న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రీడా నిబంధనలు ఉల్లంఘించారని జరిమానాకు గురైన 3 క్రికెటర్లు

Asia Cup: Hasan Ali, Asghar Afghan and Rashid Khan reprimanded by ICC for Level 1 breach

న్యూఢిల్లీ: ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌‌ కొత్త గొడవలకి తెరలేపింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఆధిపత్యం కోసం ప్రయత్నించగా.. హద్దులుమీరిన ముగ్గురు క్రికెటర్లకి జరిమానా కూడా పడింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేయగా.. పాక్ 49.3 ఓవర్లలోనే 258/7తో గెలిచి ఊపిరి పీల్చుకుంది. చివరి ఓవర్‌లో 10 పరుగులు అవసరమవగా.. షోయబ్ మాలిక్ వరుసగా 6, 4 బాది పాక్‌ని గెలిపించాడు.

ఫీజులో 15 శాతం కోత.. ఓ డీమెరిట్ పాయింట్ కూడా:

ఫీజులో 15 శాతం కోత.. ఓ డీమెరిట్ పాయింట్ కూడా:

ఇందులో వేర్వేరు సందర్భాల్లో అఫ్గానిస్థాన్‌ క్రికెటర్లు రషీద్‌ ఖాన్‌, మొహమ్మద్‌ అస్గర్‌.. పాకిస్థాన్‌ ఆటగాడు హసన్‌ అలీ నిబంధనలను ఉల్లంఘించారని అంపైర్లు అనిల్‌ చౌదరి, షౌన్‌ జార్జ్‌, మూడో‌ అంపైర్‌ రోడ్‌ టుకెర్‌, నాలుగో అంపైర్‌ అనిస్‌ ఉర్‌ రహ్మాన్‌ గుర్తించారు. దీంతో ముగ్గురు ఆటగాళ్ల మ్యాచు ఫీజులో 15 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. ఈ జరిమానాతో పాటు ముగ్గురు క్రికెటర్ల ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ కూడా చేర్చింది.

క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించారని‌..

క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించారని‌..

హసన్‌, అస్గర్ మైదానంలో క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించారని‌.. ఆ తీరు ప్రవర్తనా నియమావళి ఆర్టికల్‌ 2.1.1 ను ఉల్లంఘించినట్లేనని ఐసీసీ పేర్కొంది. ఇక రషీద్‌ తన భాష, మైదానంలో ప్రవర్తించిన తీరుతో‌ ఆర్టికల్‌ 2.1.7 నిబంధనను ఉల్లంఘించాడని తెలిపింది.

నిబంధనలను ఉల్లంఘించిన రషీద్‌ ఖాన్‌

నిబంధనలను ఉల్లంఘించిన రషీద్‌ ఖాన్‌

కాగా, శుక్రవారం జరిగిన మ్యాచులో పాకిస్థాన్‌ లోయర్‌-ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ అసిఫ్‌ అలీ ఔట్‌ అయిన సందర్భంలో ఆయన వైపునకు చేతి వేలును చూపుతూ అఫ్గానిస్థాన్‌ స్పిన్నర్ రషీద్‌ ఖాన్‌ నిబంధనలను ఉల్లంఘించాడు. 37వ ఓవర్లో అఫ్గానిస్థాన్‌ పేసర్‌ హసన్‌ అలీని చూస్తూ అస్గర్‌ తన భుజాలను చేతులను రుద్దుకుంటున్నట్లు ప్రవర్తించాడు.

బంతి చేతిలో లేనప్పటికీ నటించినందుకు

బంతి చేతిలో లేనప్పటికీ నటించినందుకు

ఇక 33వ ఓవర్లో బంతి చేతిలో లేనప్పటికీ దాన్ని అఫ్గానిస్థాన్‌ టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ హస్మతుల్లా షాహిది వైపునకు విసురుతున్నట్లు నటించినందుకు గానూ పాకిస్థాన్‌ క్రికెటర్ హసన్‌ అలీకి జరిమానా విధించారు.

Story first published: Sunday, September 23, 2018, 10:35 [IST]
Other articles published on Sep 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X