న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్ ప్లేయర్ల సవాలుకు ధీటుగా బదులిచ్చిన టీమిండియా

Australia at odds over bowling tactics against India at SCG in fourth Test

సిడ్నీ: ఆస్ట్రేలియా జట్టుతో నాలుగో టెస్టులో టీమిండియాను పడగొడతామని ఆసీస్ బౌలర్లు ప్రగల్భాలు పలికారు. కానీ, భారత బ్యాట్స్‌మెన్‌కి సవాల్ విసిరిన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లందరూ సిడ్నీ టెస్టులో 'సెంచరీ' మార్క్‌ని దాటేశారు. టెస్టు సిరీస్‌కి ముందు విరాట్ కోహ్లీ‌తో సహా అందర్నీ కట్టడి చేస్తామని.. బౌన్సర్లతో వారిని క్రీజులో కుదురుకోనియ్యమని బీరాలు పలికిన కంగారూ జట్టు పేసర్లు.. శుక్రవారం చతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా జోరుకి చేతులెత్తేశారు.

ఆసీస్ అగ్రశ్రేణి బౌలర్‌గా చెప్పుకొనే మిచెల్ స్టార్క్ సైతం ఏకంగా 123 పరుగులు సమర్పించుకున్నాడు. అతనితో పాటు స్పెషలిస్ట్ స్పిన్నర్ నాథన్ లయన్ 178 పరుగులిచ్చేశాడు. ఆటలో రెండో రోజైన శుక్రవారం ఓవర్‌ నైట్ స్కోరు 303/4తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన టీమిండియా భారీ స్కోరుపై కన్నేసి తొలి సెషన్ నుంచి దూకుడు మొదలుపెట్టేసింది.

తొలి ఇన్నింగ్స్‌ని 622/7తో డిక్లేర్ చేసిన భారత్

గురువారం సెంచరీ మార్క్‌ని అందుకున్న చతేశ్వర్ పుజారా (193: 373 బంతుల్లో 22ఫోర్లు) శుక్రవారం కొద్దిలో డబుల్ సెంచరీని చేజార్చుకోగా.. రిషబ్ పంత్ (159 నాటౌట్: 189 బంతుల్లో 15ఫోర్లు, 1సిక్సు) వన్డే తరహా ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు. అతనికి తోడుగా రవీంద్ర జడేజా (81: 114 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్సు) కూడా బ్యాట్ ఝళిపించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌ని 622/7తో డిక్లేర్ చేసింది.

ఏడో వికెట్‌కి 204 పరుగుల భాగస్వామ్యంతో

పంత్- జడేజా జోడీ ఏడో వికెట్‌కి 204 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. మ్యాచ్‌లో 26 ఓవర్లు వేసిన మిచెల్ స్టార్క్ 123 పరుగులిచ్చి రహానె వికెట్ పడగొట్టగా.. 35 ఓవర్లు వేసిన హేజిల్‌వుడ్ 105 పరుగులిచ్చి కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక పాట్ కమిన్స్ అయితే.. 28 ఓవర్లు వేసి 101 పరుగులు ఇచ్చినా.. కనీసం ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. అయితే..

 178 పరుగులిచ్చినా 4 వికెట్లను

178 పరుగులిచ్చినా 4 వికెట్లను

స్పిన్నర్ నాథన్ లయన్ మాత్రం 178 పరుగులిచ్చి.. మయాంక్, పుజారా, విహారి, జడేజా రూపంలో నాలుగు వికెట్లు పడగొట్టగలిగాడు. భారత్ బ్యాట్స్‌మెన్‌ని కవ్వించడంలో తెగ ఉత్సాహం చూపిస్తూ వచ్చిన మిచెల్ స్టార్క్.. కనీసం ఒక మెయిడిన్ ఓవర్‌ కూడా వేయలేకపోవడం కొసమెరుపు.

Story first published: Friday, January 4, 2019, 17:09 [IST]
Other articles published on Jan 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X