న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియాకు సత్తాకు అసలు పరీక్ష- సెమీస్ చేరాలంటే ఇదీ లెక్క: ఏ మాత్రం తేడా కొట్టినా..!!

AUS vs AFG: Australia must win big and make huge net run rate gains against Afghanistan

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంటోంది. సూపర్ 12 మ్యాచ్‌లన్నీ ఒక్కటొక్కటిగా ముగుస్తోన్నాయి. ఎల్లుండితో సూపర్ 12 మ్యాచ్‌లన్నీ ముగుస్తాయి. 9వ తేదీ నుంచి సెమీ ఫైనల్స్ మొదలవుతాయి.

ప్రస్తుతం 12 జట్లు సూపర్ 12లో ఆడుతోన్నాయి. ఇందులో ఆరు జట్లు ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది. సెమీఫైనల్స్ చేరే అవకాశం నాలుగు జట్లకు మాత్రమే లభిస్తుంది. సెమీ ఫైనల్స్ చేరే జట్టు ఏదనే లెక్క ఇవ్వాళ్టితో తేలిపోనుంది.

 ఈ మూడు రోజుల్లో..

ఈ మూడు రోజుల్లో..

సెమీ ఫైనల్స్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో ఈ మూడు రోజుల్లో జరిగే మ్యాచ్‌లన్నీ అత్యంత కీలకంగా మారాయి. న్యూజిలాండ్-ఐర్లాండ్, ఆస్ట్రేలియా- ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇవ్వాళ మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. రేపు ఇంగ్లాండ్.. శ్రీలంకతో తలపడుతుంది. ఆదివారం బ్లాక్ బస్టర్ మ్యాచ్‌లు ఉన్నాయి. నెదర్లాండ్స్-దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్-పాకిస్తాన్, భారత్-జింబాబ్వే ఆడనున్నాయి. ఇవన్నీ ఆయా జట్లను సెమీ ఫైనల్స్‌ ప్రస్థానాన్ని నిర్దేశించేవే.

 ఆఫ్ఘనిస్తాన్‌తో ఆసీస్..

ఆఫ్ఘనిస్తాన్‌తో ఆసీస్..

ఆస్ట్రేలియా సత్తాకు ఇవ్వాళ్టి మ్యాచ్ అగ్నిపరీక్షగా మారింది. ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనున్న ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో విజయం సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందా జట్టుకు. ఏ మాత్రం తేడా కొట్టినా సెమీ ఫైనల్స్‌కు చేరుకునే అవకాశాలను క్లిష్టతరం చేసుకుంటుంది. ఈ మ్యాచ్‌ను భారీ తేడాతో సొంతం చేసుకోగలిగితే ఆసీస్‌కు ఎలాంటి టెన్షనూ ఉండదు. నేరుగా సెమీ ఫైనల్స్‌లోకి అడుగుపెడుతుంది. దీని కోసం ఆ జట్టు పోరాడటానికి సమాయాత్తమౌతోంది.

ఇంగ్లాండ్ విజయంతో..

ఇంగ్లాండ్ విజయంతో..

బ్రిస్బేన్ గబ్బా స్టేడియంలో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్ విజయం సాధించడంతో ఆస్ట్రేలియా సెమీఫైనల్‌ అవకాశాలను కష్టసాధ్యం చేసింది. న్యూజిలాండ్‌ ఇవ్వాళ ఐర్లాండ్ చేతిలో ఓడిపోయినా లేదా ఇంగ్లాండ్‌పై శ్రీలంక ఘన విజయాన్ని సాధించినా- ఆస్ట్రేలియా సెమీస్ అవకాశాలు మెరుగుపడతాయి. ఆఫ్ఘన్‌పై నెట్ రన్‌రేట్ గురించి కూడా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం గ్రూప్ 1లో ఆస్ట్రేలియా మూడోస్థానంలో నిలిచింది. సెమీస్ చేరాలంటే తొలి రెండు స్థానాల్లో నిలవాల్సిన అవసరం తప్పనిసరి.

 60 పరుగులతో..

60 పరుగులతో..

ఆస్ట్రేలియా నెట్ రన్‌రేట్ 0.304. రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్‌ నెట్ రన్‌రేట్ +0.547. దీన్ని అధిగమించాలంటే ఆప్ఘనిస్తాన్‌ను భారీ తేడాతో ఓడించాల్సి ఉంటుంది ఆస్ట్రేలియాకు. మొదట బ్యాటింగ్ చేస్తే సుమారు 60 పరుగులతో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించాలి లేదా దాదాపు 13 ఓవర్లలో 140 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది.

Story first published: Friday, November 4, 2022, 8:39 [IST]
Other articles published on Nov 4, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X