న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్‌దే యాషెస్‌.. నాలుగో టెస్టులో పోరాడి ఓడిన ఇంగ్లండ్‌!!

Ashes 2019 : Australia Beat England By 185 Runs To Retain The Urn At Old Trafford || Oneindia
Australia Beat England By 185 Runs To Retain The Ashes

మాంచెస్టర్: 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' స్టీవ్‌ స్మిత్‌ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకోగా.. అనంతరం బౌలర్లు ఇంగ్లండ్‌ జట్టును బెంబేలెత్తించడంతో యాషెస్‌ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 383 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆతిథ్య జట్టు 197 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియా 185 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆసీస్ 2-1తో సిరీస్ ఆధిక్యంలో నిలవడంతో పాటు ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌ను నిలబెట్టుకుంది.

<strong>తలైవాస్‌పై సూపర్ విజయం.. 50 పాయింట్ల మార్క్‌ అందుకున్న తొలి జట్టుగా ఢిల్లీ</strong>తలైవాస్‌పై సూపర్ విజయం.. 50 పాయింట్ల మార్క్‌ అందుకున్న తొలి జట్టుగా ఢిల్లీ

నిప్పులు చెరిగే బంతులు:

నిప్పులు చెరిగే బంతులు:

ఓవర్‌నైట్ స్కోరు 18/2 వద్ద ఐదో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ మ్యాచ్‌ను డ్రా చేసేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. ఉదయం కమిన్స్‌, హాజెల్‌వుడ్‌ నిప్పులు చెరిగే బంతులను ఎదుర్కొనేందుకు జో డెన్లీ, జేసన్‌ రాయ్‌ ఇబ్బంది పడ్డారు. డెన్లీ అయితే రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మరోవైపు రాయ్‌ డిఫెన్స్ ఆడడంతో తొలి గంట వికెట్‌ కోల్పోకుండా ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ కొనసాగించింది.

డెన్లీ అర్ధ సెంచరీ:

డెన్లీ అర్ధ సెంచరీ:

ఇక క్రీజులో కుదురుకున్నట్టు కనిపించిన రాయ్‌ (31)ను ఓ అద్భుత బంతితో కమిన్స్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. మరో ఐదు ఓవర్ల తర్వాత ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ (1)ను కూడా పెవిలియన్‌కు చేర్చాడు. స్టోక్స్‌ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్‌ పైన్ డైవ్‌ చేసి అందుకున్నాడు. అయితే అంపైర్‌ అవుటివ్వకుండానే స్టోక్స్‌ క్రీజును వదిలి వెళ్లిపోయాడు. దీంతో 87/4తో ఇంగ్లండ్‌ లంచ్‌కు వెళ్లింది. విరామం తర్వాత కమిన్స్‌ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టిన డెన్లీ (53).. అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. కానీ కొద్దిసేపటికే స్పిన్నర్‌ లియాన్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్ అయి నిష్క్రమించాడు.

స్టార్క్‌ దెబ్బ:

స్టార్క్‌ దెబ్బ:

ఈ దశలో బట్లర్‌తో కలిసి బెయిర్‌స్టో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. ఇదే సమయంలో స్టార్క్‌ ఓ ఫుల్‌లెంగ్త్‌ డెలివరీతో బెయిర్‌ స్టోను ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఫీల్డ్‌అంపైర్‌ అవుటివ్వగా.. బెయిర్‌ స్టో (61 బంతుల్లో 25) సమీక్షకు వెళ్లినా ఫలితం లేకపోయింది. దాంతో 45 పరుగుల ఆరో వికెట్‌ భాగస్వామ్యం ముగిసింది. ఇక టీ విరామానికి ఇంగ్లండ్‌ ఆరు వికెట్లకు 166 పరుగులు చేసింది.

'డ్రా' అయ్యేలా కనిపించినా:

'డ్రా' అయ్యేలా కనిపించినా:

టీ విరామం తర్వాత బట్లర్ (111 బంతుల్లో 34), ఆర్చర్‌ (1) వెనుదిరిగినా.. లోయరార్డర్‌లో ఓవర్టన్‌ (105 బంతుల్లో 21), లీచ్‌ (51 బంతుల్లో 12) మరింత పట్టుదలగా ఆడి 14 ఓవర్ల పాటు నిలిచారు. ఈ దశలో మ్యాచ్‌ ‘డ్రా' అయ్యేలా కనిపించింది. అయితే లీచ్‌ను పార్ట్‌టైమర్‌ లబషేన్, ఓవర్టన్‌ను హాజల్‌వుడ్‌ పెవిలియన్‌ చేర్చి ఆసీస్‌కు విజయాన్ని అందించారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 497/8 డిక్లేర్డ్‌.. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 301.. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ 186/6 డిక్లేర్డ్‌.

మణిందర్ మాయ.. పల్టన్‌పై బెంగాల్‌ అద్భుత విజయం

 ట్రోఫీ ఆసీస్ వద్దనే:

ట్రోఫీ ఆసీస్ వద్దనే:

డబుల్‌ సెంచరీతో అద్భుత బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చిన మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దక్కింది. ఐదు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో ఉంది. గత సిరీస్‌ను ఆసీస్ గెల్చుకోవడంతో.. గురువారం నుంచి ప్రారంభమయ్యే ఐదో టెస్టులో ఓడినా సిరీస్ 2-2తో సమం అవుతుంది. దీంతో ట్రోఫీ ఆసీస్ వద్దనే ఉంటుంది.

Story first published: Monday, September 9, 2019, 9:56 [IST]
Other articles published on Sep 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X