న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Aaron Finch : అదే మా కొంపముంచింది.. భారత్ లాంటి టీంపై గెలవాలంటే కేవలం ఆ ఒక్కటే సరిపోదు

Aussies Captain Aaron Finch Reveled The Reason Behind The Defeat Against India in 3rd T20I

హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ ఆసీస్ మూడో టీ20లో భారత్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. తద్వారా ఆసీస్‌పై 2-1తేడాతో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. టీ20 ప్రపంచకప్ ముందు ఆసీస్ లాంటి మేటి టీంను ఓడించడం భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయడం ఖాయం. ఈ మ్యాచ్‌లో తొలుత ఆస్ట్రేలియా నిర్ణీత 20ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 186పరుగులు చేయగా.. 187పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా.. 19.5ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ (69పరుగులు 36బంతుల్లో 5ఫోర్లు, 5సిక్సర్లు), విరాట్ కోహ్లీ (63పరుగులు 48బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో పాటు చివర్లో పాండ్యా (25) కీలక ఇన్నింగ్స్ ఆడి విజయలాంఛనాన్ని ముగించాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ తమ ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు.

ఒక టైంలో వెనకబడ్డా మళ్లీ కమ్ బ్యాక్ అయ్యాం

ఒక టైంలో వెనకబడ్డా మళ్లీ కమ్ బ్యాక్ అయ్యాం

మ్యాచ్ ప్రెజెంటేషన్ టైంలో ఫించ్ మాట్లాడుతూ.. 'నిజంగా ఇది చాలా మంచి సిరీస్. మేము మ్యాచ్‌లో ఒకానొక టైంలో వెనకబడ్డ తిరిగి కమ్ బ్యాక్ అయి పోరాడిన విధానం అద్భుతం. ఈ మ్యాచ్‌లో కెమరూన్ గ్రీన్ లాంటి యువ ఆటగాడు ఎలాంటి ప్రభావం చూపగలడో మేం చూశాం. అయితే మా ఓటమికి కారణం చెప్పాలంటే మేము మరో రెండు మూడు వికెట్లు తీయాల్సింది. భారత్‌ లాంటి జట్టుపై బాల్స్ డాట్ చేయిస్తూ గెలవలేము. తప్పకుండా వికెట్లు తీస్తేనే గెలుపు సాధ్యమవుతుంది.'

గ్రీన్ అల్ట్రా దూకుడు సంతోషాన్నిచ్చింది.

గ్రీన్ అల్ట్రా దూకుడు సంతోషాన్నిచ్చింది.

'వికెట్లు తీయకపోవడమే మా కొంపముంచింది. ఎందుకంటే భారత్ వరల్డ్ క్లాస్ టీం. ఒకరిద్దరు బ్యాటర్లు చివరి వరకు ఉన్నా.. ఆ జట్టు గెలవడం పక్కా. ఇక మేం బ్యాటింగ్ టైంలో కొంత అలసత్వం ప్రదర్శించాం. ఫీల్డింగ్ పరంగాను కాస్త అలసత్వం చూపించాం. ఏదేమైనా భారత్ లాంటి ప్రపంచస్థాయి జట్టుతో ఇలాంటి గట్టి సిరీస్ ఆడటం మా ప్లేయర్లకు మంచి ప్రాక్టీస్‌ను ఇస్తుంది. ముఖ్యంగా గ్రీన్ తన అల్ట్రా-దూకుడు విధానంతో గేమ్‌ను తీసుకున్న విధానం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. '

హడలెత్తించిన కెమరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్

హడలెత్తించిన కెమరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్

ఇక ఈ మ్యాచ్‌లో ఆసీస్ యువ బ్యాటర్లు కామెరూన్ గ్రీన్ (52పరుగులు 21బంతుల్లో 7ఫోర్లు, 3సిక్సర్లు), టిమ్ డేవిడ్ (54పరుగులు 27బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో హడలెత్తించారు. టిమ్ డేవిడ్‌కు తోడుగా చివర్లో డేనియల్ సామ్స్ (28పరుగులు 20బంతుల్లో 1ఫోర్, 2సిక్సర్లు) మంచి సహకారమందించాడు. వీరిద్దరు కలిసి 7వ వికెట్‌కు 68పరుగుల భాగస్వామ్యాన్నిచ్చారు. అయితే టాప్ ప్లేయర్లు అయిన స్మిత్, ఫించ్, మ్యాక్సీ, వేడ్ ఈ మ్యాచ్‌లో విఫలమవ్వడం వల్ల ఆసీస్ స్కోరు 186కే పరిమితమైంది. లేకుంటే ఈజీగా 200పైచిలుకు స్కోరు వెళ్లేది. అక్షర్ పటేల్ వరుసగా మూడు మ్యాచ్‌లలో మంచి ప్రదర్శన కనబరిచాడు. మూడో టీ20లో 4ఓవర్లలో 3వికెట్లు తీసి 22పరుగులే ఇచ్చాడు.




Story first published: Monday, September 26, 2022, 7:18 [IST]
Other articles published on Sep 26, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X