|
తొలి ఇన్నింగ్స్‌లో నాథన్ లయన్ దెబ్బ
ఇకపోతే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 5వికెట్ల హాల్ సాధించి లయాన్ శ్రీలంకను దెబ్బతీయడంతో ఆ జట్టు 212పరగులు చేయగలిగింది. ఇక రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన ఆస్ట్రేలియా 3వ రోజు మొదటి సెషన్ వరకు బ్యాటింగ్ చేసి 321పరుగులు చేయగలిగింది. తద్వారా 109పరుగుల ఆధిక్యం ఆ జట్టుకు లభించింది. శ్రీలంక స్పిన్నర్లను ఆస్ట్రేలియా బ్యాటర్లు సమర్థంగా ఎదుర్కొన్నారు. డేవిడ్ వార్నర్ (25)తో కలిసి ఉస్మాన్ ఖవాజా (71) శుభారంభాన్ని ఇచ్చాడు.
|
అలెక్స్ కెరీ, కామెరూన్ గ్రీన్ పోరాటం
అయితే డేవిడ్ వార్నర్ ఔటయ్యాక, మార్నస్ లాబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్‌లు తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టడంతో ఆసీస్ కాస్త కష్టాల్లో పడింది. కానీ అలెక్స్ కారీ (45), టాప్ స్కోరర్ కామెరాన్ గ్రీన్ (77)పోరాట పటిమ కనబర్చడానికి తోడు ప్యాట్ కమ్మిన్స్ (26) చివర్లో రాణించడంతో ఆస్ట్రేలియా 321పరుగులు చేయడంతో 109పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది.
|
శ్రీలంక బ్యాటర్ల భరతం పట్టిన స్పిన్నర్లు
ఆ తర్వాత మూడో రోజు బరిలోకి దిగిన శ్రీలంక మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్లోనే ఓపెనర్లు నిశ్శాంక, కరుణరత్నే కలిసి నాలుగు ఫోర్లు బాదడంతో శ్రీలంక దీటుగా ఆడుతుందనిపించింది. వీరిద్దరు తొలి వికెట్ భాగస్వామ్యానికి 37పరుగులు జోడించారు. ఈ జోడీని లయన్ విడదీశాడు. కరుణరత్నే (23)ను క్యాచ్ ఔట్ చేశాడు. అనంతరం స్వెప్సన్ నిశ్వాంక(14)ను పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత ఇక శ్రీలంక కోలుకోలేకపోయింది. ఆసీస్ స్పిన్నర్లు శ్రీలంక బ్యాటర్ల భరతం పట్టారు. దీంతో ఆ జట్టు 113పరుగులకే కుప్పకూలింది. ఒక్క వికెట్ తీస్తే నాథన్ లయన్ 10వికెట్లు హాల్ సాధించేవాడు. కానీ మిస్సయింది. ఇక కేవలం 17బంతుల్లోనే ట్రావిస్ హెడ్ 4 వికెట్లు పడగొట్టడం ఆసక్తికరం. అనూహ్యమైన స్పిన్ బౌలింగ్‌తో ట్రావిస్ హెడ్ ఆకట్టుకున్నాడు.