న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

AUS Playing 11 vs SL: కలవరపెడుతున్న వార్నర్ ఫామ్.. స్టార్క్ డౌటే! లంకతో బరిలోకి దిగే ఆసీస్ జట్టిదే!!

Australia Playing XI vs Sri Lanka: Kane Richardson is likely to replace Mitchell Starc

దుబాయ్: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్-12లో భాగంగా గురువారం ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో ఈ రోజు రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుండగా.. రాత్రి 7 గంటలకు టాస్ పడనుంది. ఇప్పటికే ఇరు జట్లు తమ తొలి మ్యాచులలో విజయాలు అందుకుని రెండో విజయంపై కన్నేశాయి. ఆస్ట్రేలియా తమ ఓపెనింగ్‌ మ్యాచులో దక్షిణాఫ్రికాను 5 వికెట్లతో ఓడించగా.. బంగ్లాదేశ్ టైగర్స్‌పై లంక విజయం సాధించింది. ఈ మ్యాచులో ఆసీస్ ఫెవరెట్‌గా కనిపిస్తున్నా.. లంకను తక్కువ అంచనా వేయలేం. ఇరు జట్ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

 హెడ్ టు హెడ్ రికార్డ్స్:

హెడ్ టు హెడ్ రికార్డ్స్:

ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు ఇప్పటివరకు ముఖాముఖీ పోరులో 16 టీ20 మ్యాచ్‌లు ఆడగా.. చెరో ఎనిమిదిసార్లు విజయాలు సాధించాయి. టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు మూడు మ్యాచులు ఆడగా.. ఆస్ట్రేలియా 2, శ్రీలంక 1 మ్యాచ్ గెలిచాయి. ఈ మ్యాచును స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌లో అభిమానులు ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు. ఈ మ్యాచ్ జరిగే దుబాయ్‌లోని పిచ్‌లో బ్యాటర్లు ప్రారంభంలో ఓపికగా బ్యాటింగ్ చేయాల్సి ఉంది. ఈ పిచ్‌పై స్పిన్నర్లకు కూడా కొంత సహకారం అందుతుంది. టోర్నీలో ఇప్పటివరకు ఈ వేదికపై ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ ఛేజింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. అందుకే టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకొనుంది.

పరుగుల వరద పారిస్తున్న స్మిత్:

పరుగుల వరద పారిస్తున్న స్మిత్:

ఆస్ట్రేలియా జట్టు తమ తొలి మ్యాచులో దక్షిణాఫ్రికాను 5 వికెట్లతో ఓడించింది. ఆ మ్యాచులో ఆసీస్ బౌలింగ్ విభాగం ఆకట్టుకుంది. దక్షిణాఫ్రికాని ఆసీస్ బౌలర్లు 118/9కి పరిమితం చేశారు. ఆ తరువాత ఆసీస్ బ్యాటర్లు సునాయాసంగా టార్గెట్‌ను ఛేదించారు. ఆసీస్ బ్యాటింగ్ బాగుంది. టీ20 ప్రపంచకప్‌కు ముందు జరిగిన రెండు వార్మప్ మ్యాచ్‌లలో ఆసీస్ బ్యాటర్లు 150 కంటే ఎక్కువ పరుగులు చేశారు. స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఆడిన ప్రతి మ్యాచ్‌లో పరుగులు చేశాడు. మొదటి వార్మప్‌లో భారత్‌పై స్మిత్ 57 పరుగులు చేయగా.. రెండో వార్మప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 35 పరుగులు చేశాడు. ఇక దక్షిణాఫ్రికాపై స్మిత్ 35 పరుగులు చేశాడు. దాంతో ఆసీస్ బ్యాటింగ్ విభాగానికి అతడు వెన్నెముకగా మారాడు.

కలవరపెడుతున్న వార్నర్ ఫామ్:

కలవరపెడుతున్న వార్నర్ ఫామ్:

హిట్టర్లు గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇన్నింగ్స్ చివరిలో వీరు చెలరేగి ఆడుతున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆరోన్ ఫించ్ డకౌట్ అయినా.. పుంజుకోనున్నాడు. అయితే స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఫామ్ జట్టును ఆందోళన పరుస్తోంది. వార్నర్ ఆడిన 3 ఇన్నింగ్స్‌లలో (2 వార్మప్ మ్యాచ్‌ల్లో 1, 12 పరుగులు) 20 పరుగుల మార్కును దాటలేకపోయాడు. ఐపీఎల్ 2021లో కూడా అతడు తేలిపోయాడు. దాంతో అతడు గాడిలో పడితే ఆస్ట్రేలియాకు తిరుగుండదు. ఇక ఆసీస్ బౌలింగ్ పటిష్టంగా ఉంది. పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్ ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టగలరు. అయితే స్టార్క్ ఫిట్‌గా లేకపోతే.. అతడి స్థానంలో కేన్ రిచర్డ్సన్ ఆడనున్నాడు.

ఆస్ట్రేలియా తుది జట్టు (అంచనా):

ఆస్ట్రేలియా తుది జట్టు (అంచనా):

డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్/కేన్ రిచర్డ్సన్, జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా.

Story first published: Thursday, October 28, 2021, 11:50 [IST]
Other articles published on Oct 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X