న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'స్మిత్‌, వార్నర్‌ జట్టులో చేరితే ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ గెలుస్తుంది'

Australia can win World Cup with Smith and Warner: Ponting

హైదరాబాద్: డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ బ్యాటింగ్‌ లైనప్‌లో చేరిస్తే ఆస్ట్రేలియా జట్టు మరింత బలంగా మారుతుందని ఆ దేశ మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ అన్నాడు. వీరిద్దరి చేరిక జట్టును మరింత బలంగా మారుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ ఏడాది మేలో ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే.

<strong>నువ్వేమైనా ధోనివి అనుకుంటున్నావా?: దినేశ్ కార్తీక్‌కి నెటిజన్ల చురకలు</strong>నువ్వేమైనా ధోనివి అనుకుంటున్నావా?: దినేశ్ కార్తీక్‌కి నెటిజన్ల చురకలు

వరల్డ్ కప్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా రికీ పాంటింగ్‌ను ఆస్ట్రేలియా సహాయ కోచ్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు కూడా వన్డే వరల్డ్‌కప్‌ను కాపాడుకోవడానికి అవకాశాలున్నాయని రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. స్మిత్, వార్నర్ జట్టులో చేరితే ఆసీస్ తిరిగి ప్రపంచకప్‌ టైటిల్‌ను నిలబెట్టుకొనే అవకాశం ఉంటుందని చెప్పాడు.

"ప్రస్తుతం భారత్‌, ఇంగ్లాండ్‌ చాలా పటిష్టంగా ఉన్నాయి. అయితే నిషేధం తర్వాత స్మిత్‌, వార్నర్‌ తిరిగి జట్టులోకి చేరితే ఆస్ట్రేలియా కంటే మెరుగ్గా ఏ జట్టు ఉండదు. ఇంగ్లాండ్‌లోని పరిస్థితులు మా ఆటకు సరిపోతాయి. ఇలాంటి మెగా టోర్నీలకు ఏం అవసరమో తెలుసు. సహాయక కోచ్‌గా నేను ఈ మాట చెప్పట్లేదు" అని పాంటింగ్ అన్నాడు.

"అంతకుముందు కూడా ఇదే మాట చెప్పా. ఆరంభం నుంచే నేను ప్రభావం చూపగలను. కుర్రాళ్ల స్పందన సైతం బాగుంది. వరల్డ్‌కప్ ముందు వార్నర్‌, స్మిత్‌, బాన్‌క్రాఫ్ట్‌ జట్టులో చేరితో చాలా దేశాల కన్నా మా జట్టు బాగుంటుంది. నేను భాగస్వామిగా ఉండే జట్టు సీనియర్లు, యువకులతో సమతూకంగా ఉంటుంది" అని పాంటింగ్‌ అన్నాడు.

Story first published: Monday, February 11, 2019, 11:55 [IST]
Other articles published on Feb 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X