న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

AUS vs WI:ఓడిపోయే మ్యాచ్‌లో గెలిపించిన మాథ్యూ వేడ్.. ఉత్కంఠపోరులో వెస్టిండీస్‌ ఓటమి!

AUS vs WI: Australia beat West Indies Australia won by 3 wickets

కర్రార: టీ20 ప్రపంచకప్‌కు ముందు సొంతగడ్డపై వెస్టిండీస్‌తో ఆడుతున్న రెండు టీ20ల సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. క్వీన్స్ లాండ్ వేదికగా బుధవారం జరిగిన తొలి పోరులో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆసాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఆరోన్ ఫించ్(53 బంతుల్లో 6 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. మాథ్యూవేడ్(29 బంతుల్లో 5 ఫోర్లతో 39 నాటౌట్) విలువైన పరుగులు చేయడంతో ఆసీస్ ఓటమి నుంచి గట్టెక్కింది.

చిన్న టార్గెట్..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులు చేసింది. విండీస్ జట్టులో ఓపెనర్ కైల్ మేయర్స్(36 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 39), ఓడియన్ స్మిత్(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ రెండేసి వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేసి విజయాన్నందుకుంది.

ఆదుకున్న ఫించ్, మాథ్యూవేడ్..

58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఆసీస్ ను కెప్టెన్ ఆరోన్ ఫించ్, మాథ్యూ వేడ్ ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి ఆరో వికెట్ కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. విండీస్ బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా నిలకడగా బ్యాటింగ్ చేశారు. అయితే 18వ ఓవర్లో తొలి బంతికి ఫించ్ నిష్క్రమించాడు. అతని స్థానంలో వచ్చిన కమిన్స్ (4) కూడా స్మిత్ తన 19వ ఓవర్లో నాలుగో బంతికి బౌల్డ్ చేశాడు. దీంతో ఉత్కంఠ మొదలైంది.

క్యాచ్ నేలపాలు చేసి..

చివరి ఓవర్లో 11 పరుగులు అవసరమవ్వగా.. తొలి బంతికి వేడ్ ఫోర్ కొట్టి విజయానికి బాటలు వేసాడు. అయితే రెండో బంతికి అతను ఇచ్చిన క్యాచ్‌ను డీప్ పాయింట్ వద్ద రీఫర్ డ్రాప్ చేయడం ఆసీస్‌కు కలిసొచ్చింది. ఆ తర్వాత బంతికి సింగిల్ రాగా.. నాలుగో బంతికి స్టార్క్ (6 నాటౌట్) రెండు పరుగులు తీసాడు. ఐదో బంతికి కూడా డబుల్ తీయడంతో ఆసీస్ విజయం లాంఛనమైంది. ఆసీస్ ఇన్నింగ్స్ తొలుత చూపించిన జోరును విండీస్ బౌలర్లు మధ్యలో జారవిడవడంతో ఆ జట్టు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

పేలవ బ్యాటింగ్..

అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. బ్యాటింగ్ లో విఫలమైంది. ఆ జట్టు ఓపెనర్ కైల్ మేయర్స్ , ఓడియన్ స్మిత్ (27) మినహా మిగిలినవారంతా విఫలమయ్యారు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే హజెల్ వుడ్ తన వరుస ఓవర్లలో ఓపెనర్ చార్ల్స్(3), బ్రాండన్ కింగ్ (12) ను ఔట్ చేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు మేయర్స్ దంచికొట్టడంతో విండీస్ పవర్ ప్లేలో 2 వికెట్లకు 53 పరుగులు చేసింది.

అనంతరం స్పిన్నర్ల రాకతో విండీస్ పరుగుల వేగం నెమ్మదించింది. కమిన్స్ వేసిన పదో ఓవర్లో మేయర్స్ నిష్క్రమించిన తర్వాత విండీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ నికోలస్ పూరన్ (2), రీఫర్ (19), జేసన్ హెల్డర్ (13), పావెల్ (7), అల్జారి జోసెఫ్ (7) దారుణంగా విఫలమయ్యారు. చివర్లో ఒడియన్ స్మిత్ మెరుపులతో విండీస్ ఆసీస్ ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఈనెల 7న బ్రిస్బేన్ లో జరుగుతుంది.

Story first published: Thursday, October 6, 2022, 8:28 [IST]
Other articles published on Oct 6, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X