న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్లెడ్జింగ్‌కు ముగింపు పలకండి: ఆసీస్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

By Nageshwara Rao
Australia Prime Minister Malcolm Turnbull calls for end to cricket sledging

హైదరాబాద్: క్రికెట్‌లో స్లెడ్జింగ్‌కు ముగింపు పలకాలని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి మాల్కమ్ టర్న్‌బుల్ సూచించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం స్లెడ్జింగ్ అదుపు తప్పిందని, ఆటను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా క్రికెటర్లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డారని తెలియడంతో ఆయన తీవ్ర మనస్థాపానికి లోనైన సంగతి తెలిసిందే. యువతకు ఆదర్శంగా నిలవాల్సిన ఆటగాళ్లు ఇలా చేయడం నమ్మకలేకపోతున్నానని చెప్పారు.

బాల్ టాంపరింగ్: తెరపైకి అండర్‌ఆర్మ్‌ బౌలింగ్‌, చాపెల్ ఆసక్తికర వ్యాఖ్యబాల్ టాంపరింగ్: తెరపైకి అండర్‌ఆర్మ్‌ బౌలింగ్‌, చాపెల్ ఆసక్తికర వ్యాఖ్య

బాల్ టాంపరింగ్ ఘటన అటు ఆసీస్ అభిమానులతో పాటు ఆయనపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీంతో బాల్ టాంపరింగ్ ఘటనపై వెంటనే విచారణకు జరిపించాలని క్రికెట్ ఆస్ట్రేలియాను ఆదేశించారు. అంతేకాదు విచారణలో నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని ఆయన క్రికెట్ ఆస్ట్రేలియాను డిమాండ్ చేశారు.

ఈ బాల్ టాంపరింగ్ వివాదంపై సోమవారం విచారణ ప్రారంభమైంది. ఈ విచారణ నిమిత్తం నియమితులైన క్రికెట్‌ ఆస్ట్రేలియా హెడ్‌ ఆఫ్‌ ఇంటెగ్రిటీ లైన్‌ రాయ్, హై ఫెర్ఫార్మెన్స్‌ మేనేజర్‌ పాట్‌ హోవార్డ్‌ కేప్‌టౌన్‌ చేరుకుని బాల్ టాంపరింగ్ ఆలోచన ఎవరిదో తేల్చేందుకు జట్టు బస చేసిన హోటల్‌లోనే స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లను విచారిస్తున్నారు.

విచారణలో భాగంగా ఆసీస్ హెడ్ కోచ్‌ డారెన్‌ లీమన్, సహాయక సిబ్బందిని కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. విచారణ పూర్తయిన తర్వాత వీరిపై తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ ఇద్దరూ క్రికెట్ ఆస్ట్రేలియాకు సిఫారసు చేయనున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బుధవారం వివరాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

ఇలాంటి తరుణంలో టర్న్‌బుల్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు దూషించుకుంటూ.. స్లెడ్జింగ్‌కు దిగడాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు అరికట్టాలని క్రికెట్‌ను మళ్లీ ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలంటే ఇది తప్పనిసరి అని కాన్‌బెర్రాలో విలేకరులతో ఆయన అన్నారు.

స్మిత్, వార్నర్, బాన్‌క్రాప్ట్‌లపై ఏడాది పాటు నిషేధం: హెడ్ కోచ్ రాజీనామా?స్మిత్, వార్నర్, బాన్‌క్రాప్ట్‌లపై ఏడాది పాటు నిషేధం: హెడ్ కోచ్ రాజీనామా?

'క్రికెట్ నుంచి స్లెడ్జింగ్‌ పోయేలా చూడాలంటే కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం ఇది క్రికెట్‌లో అదుపు తప్పిందని... ఆటలో దూషణకు చోటు ఉండొద్దు' అని టర్న్‌బుల్ అభిప్రాయపడ్డారు. క్రికెట్ ఆటను మళ్లీ రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. దక్షిణాఫ్రికా పర్యటను ఆసీస్‌కు ఏమాత్రం కలిసిరాలేదు.

ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను అనేక వివాదాలు చుట్టుముట్టాయి. డికాక్-వార్నర్ గొడవ పడగా.. స్మిత్‌ను ఔట్ చేసిన ఆనందరంలో రబాడ అతడి భుజాన్ని నెట్టుకుంటూ వెళ్లడం... ఇలా అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో రబాడపై రెండు టెస్టుల నిషేధం విధించిన ఐసీసీ అనంతరం దానిని ఎత్తివేసింది.

Story first published: Tuesday, March 27, 2018, 15:43 [IST]
Other articles published on Mar 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X