న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా కప్ గణాంకాలు: భారత రికార్డుని పాక్ సమం చేసేనా?

Asia Cup India vs Pakistan Stats: Pakistan look to level record against India

హైదరాబాద్: యూఏఈ వేదికగా ఆసియా కప్‌లో ఎన్ని మ్యాచ్‌లు జరిగినా భారత్-పాక్ మ్యాచ్‌కు ఉండే ప్రత్యేకతే వేరు. ఆసియా కప్ షెడ్యూల్ విడుదలైనప్పట్నించి ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాలకు చెందిన అభిమానులు ఎంతో ఆసిక్తిగా ఎదురు చూస్తున్నారు.

హాంకాంగ్‌తో మ్యాచ్: వారిద్దరే కీలకమన్న కెప్టెన్ రోహిత్ శర్మహాంకాంగ్‌తో మ్యాచ్: వారిద్దరే కీలకమన్న కెప్టెన్ రోహిత్ శర్మ

అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ టోర్నీలో భారత్-పాక్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు (ఫైనల్‌తో కలిపి) జరిగే అవకాశం ఉంది. టోర్నీలో భాగంగా మంగళవారం హాంకాంగ్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న టీమిండియా... ఆ తర్వాతి రోజైన బుధవారం పాకిస్థాన్‌తో అమీతుమీత తేల్చుకోనుంది.

రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో ఆసియా కప్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహారించనున్నాడు. దీంతో ఈ టోర్నీలో టీమిండియా ఎలా ఆడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. బ్యాట్స్‌మన్‌గా ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మకు కెప్టెన్‌గా ఇది కఠిన పరీక్షే.

నష్టాల్లో కేరళ బ్లాస్టర్స్: సచిన్ తప్పుకోవడానికి అసలు కారణం ఇదేనా?నష్టాల్లో కేరళ బ్లాస్టర్స్: సచిన్ తప్పుకోవడానికి అసలు కారణం ఇదేనా?

ఈ టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. చివరిసారిగా భారత్-పాక్‌లు గతేడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడ్డాయి. ఓవల్ వేదికగా జరిగిన ఫైనల్లో టీమిండియాను చిత్తుగా ఓడించిన పాక్ దానిని మళ్లీ పునరావృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్‌కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు పాఠకుల కోసం...

* ఆసియా కప్‌లో భారత్-పాక్ జట్లు ఇప్పటివరకు 12 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 6 సార్లు నెగ్గగా, పాక్ 5 సార్లు విజయం సాధించింది. ఒకసారి ఫలితం తేలలేదు.

* ఆసియా కప్‌లో అత్యంత విజయవంతమైన దేశంగా భారత్‌కు పేరుంది. ఆసియా కప్‌ను భారత్ ఆరు సార్లు నెగ్గగా, పాకిస్థాన్ కేవలం రెండు సార్లు మాత్రమే సాధించింది.

* ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. 12 మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ 45.90 యావరేజితో 459 పరుగులు నమోదు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుత ఆసియా కప్‌లో కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు.

* పాక్ తరుపున ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మహమ్మద్ హఫీజ్ నిలిచాడు. మొత్తం 9 మ్యాచ్‌ల్లో 54.62 యావరేజితో 437 పరుగులు చేశాడు.

* ఆసియా కప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో పేసర్ భువనేశ్వర్ కుమార్ అగ్రస్థానంలో నిలిచాడు. మొత్తం 7 మ్యాచ్‌ల్లో భువీ 11 వికెట్లు తీశాడు. ఇషాంత్ శర్మ కూడా భువీతో సమానంగా 11 వికెట్లు తీశాడు.

* పాక్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ నిలిచాడు. మొత్తం 9 మ్యాచ్‌లాడిన అజ్మల్ 20 వికెట్లు పడగొట్టాడు. అజ్మల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

* 2012లో జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై విరాట్ కోహ్లీ చేసిన 183 పరుగులే ఇప్పటివరకు ఆసియా కప్‌ టోర్నీలో ఓ ఆటగాడు చేసిన అత్యధిక పరుగులు కావడం విశేషం.

* భారత్ Vs పాకిస్థాన్ ముఖాముఖి పోరు ఇలా:
1984 : Ind beat Pak by 54 runs.
1988 : Ind beat Pak by 4 wickets.
1995 : Pak beat Ind by 97 runs.
1997 : Match abandoned due to rain.
2000 : Pak beat Ind by 44 runs.
2004 : Pak beat Ind by 59 runs.
2008 : Ind beat Pak by 6 wickets.
2010: Ind beat Pak by 3 wickets.
2012 : Ind beat Pak by 6 wickets.
2014 : Pak beat Ind by 1 wicket.
2016 : Ind beat Pak by 5 wickets. (T20)
2016 Asia Cup: India beat Pakistan by 5 wickets.

Story first published: Tuesday, September 18, 2018, 12:38 [IST]
Other articles published on Sep 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X