలింగ్ చేస్తే చాలు.. విపరీతమైన దగ్గుతోపాటు రక్తం కక్కుతున్నాను. దీంతో ఏడాది పాటు అసలు బౌలింగ్ చేయకూడదని నిర్ణయించుకున్నా" అని జాన్ హేస్టింగ్స్ చెప్పాడు.

హేస్టింగ్స్ ఆస్ట్రేలియా జట్టు తరఫున ఒక టెస్టు, 29 వన్డేలు, 9 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు. గతేడాది వన్డేలు, నాలుగు రోజుల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన జాన్ హేస్టింగ్స్ తనకు ఇంకా ఆడాలని ఉన్నా.. ఈ వ్యాధి కారణంగా ఏమీ చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఏదైనా అద్భుతం జరిగితే తప్ప తాను మళ్లీ బౌలింగ్ చేయలేనని హేస్టింగ్స్ తెలిపాడు. బిగ్ బాష్ లీగ్‌లో ఏడేళ్ల పాటు మెల్‌బోర్న్ స్టార్స్ జట్టుకు ఆడిన జాన్ హేస్టింగ్స్.. ఈ ఏడాది సిడ్నీ సిక్సర్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఈసారి టోర్నీలో తాను ఆడలేనని మేనేజ్‌మెంట్‌కు తేల్చిచెప్పాడు.

Story first published: Sunday, October 14, 2018, 15:47 [IST]
Other articles published on Oct 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X