న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వ్యాధిని జయించలేక క్రికెట్ నుంచి రిటైరైన హేస్టింగ్స్

Australias John Hastings Retires From International Cricket Due To Lung Disease

హైదరాబాద్: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జాన్ హేస్టింగ్స్ అంతుచిక్కని వ్యాధితో క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. బౌలింగ్ చేస్తున్న సమయంలో తన ఊపిరితిత్తుల్లో రక్తస్రావం జరుగుతోందని ఇటీవల బాధతో వెల్లడించిన హేస్టింగ్స్ బుధవారం క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. ఇప్పటికే వన్డే, టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన హేస్టింగ్స్‌ తాజాగా టీ20 ఫార్మాట్‌ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు తెలిపాడు.

ఊపిరితిత్తుల్లో రక్తస్రావం జరుగుతోందనే

ఊపిరితిత్తుల్లో రక్తస్రావం జరుగుతోందనే

బౌలింగ్‌ చేస్తున్న సమయంలో మాత్రమే ఊపిరితిత్తుల్లో రక్తస్రావం జరుగుతోందనే కారణంతో పూర్తిగా క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు హేస్టింగ్స్‌ పేర్కొన్నాడు. వైద్యులు ఎన్ని పరీక్షలు చేసినా దీనిపై స్పష్టత రాలేదు. ఇకపై కూడా రక్తస్రావం జరగదని తాము హామీ ఇవ్వలేమని వైద్యులు స్పష్టంగా చెప్పేశారు. దాంతో ఆటకు పూర్తిగా రిటైర్మెంట్‌ ప్రకటించాలని 33 ఏళ్ల హేస్టింగ్స్‌ నిర్ణయించుకున్నాడు.

నెల రోజుల నుంచి తీవ్రతరం కావడంతో..

నెల రోజుల నుంచి తీవ్రతరం కావడంతో..

దాదాపు నెల రోజుల నుంచి సమస్య తీవ్రతరం కావడంతో.. రన్నింగ్, రోయింగ్, ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌వంటి ఎన్నో ఎక్సర్‌సైజ్‌లు చేసినా ఇబ్బంది రాకపోగా, బౌలింగ్‌ చేసినప్పుడు మాత్రమే సమస్య కనిపించడం అరుదైన వ్యాధిగా మారింది.

సరైన కారణమేంటో తెలియలేదు

సరైన కారణమేంటో తెలియలేదు

‘ఈ వ్యాధి గురించి ఎన్నో రకాల పరీక్షలు చేయించుకున్నా. అయినప్పటికీ దీని విషయంలో సరైన కారణమేమిటో తెలియలేదు. ఒకవేళ ఇలాగే బౌలింగ్‌ చేస్తుంటే దీని తీవ్రత మరింత పెరిగి అది మరణానికే దారి తీసే అవకాశం ఉంది. క్రికెట్‌ కోసం నా ప్రాణాలను త్యాగం చేయలేను.' అని ఈ ఆల్‌రౌండర్‌ చెప్పుకొచ్చాడు.

ఆడింది ఒక్క టెస్టే

ఆడింది ఒక్క టెస్టే

విశాఖపట్నం వేదికగా 2010లో భారత్‌తో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన జాన్ హేస్టింగ్స్.. కెరీర్‌లో 29 వన్డేలాడి 42 వికెట్లు పడగొట్టాడు. గాయాల కారణంగా చాలారోజులు ఆస్ట్రేలియా జట్టుకి దూరమైన ఈ పేసర్ ఎనిమిదేళ్ల కెరీర్‌లో ఆడింది 9 టీ20లు మాత్రమే. 2012లో దక్షిణాఫ్రికాపై ఏకైక టెస్టు మ్యాచ్‌ ఆడాడు. మాత్రమే. ఆడాడు. తొమ్మిది అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లాడాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, కొచ్చి టస్కర్స్‌ జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు.

Story first published: Wednesday, November 14, 2018, 17:25 [IST]
Other articles published on Nov 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X