న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్ సిరిస్‌‌కు ఆసీస్ జట్టు: ఏడేళ్ల తర్వాత జట్టులోకి, ట్విట్టర్‌లో విమర్శలు

నవంబర్ 23 నుంచి ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా యాషెస్ సిరిస్ ప్రారంభం కానుంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల యాషెస్ సిరిస్ కోసం ఎంపిక చేసిన ఆసీస్ జట్టుని ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు

By Nageshwara Rao
Australia Ashes Test squad ‘made by morons mascarading as mentors’

హైదరాబాద్: నవంబర్ 23 నుంచి ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా యాషెస్ సిరిస్ ప్రారంభం కానుంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల యాషెస్ సిరిస్ కోసం ఎంపిక చేసిన ఆసీస్ జట్టుని ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారు. 'అసలు ఇదొక టీమేనా? తెలివి తక్కువ వాళ్లు ఎంపిక చేసినట్లుంది' అంటూ ఆసీస్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ మెక్‌గిల్ ట్విట్టర్‌లో విమర్శించాడు.

అసలేం జరిగింది?

నవంబర్ 23 నుంచి మొదలయ్యే యాషెస్ టెస్టు సిరిస్ కోసం శుక్రవారం సెలక్టర్లు ఆస్ట్రేలియా జట్టుని ప్రకటించారు. ఈ జట్టులో వికెట్ కీపర్‌గా టిమ్ పెయిన్‌ను ఎంపిక చేయడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవల కాలంలో రాణిస్తున్న మాథ్యూ వేడ్, నెవిల్‌లను కాదని ఏడేళ్ల తర్వాత పెయిన్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు.

మరోవైపు ఓపెనర్ రెన్షాను కాదని కొత్త ఆటగాడు బాన్‌క్రాఫ్ట్‌ను, మ్యాక్స్‌వెల్, కార్ట్‌ రైట్‌లను కాదని 34 ఏళ్ల షాన్ మార్ష్‌ను తీసుకోవడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 32 ఏళ్ల టిమ్ పెయిన్‌ చివరిసారిగా 2010లో టెస్టు క్రికెట్ ఆడాడు. ఆ ఏడాది అక్టోబర్లో బెంగళూరులో భారత్‌తో జరిగిన టెస్టులో ఆడిన టిమ్.. తొలి ఇన్నింగ్స్‌లో 59 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 23 రన్స్ చేశాడు.

చివరగా ఆసీస్ మాజీ దిగ్గజం రికీ పాటింగ్ నాయకత్వంలో ఆడిన పెయిన్.. మళ్లీ ఇన్నాళ్లకు జట్టులో సంపాదించాడు. వికెట్ కీపర్ అయిన టిమ్ పెయిన్‌కు అనూహ్యంగా జట్టులో చోటు కల్పించిన సెలక్టర్లు, అతడికి దేశవాళీ టోర్నీలో వికెట్ కీపింగ్ బాధ్యతలను మాత్రం అప్పగించక పోవడం విశేషం. షెఫర్‌ఫీల్డ్‌తో జరిగిన మ్యాచ్లో టస్మానియా తరఫున మాథ్యూ వేడ్ కీపర్‌గా వ్యవహరించాడు.

ఆస్ట్రేలియా:
స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్, జాక్సన్ బర్డ్, ప్యాట్ కమిన్స్, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, జోష్ హేజిల్‌వుడ్, ఉస్మాన్ ఖవాజా, నేథన్ లయన్, షాన్ మార్ష్, టిమ్ పెయిన్, చాడ్ సేయర్స్, మిచెల్ స్టార్క్

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, November 17, 2017, 18:00 [IST]
Other articles published on Nov 17, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X