Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మణిందర్ మాయ.. పల్టన్‌పై బెంగాల్‌ అద్భుత విజయం

PKL 2019: Mohammad Nabibakhsh’s late Super Raid helps Bengal Warriors win against Puneri Paltan

కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో భాగంగా ఆదివారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 42-39తో పుణెరి పల్టన్‌ను ఓడించింది. చివరి నిమిషంలో బెంగాల్‌ పుంజుకుని మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. రైడర్‌ మణిందర్ సింగ్ సూపర్-10 సాధించడంతో బెంగాల్‌ విజయాన్ని అందుకుంది. బల్దేవ్ సింగ్ హై 5 సాధించాడు. పల్టన్‌ తరఫున పంకజ్ (11 పాయింట్లు), మంజిత్ రాణించినా జట్టుకు ఓటమి తప్పలేదు.

4-0తో మ్యాచ్‌ను పునేరి బాగానే ఆరంభించింది. ప్రపంజన్ బోనస్ పాయింట్‌ తెచ్చి ఆతిథ్య జట్టు ఖాతా తెరిచాడు. అనంతరం బెంగాల్ సూపర్ టాకిల్, సూపర్ రైడ్ చేయడంతో ఆతిథ్య జట్టు ఆధిక్యంలోకి వెళ్ళింది. ఇదే ఊపులో 10వ నిమిషంలో ప్రత్యర్థిని ఆల్ ఔట్ చేసి తమ ఆధిక్యాన్ని 13-9కి పెంచారు. తిరిగి పుంజుకున్న పునేరి తొలి అర్ధ భాగాన్ని 20-21తో ముగించింది. ఆట మరో ఆరు నిమిషాలు ఉందనగా.. బెంగాల్ 36-27తో నిలిచింది. ఈ సమయంలో మొహమ్మద్ అద్భుతంగా పోరాడి 40-39తో పల్టన్‌ను రేసులోకితెచ్చాడు. అయితే చివరి రెండు సెకన్లలో మరో రెండు పాయింట్లు సాధించి బెంగాల్‌ అద్భుత విజయంను సొంతం చేసుకుంది.

ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 50-34తో తమిళ్ తలైవాస్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. యువ రైడర్‌ నవీన్ కుమార్ (17 పాయిం ట్లు), మిరాజ్‌ షేక్‌ (12 పాయింట్లు) ఆకట్టుకోవడంతో ఢిల్లీ అలవోక విజయాన్ని అందుకుంది. తలైవాస్ తరఫున రాహుల్ చౌదరి (14 పాయింట్లు) రాణించినా.. అతడికి సహకారం లభించకపోవడంతో తలైవాస్‌కు ఓటమి తప్పలేదు.

Story first published: Monday, September 9, 2019, 9:18 [IST]
Other articles published on Sep 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+