న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెమీస్ ఆశలు సజీవం: ఇంగ్లాండ్ విజయానికి కారణమిదే!

 Attacking Yuzvendra Chahal, Kuldeep Yadav changed the game for England: Eoin Morgan

హైదరాబాద్: బర్మింగ్ హామ్ వేదికగా ఆదివారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్లు బెయిర్ స్టో, జేసన్ రాయ్ మంచి ఆరంభాన్నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలి పవర్‌ప్లేలో 47 పరుగులే చేసిన ఓపెనర్లు‌.. ఆ తర్వాతి 10 ఓవర్లలో ఏకంగా 97 పరుగులు రాబట్టారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఇదే మ్యాచ్‌ తమవైపు తిరిగేలా చేసిందని మ్యాచ్‌ అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ చెప్పుకొచ్చాడు. మ్యాచ్ అనంతరం మోర్గాన్ మాట్లాడుతూ "10 నుంచి 20 ఓవర్ల మధ్యే మ్యాచ్‌ మావైపు తిరిగింది. ఈ ఓవర్లలో సుమారు 90 పరుగులు చేసామనుకుంటా. ఈ తరహా ఆటనే మేం ఆశిస్తున్నాం" అని అన్నాడు.

"పిచ్‌ పేస్‌కు అనుకూలిస్తుండటంతో బంతి ఏమాత్రం బ్యాట్‌పైకి రాలేదు. అందుకే చిన్నగా కట్టర్స్‌, స్లో బంతులను ఆడాం. బెయిర్‌స్టో, జేసన్‌ దూకుడుగా ఆడి మ్యాచ్‌ను మావైపుకు తిప్పారు. సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ ఇది. ఈ గెలుపు మాలో ఎంతో ఉత్సాహన్ని నింపింది" అని మోర్గాన్ అన్నాడు.

"గత రెండు మ్యాచ్‌ల్లో మేము ఓటమిపాలయ్యాం. దీంతో ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. భారత్ లాంటి జట్టుపై సమిష్టిగా రాణించాం. ఈరోజు మ్యాచ్‌లో నిజంగానే మేం అద్భుతం సృష్టించాం. ఇదే స్పూర్తితో మిగతా మ్యాచ్‌లను కూడా గెలుస్తాం" అని ఇయాన్ మోర్గాన్ పేర్కొన్నాడు.

మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసింది

మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసింది

"ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలవడం.. బ్యాటింగ్‌ ఎంచుకోవడం అన్నీ మాకు కలిసొచ్చాయి. జేసన్‌ పునరాగమనం, బెయిర్‌స్టో విధ్వంసం ఇలా. ఓపెనర్ల భారీ భాగస్వామ్యం భారీ లక్ష్యాన్ని నిర్ధేశించేలా చేసింది. చైనామన్ స్పిన్నర్లపై జేసన్‌ రాయ్, బెయిర్‌స్టో విరుచుకుపడటం మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసింది" అని మోర్గాన్ అన్నాడు.

భారీగా పరుగులిచ్చిన కుల్దీప్, చాహల్

భారీగా పరుగులిచ్చిన కుల్దీప్, చాహల్

గత నాలుగేళ్లుగా ఎలాంటి క్రికెట్ అయితే ఆడుతున్నామో ఈ మ్యాచ్‌లో కూడా ఎలాంటి బెరుకు లేకుండా ఆడామని మోర్గాన్ తెలిపాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో భారత చైనామన్ స్పిన్నర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 10 ఓవర్లు వేసిన చాహల్‌ ఏకంగా 88 పరుగులు సమర్పించుకుని ఓ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.

ఇంగ్లాండ్ సెమీస్ ఆశలు సజీవం

ఇంగ్లాండ్ సెమీస్ ఆశలు సజీవం

ఇక, కుల్దీప్ యాదవ్ సైతం 72 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 338 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో లియాం ప్లెంకెట్ మూడు వికెట్లు తీయగా... క్రిస్ వోక్స్ రెండు వికెట్లు తీశాడు. తాజా విజయంతో ఇంగ్లాండ్ తన సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

7 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసిన ఇంగ్లాండ్

7 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసిన ఇంగ్లాండ్

చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో గెలిస్తే ఇంగ్లాండ్ సెమీస్‌కు చేరుతుంది. ఇక, ఈ మెగా టోర్నీలో కోహ్లీసేన ఇంకా బంగ్లాదేశ్, శ్రీలంకతో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో ఏ ఒక్క మ్యాచ్ గెలిచినా భారత్ సెమీస్‌కు వెళ్తుంది.

అంతకముందు జానీ బెయిర్‌ స్టో(111), బెన్‌ స్టోక్స్‌(79‌), జేసన్‌ రాయ్‌(66) హాఫ్‌ సెంచరీలతో రాణించడంతో ఇంగ్లాండ్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది.

1
43681

{headtohead_cricket_3_2}

Story first published: Monday, July 1, 2019, 13:21 [IST]
Other articles published on Jul 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X