న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్ 100వ సెంచరీ చేసిన వేళ బంగ్లా చేతిలో భారత్ ఓటమి

Asia Cup: Sachin Tendulkar gets 100th hundred but receives a lukewarm welcome

హైదరాబాద్: సెప్టెంబర్ 15 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఆరు జట్లు కూడా రెండు గ్రూపులుగా విడిపోయి పోటీ పడనున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ 14వ ఆసియా కప్ కావడం విశేషం.

ఈ నేపథ్యంలో గత ఆసియా కప్ టోర్నీలో జరిగిన మ్యాచ్‌లను ప్రత్యేక కథనాలుగా మైఖేల్ తెలుగు అందిస్తోన్న సంగతి తెలిసిందే. 24 ఏళ్ల తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన రికార్డులను నెలకొల్పిన క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఈ ఆసియా కప్ టోర్నీలో తన 100వ సెంచరీని సాధించడం విశేషం.

మార్చి 17, 2012లో మిర్‌పూర్ వేదికగా

మార్చి 17, 2012లో మిర్‌పూర్ వేదికగా

బంగ్లాదేశ్‌తో మిర్‌పూర్ వేదికగా మార్చి 17, 2012లో జరిగిన మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో 100వ సెంచరీని నమోదు చేశాడు. అయితే, ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో భారత జట్టు 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో సచిన్ 100వ సెంచరీకి అంతగా గుర్తింపు రాలేదు. ఈ ఆసియా కప్ టోర్నమెంట్ బంగ్లాదేశ్ వేదికగా జరిగింది. ఈ ఆసియా కప్ బరిలో దిగడానికి ముందు సచిన్ టెండూల్కర్ 99 సెంచరీలు చేసి ఉన్నాడు.

33 ఇన్నింగ్స్‌లు తీసుకున్న సచిన్

33 ఇన్నింగ్స్‌లు తీసుకున్న సచిన్

అయితే, తన 100వ సెంచరీ చేయడానికి మాత్రం సచిన్ 33 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. అంతేకాదు ఇందుకు గాను ఏడాదిన్నర సమయం పట్టింది. సచిన్ 100వ సెంచరీ సాధించే క్రమంలో అభిమానుల సహానానికి పరీక్షగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 102 బంతుల్లో 80 పరుగులు చేసిన సచిన్, మిగిలిన 20 పరుగులు చేసేందుకు గాను 36 బంతులను ఎదుర్కొవాల్సి వచ్చింది.

147 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో సెంచరీ

147 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో సెంచరీ

మొత్తానికి ఈ మ్యాచ్లో సచిన్ 147 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో 114 పరుగులతో సెంచరీ సాధించాడు. తన 100వ సెంచరీని సాధించే క్రమంలో సచిన్ ఒత్తిడిలో కనిపించాడు. అందుకు కారణం ఉంది. ఎందుకంటే అది 100వ సెంచరీ కాబట్టి. అయితే, తన వ్యక్తిగత రికార్డు కోసం భారత జట్టుకు విజయాన్ని దూరం చేశాడనే అపవాదుని కూడా అప్పట్లో సచిన్ మూటగట్టుకున్నాడు.

 అప్పట్లో సచిన్‌పై తీవ్ర విమర్శలు

అప్పట్లో సచిన్‌పై తీవ్ర విమర్శలు

ఈ మ్యాచ్‌లో 36 ఓవర్లు ముగిసే సరికి 173/1 స్కోరుతో ఉన్న 50 ఓవర్లు ముగిసే సరికి 289 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేక పోయింది. ఇందుకు కారణం సచిన్ టెండూల్కర్ చాలా బంతులను వృథా చేయడమేనని అప్పట్లో క్రికెట్ విశ్లేషకులు తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు, సచిన్ టెండూల్కర్ కెరీర్‌లో అత్యంత నెమ్మదిగా చేసిన రెండో సెంచరీ కూడా ఇదే కావడం విశేషం. అప్పట్లో టీమిండియాపై విజయం సాధించాలని బంగ్లాదేశ్ ఆకలితో ఉంది.

సమిష్టిగా రాణించిన బంగ్లాదేశ్

సమిష్టిగా రాణించిన బంగ్లాదేశ్

అయితే, ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ సమిష్టిగా రాణించి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. బంగ్లాదేశ్ క్రికెటర్లలో తమీమ్ ఇక్బాల్(70), ఇస్లామ్(53), నాసిర్ హుస్సేన్(54), షకీబ్ ఉల్ హాసన్(49), రహీం(46) పరుగులతో రాణించారు. దీంతో మరో నాలుగు బంతులు మిగిలుండగానే భారత్‌పై బంగ్లాదేశ్ విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో సచిన్ తన 100వ సెంచరీని సాధించాడన్న సంతృప్తిని మిగిల్చింది.

Story first published: Tuesday, September 11, 2018, 17:27 [IST]
Other articles published on Sep 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X