న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గబ్బాలో గెలుపు ఆస్ట్రేలియాదే: యాషెస్‌ తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఓటమి

By Nageshwara Rao
 Australia cruise to 10-wicket win in Ashes opener

హైదరాబాద్: ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో గబ్బా స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. 170 పరుగుల ఛేదనలో రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆటముగిసే సమయానికి గెలుపుకు 56 పరుగుల దూరంలో ఉన్న సంగతి తెలిసిందే.

ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ తొలి టెస్టు స్కోరు కార్డు

ఐదో రోజు బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా లంచ్‌ సెషన్‌కు ముందే విజయం సాధించింది. ఓపెనర్లు బాన్‌క్రాఫ్ట్‌ 10 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 82 పరుగులు చేయగా, డేవిడ్ వార్నర్ 10 ఫోర్లతో 87 పరుగులతో క్రీజులో ఉన్నారు. దీంతో తొలి టెస్టులో ఇంగ్లాండ్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Australia v England First Ashes Test in words and numbers

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 33/2తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లాండ్‌ను కెప్టెన్‌ రూట్‌ (51), స్టోన్‌మ్యాన్‌ (27) పరుగులతో రాణించడంతో 62/2తో ఒక దశలో ఫర్వాలేదనిపించిన ఇంగ్లాండ్‌.. రూట్‌ ఔట్‌ వరుసగా వికెట్లను కోల్పోయింది. హాఫ్ సెంచరీ చేసిన జో రూట్... హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో నేరుగా క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

 Australia cruise to 10-wicket win in Ashes opener

ఆ తర్వాత ఆసీస్‌ పేసర్లు స్టార్క్‌ (3/51), హేజిల్‌వుడ్‌ (3/46) విజృంభించడంతో ఇంగ్లాండ్‌ 155 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బెయిర్‌స్టో (42), మొయిన్‌ అలీ (40) ఆదుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఆఫ్‌ స్పిన్నర్‌ లైయన్‌ (3/67) అలీని ఔట్‌ చేయడంతో ఈ జోడీకి తెరపడింది.

ఇక, మిచెల్ స్టార్క్‌ టెయిలెండర్లను త్వరగా పెవిలియన్‌కు పంపడంతో ఇంగ్లాండ్‌ 195 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 114 /0 ఓవర్‌ నైట్‌స్కోరుతో బరిలోకి దిగిన ఆసీస్‌ టీ బ్రేక్‌ సమయానికి 49 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 161 పరుగులు చేసింది. అనంతరం ఇన్నింగ్స్‌ ప్రారంభమైన మరో 6 బంతుల్లోనే ఆసీస్‌ విజయం సాధించింది.

తొలి వికెట్‌కు ఆసీస్ ఓపెనర్ల జోడి నెలకొల్పిన 173 పరుగుల భాగస్వామ్యం చేజింగ్‌లో అత్యధిక భాగస్వామ్యంగా రికార్డులకెక్కింది. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 302 పరుగులు చేయగా.. ఆసీస్‌ 328 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే ఐదు టెస్టుల సిరిస్‌లో భాగంగా గబ్బా స్టేడియంలో తొలి టెస్టులో ఆసీస్ విజయం సాధిచండంతో 1-0 ఆధిక్యం లభించింది.

Story first published: Monday, November 27, 2017, 9:35 [IST]
Other articles published on Nov 27, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X